జక్కుల పల్లి హత్య కేసులో 13మంది నిందితుల అరెస్టు

మంచిర్యాల‌ :రెబ్బెన మండలంలోని జక్కులపల్లి గ్రామంలో ఈనెల 26న జరిగిన హత్య కేసులో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రెబ్బెన సిఐ అల్లం నరేందర్,ఎస్సై ఎల్ భూమేష్ తెలిపారు.అరెస్ట్ చేసిన వారిలో మండల మల్లేష్(52) పెంచికల్పేట్,మండల గణేష్(32),జక్కులపల్లి, మండల వెంకటేష్(19) పెంచికల్పేట్,గీరుగుల భీంరావు(30),జక్కులపల్లి, గీరుగుల రాకేష్(26) జక్కులపల్లి,మండల రంగక్క(42)పెంచికల్పేట్,గీరుగుల రజిత(29),జక్కులపల్లి
మండల రజిత(40) జక్కులపల్లి,మండల రుక్మ (24)జక్కులపల్లి,రాటె భూమక్క(52)ఇట్యాల,రాటె(58)ఇత్యాల,గీరుగుల దుర్గాక్క(35)జక్కులపల్లి, గీరుగుల సౌమ్య(20) జక్కుల పల్లి.ఘటనలో నిందితుల నుంచి మూడు గొడ్డళ్లు,2కత్తులు,4కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.కేసు వివరాల్లోకి వెళితే మండల బక్కయ్య కు జక్కులపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది.ఇట్టి భూమి విషయంలో బక్కయ్య కుటుంభీకులకు మరియు మండల మెంగయ్య కుటుంభీకులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 25న బక్కయ్య కుటుంభీకులు పత్తి విత్తనాలు వేశారు.అది తెలిసిన మండల మెంగయ్య అతని కుటుంబ సభ్యులు (నిందితులు)ఈనెల 26న కత్తులు,గొడ్డళ్లు,రాళ్లు, కారంపొడితో బక్కయ్య విత్తనాలు వేసిన భూమిలోకి వెళ్లడంతో,అది చూసిన బక్కయ్య అతని కుటుంబ సభ్యులు వారిని ఆపడానికి వేయడంతో,నిందితులు తమ వెంట తెచ్చుకున్న కత్తులు,గొడ్డళ్లు, రాళ్లు,కారంపొడితో బక్కయ్య కుటుంబసభ్యులపై దాడి చేయడంతో దాడిలో మండల నర్సయ్య,గీరుగుల బక్కక్క సంఘటనా స్థలంలోని మృతి చెందారు.మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటన తర్వాత నిందితులు అక్కడి నుండి పారిపోయారు.ఈ విషయమై మండల ఇందిర ఫిర్యాదు మేరకు రెబ్బెన పోలీస్ స్టేషన్ లో సిఆర్ నంబర్ 90/2023,యు/సెక్షన్143, 147,148,302,307,ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు రెబ్బెన పోలీసు అధికారులు తెలిపారు. కేసును చేదించడంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలమేరకు సీరియస్ గా తీసుకున్న రెబ్బెన సిఐ అల్లం నరేందర్,రెబ్బెన ఎస్సై ఎల్. భూమేష్ లు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 13 మంది నిందితులను అరెస్ట్ చేసి బుధవారం ఆసిఫాబాద్ కోర్టు లో హాజరుపర్చారు.

Leave A Reply

Your email address will not be published.