కళాతపస్వి విశ్వనాథ్ అస్తమయం

సంతాపం ప్రకటించిన ప్రముఖలు

హైదరాబాద్. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. అస్తమించారు… దర్శకత్వం తో   తెలుగు దశను నలుదిశలు వ్యాపింపచేసిన దర్శకుడు గాపేరుగడించారుకళతపస్వి.. అలాంటి  దర్శకుడు మరణించడంతో సినిమా పరిశ్రమ ప్రముకులు సంతాపాన్ని తెలిపారు.1930ఫిబ్రవరి 19న తెనాలి దగ్గర పేద పులివర్రు గ్రామంలో లో జన్మించారు
ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారువిద్యాభ్యాసం విజయవాడ గుంటూరు లో జరిగింది.
దర్శకుడిగా తొలి చిత్రం 1966 లో అక్కినేనినాగేశ్వరావు హీరోగా నటించిన ఆత్మగౌరవం చివరిది చిత్రం శుభప్రదం 2010 .తెలుగులో 41 సినిమాలు హిందీ లో 10సినిమాలకు దర్శకత్వం వహించారు. మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.ఆయన నటించిన తొలి చిత్రం 2002 లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరి లో చివరి చిత్రం 2012 లో వచ్చిన జీనియస్ దాదాపు 20పైగా చిత్రాల్లో నటించారు.1992 రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992 లో పద్మశ్రీ అవార్డ్, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారుజాతీయ చలన చిత్ర అవార్డులు శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, శ్రుతి లయలు, స్వరాభిషేకం మొట్టల్, 6 సినిమాలకు అందుకున్నారు.చెన్నై లో ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు.అన్నపూర్ణ సంస్థనిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకుపనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు.ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు.ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.
సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి శంకరాభరణం. సినిమా.జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి లాంటిది.
భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు.వాటిలోకొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల పై కూడా విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు.సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.తన సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చేవారుకేవీ మహదేవన్, ఇళయరాజా సంగీత దర్శకులుగా పని చేశారు

Leave A Reply

Your email address will not be published.