కుటుంబ సంక్షేమ నిధి పథకంలో చేరుదాం.

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమం కోసం ప్రారంభించిన “కుటుంబ సంక్షేమ నిధి” పథకంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చేరాలని టిఎస్ యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ స్వామి, వి. అశోక్లు పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం సందర్భంగా వారు మాట్లాడారు.”ఒక్కరి కోసం అందరం అందరికోసం ఒక్కరం” అనే నినాదంతో యూటీఎఫ్ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చేందుకు ప్రారంభించిన కుటుంబ సంక్షేమ నిధి పథకం ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ పథకంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చేరాలని వారు కోరారు.ఈసమావేశంలో టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ వెంకట్, జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యకుమార్,కోశాధికారి కె కిష్టన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు సి లక్ష్మణ్ రావ్, జిల్లా కార్యదర్శులు కె శ్రీనివాస్, సి విలాస్, ఇ శివన్న తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.