మెస్రం మనోహర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
టీఎజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు

ఇంద్రవెల్లి : ఆదివాసీ ఉద్యమ నేత, ఆదివాసీల్లో మూడు నమ్మకాల నిర్మూలన కృషి చేస్తూ, ఆదివాసి సమస్యలపై నిరంతరం పోరాడిన మేస్రం మనోహర్ ఆశయ సాధనకు కృషి చేయాలని టీఎజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు అన్నారు. సోమవారం మండలంలోని పిప్రి(లక్కుగూడ) గ్రామంలో టిఎజిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మెస్రం మనోహర్ ప్రథమ వర్ధంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ… ఆదివాసుల హక్కుల సాధనకై,భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఏజెన్సీ చట్టాల పరిరక్షణ, మూడనమ్మకాల నిర్మూలనకు పాటు పడిన గొప్ప నాయకుడిని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయలను నిరంతరం ప్రశ్నించిన గొంతని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే ఉద్యమ బాట పట్టి సమస్యల పరిష్కారానికి కృషి గొప్ప విప్లవ కారుడని అన్నారు.ఆ విప్లవ కారుడి ఆశయ సాధన కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈకార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు,ఉపాధ్యక్షుడు నాగోరావు,గ్రామ పటేల్,ఎంపీటీసీ సుంగు,నాయకులు మెస్రం నర్మద,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.