మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల యుద్దం

కామారెడ్డి
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద. రైతుల అందోళనతో యుద్దం వాతవరణం ఏర్పడింది.. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రధ్దు చేయాలని రైతులు కలెక్టరెట్ నుముట్టడించారు.. ఈ సందర్భంగా రద్దు పై కలెక్టరు స్పష్టమైన హమీ ఇవ్వాలని రైతులు బైఠాయించి అందోళన చేపట్టారు.. కాని కలెక్టర్ స్పందించలేదు.. దాంతో రైతులు అగ్రహంతో కలెక్టర్ కార్యాలయం లో దూసుకవెళ్లారు.. దూసుకవెళ్లుతున్నా రైతులను సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు….ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.. గేట్ల పై నుండి కోందరు దూసుకవెళ్లారు… కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లారు.. తోపులాట సమయంలో ఒక రైతుకు, ఓ పోలీసు గాయాలయ్యాయి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు కలెక్టర్, ప్రభుత్వం తీరు పై మండిపడుతున్నారు… రద్దు చేసేంతవరకు తమ పోరాటంఅగదని రైతులు కలెక్టర్ కు హెచ్చరికలు జారీ చేశారు