ప్రత్యక్ష. ఎన్నికలకు దూరమవుతున్నా కేంద్రమాజీ మంత్రి వేణుగోపాల చారి?

.

 

నాలుగు సార్లు ఎమ్మెల్యే..‌ మూడు సార్లు ఎంపి… ఓసారికేంద్రమంత్రి… మరోసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను కనుసైగలతో నడిపించిన. నాయకుడు వేణుగోపాలచారి.. గులాబీ దళంలో కీలకమైనా నాయకుడు… రాజ్యసభ పదవి .. లేదంటే ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని కలలుకన్నారు, కాని ‌ తెలంగాణ సర్కార్ నీటి పారుదల శాఖ కార్పొరేషన్ పదవితో చారికి పట్టాబిషేకం చేసింది.. నామినేట్ పదవి దక్కినా చారికి సంత్రుప్తి లేదా అసంతృప్తితో ఉన్నారా. ఇక ప్రత్యక్ష ఎన్నికల యుద్దానికి దూరమైనట్లేనా…. ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నా చారి పై ప్రత్యేక కథనం

 

ఆదిలాబాద్.  శబ్దాల. రాజకీయ అనుభవం… కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా సముద్రాల వేణుగోపాలచారి ‌ పనిచేశారు.. ‌ ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను శాసించిన. నాయకుడు చారి.. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంబించారు.. నిర్మల్ నియోజకవర్గం నుండి 1985, 1989,1994 ఎన్నికలలో ఎమ్మెల్యేగా హ్యట్రిక్ విజయం సాదించారు… అదేవిధంగా 2009 ఎన్నికలలో ముథోల్ నుండి విజయం సాదించారు.. 1994లో ఎమ్మెల్యేగా విజయం సాదించిన తర్వాత. రాష్ట్రమంత్రిగా పనిచేశారు..1996నుండి,2004 వరకు మూడు సార్లు ఎంపిగా విజయం సాధించారు.. ‌కేంద్రమంత్రిగా పనిచేశారు.. అప్పట్లో జిల్లా రాజకీయాలను శాసించిన నాయకునిగా పేరు గడించారు.

 

”­. ‌అయితే మారినరాజకీయపరిస్థితులలో తెలంగాణ. రాకముందు అప్పటి టిఅర్ ఎస్ పార్టీలో చేరారు… తెలంగాణ కోసం ఉద్యమించారు… 2014 ఎన్నికలలో టిఅర్ ఎస్ నమ అభ్యర్థిగా ముథోల్ నుండి పోటీ చేశారు. …విఠల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు..2018 ఎన్నికలలో పార్టీ టిక్కెట్ దక్కలేదు.. టిక్కెట్ దక్కకపోయిన. పార్టీ విజయం కోసం పనిచేశారు‌.పార్టీని గెలిపించారు..

తెలంగాణ. రాష్ట్ర అవతరించిన తర్వాత.డిల్లీలో . తెలంగాణ. అదికార ప్రతినిదిగా చారిని నియమించింది… 2018 ఎన్నికలలో ఉమ్మడి అదిలాబాద్ లో పోటీ చేయకపోయినా పార్టీని విజయపథాన నడిపించారు.. ఇక. రెండోసారి పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత ‌మంచి పదవి లభిస్తుందని చారి ఎన్నో ఆశలు పెట్టుకున్నారట

ప్రదానంగా సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబందాలు ఉండటంతో రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయని చారి ఆశించారట… ప్రభుత్వం ఏర్పడినాలుగేళ్లు గడించిన. రాజ్య సభ, ఎమ్మెల్సీ పదవులకు ఆయనను ఎంపిక చేయలేదు.. దాంతో చారి తీవ్రమైన అసంత్రుప్తికి గురయ్యారట… పార్టీ వీడుతారని…కమలం పార్టీ లో చేరుతారని ప్రచారం జరిగింది..పార్టీ వీడితే ఎదురుదెబ్బ తగులుతుందని బావించి నీటిపారుదల కార్పోరేషన్ చైర్మన్ గా చారిని నియమించింది…చారి అసంతృప్తిని చల్లార్చిందట..

‌…అయితే చారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశలు పెట్టకున్నా ఆయన అనుచరులు..కార్పొరేషన్ పదవితో సరిపెట్టడం అసంత్రుప్రికి గురిచెసిందట.. కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి గా చేసిన. వ్యక్తికి‌‌ తగిన. పదవి ఇవ్వలేదని ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలలో అనుచరులు అందోళన చెందుతున్నారట…‌స్థాయిని తగ్గించేందుకు కార్పొరేషన్ పదవి ఇచ్చారని పార్టీ పై అక్కసును వెళ్లగక్కుతున్నారట.. ఇదంతా ఒక ఎత్తేతే చాలు… 2018.ఎన్నికలలో చారికి టిక్కెట్ లబించలేదు.. మళ్లీ ఇప్పుడు కూడ 2023 ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట.. ఇలా దశాబ్ద కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావడం ఆయన అనుచరులు అందోళన చెందుతున్నారట..‌ చారి ప్రత్యేక ఎన్నికలకు దూరం కావద్దని ఒత్తిడి తెస్తున్నారట.. ఎన్నికల రంగంలో దిగాలనికోరుతున్నారట.. పార్టీ మారైనా పోటీ చేయాలని కోందరు ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం ఉంది. కాని చారి కార్యకర్తలకు నచ్చజెప్పుతున్నారట…మరి ఈసారైనా చారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.