అమ్మవారి కోసం ఊరిని ఖాళీ చేసిన గ్రామస్తులు

తలుపులు ‌మూసి, తాళాలు వేసి అమ్మవారిపూజకు వెళ్లిన గ్రామస్తులు

అమ్మవారే ఆ ఊరి అడ బిడ్డ…పుట్టింటి బిడ్డకు పూజల కోసం.ఊరంతా భయలుదేరింది… ఇండ్ల తలుపులు మూసి… తలుపులకు తాళాలు వేసి… గ్రామస్తులంతా అర్థరాత్రి పూట కదలిలారు. మహిమ గల మహలక్ష్మి దేవతకు పూజలు చేయడానికి సుంకిడి గ్రామస్థులు ఊరంతా ఎందుకు ఖాళీ చేస్తున్నారు… సుంకిడి గ్రామస్థులు చాందాటి లో అమ్మవారికి ఏలాంటి రహస్య పూజలు నిర్వహిస్తున్నారు….అమ్మ మోక్షం కోసం ఒకరోజు ఊరిని ఖాళీ చేసిన పూజలు నిర్వహిస్తున్నా సుంకడి గ్రామస్తుల పై ప్రత్యేక కథనం

… ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం లో సుంకిడి గ్రామం ఉంది.. ఈ గ్రామస్తులు మహ లక్ష్మిని అదిదేవతగా బావిస్తారు‌‌‌.. ప్రతి కుటుంబం ఇంటి అడబిడ్డగా శక్తిమాతను కోలుస్తున్నారు.. మహ లక్ష్మిని తమ పుట్టింటి అడ బిడ్డ పిలుస్తారు గ్రామస్థులు… ప్రతి ఇంట్లో శుభకార్య నిర్వహించాలన్నా అమ్మ ఆశీర్వాదం లేనిది గడపదాటరు.. అడుగు ముందుకు వేయరు… అంతటి భక్తి శ్రద్దలతో అమ్మవారిని కోలుస్తుంటారు ప్రజలు.

… సుంకిడి గ్రామస్థులకు పరమ పవిత్రమైన అమ్మవారికోసం ఐదేళ్ల ఒకసారి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు..ప్రజల ఇలవేల్పు కోలువైనా గ్రామం చాందాటి గ్రామం…ఈ పవిత్రమైన ఆలయఙ సుంకిడి గ్రామానికి పదికిలో మీటర్ల దూరంలో ఉంటుంది. .. ప్రతి ఐదేళ్లకోకసారి ‌ ప్రత్యేకమైన పూజల కోసం ఊరంతా అక్కడి కదులుతోంది… అర్థరాత్రి పూట. ఏవరి ఇంట్లో వాళ్లు పూజలునిర్వహిస్తారు… ఆ తర్వాత డప్పులు ,వాయిద్యాలతో ఊరంతా సుంకిడి నుండి చాందాటి లో ఉన్న శక్తిస్వరూపిణికి దర్శించుకోవడానికి ఊరంతా కదులుతారు.. అమ్మవారి దగ్గరకు వెళ్లడమంటే కొంతమంది ఇంటి వద్ద ఉండటం… మరికొంతమంది అమ్మవారి వద్దకు వెళ్లడం కాదు‌.. పిల్ల జెల్లతో‌ ఇండ్లకు తాళాలు వేసి అమ్మవారి దర్శనం కోసం వెళ్లుతున్నారు..ఊరంతా కదిలి వెళ్లంతో గ్రామంలొ ఏ ఇల్లు చూసిన తలుపులు వేసి,తాళం వేసి దర్శమనిస్తోంది…అదేవిధంగా ఊరంతా వేతికినా ఒక్కరు కనిపించరు…ఏకంగా గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు.. ఊర్లోని అందరు అమ్మవారి దర్శనం కోసం వెళ్లుతుంటారు.. ఐదేళ్లకోకసారి అమ్మవారి పూజల కోసం వెళ్లడం అచారమని…‌ఒకవేళ వెళ్లకపోతే అరిష్టమంటున్నారు గ్రామస్థులు..

సుంకిడి ఊరంతా మహాలక్ష్మి కోలువైనా చాందా టి గ్రామానికి చెరుకుంటారు.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు..ఈసందర్బంగా అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తున్నారు… మహిళలు కుంకుమ పూజలు చేస్తున్నారు.. నైవేద్యాలు సమర్పిస్తున్నారు… అనంతరం అమ్మవారికి ఇష్టమైన. మేకలు, కోళ్లు బలి ఇస్తున్నారు…బలి ఇచ్చిన మేకలను, కోళ్లను వండుకోని అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి తింటున్నారు..ఈ విదంగా ఐదేళ్లకోకసారి పూజలు చేయడం వల్ల గ్రామదేవత ఆశీస్సులు లభించి పాడి పంటలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తున్నాయని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.