కబడ్డీతో ఆటగాళ్లకు దడపుట్టించిన మంత్రి

ఆటే నా ఆరోగ్య రహస్యం‌ ‌మంత్రి ఎర్రబెల్లి

జనగామ

కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కబడ్డీ ఆట ఆడాడు. రైడింగ్ కు వెళ్ళి పాయింట్ తేలేకపోయారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో మూడు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి కబడ్డీ ఆటల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఆటలు ప్రారంభించి ఊరుకోకుండా తనదైన శైలిలో కూత పెట్టాడు. కబడ్డీ కబడ్డీ అంటూ రైడింగ్ కు వెళ్ళి ఆటల్లో తనకు చాటేలేరని నిరూపించారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఎర్రబెల్లి, పిల్లాడిలా కబడ్డీ కూత కెళ్ళి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చిన్నప్పుడు కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ ఆటల్లో కెప్టెన్ గా ఉండేవాడినని తెలిపారు.

వరంగల్ జిల్లా కబడ్డీ జట్టు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఆటలు ఆడిస్తే, అన్ని ప్రైజ్ లు నాకే వచ్చేవని తెలిపారు. ఆటలతోనే ఆరోగ్యంగా ఉన్నానని ఆయన ఆరోగ్య రహస్యం చెప్పుకొచ్చారు. వాలీబాల్ జిల్లా స్థాయి అధ్యక్షుడుగా నేను, ప్రధాన కార్యదర్శిగా కడియం శ్రీహరి ఉన్నామని జ్నాపకాలు గుర్తు చేసుకున్నారు మంత్రి

Leave A Reply

Your email address will not be published.