యువకుని గోంతు కోసిన నిషేదిత చైనా మంజా

మనుషుల గోంతులు కోస్తున్నా చైనా నిషేదిత మంజా..నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పెంచికల్ పాడ్ గ్రామంలో చోటుచేసుకుంది… గ్రాంలో తుమ్మ వెంకటేష్ యువకుడు సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై ఇంటికి వస్తున్నారు. వచ్చే దారిలో ఓ చెట్టుపైన గాలిపటం చిక్కుకొని దానికున్న దారం వేలాడుతోంది. వేలాడుతున్న దారం కంటికి కనిపించకపోవడంతో వెంకటేశ్ అలాగే వచ్చారు. ఈ క్రమంలో మాంజా గొంతుకు తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే వాహనం నిలిపివేడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే పిల్లలు చైనా మాంజా దారం వాడొద్దని స్థానిక వైద్యురాలు ప్రజలను కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.