సిర్పూర్ టి సమరంలో గెలిచే మొనగాడేవరు

కోనప్పతో పోటీకి సై అంటున్నా అర్ ఎస్పీ, పాల్వాయి హరీష్

. దారుల్లో దరిద్రం…. రోగులకు ఎండ్ల బండ్లే అంబులెన్స్ లు.. సాగునీటిలో అద్వాన్నం…ప్రవాహించే నదులున్నా పంటపోలాలకు చుక్కనీరులేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గం సిర్పూర్ టి దీనస్థితి… . పిలిస్తే పలికి పేరున్నా కోనప్ప. ఎమ్మెల్యేగా ఉన్నా ప్రగతిని పరుగులు పెట్టించడంలో ఎందుకు విపలం అయ్యారు.. సర్కార్ కు దీటుగా . సోంత పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారు … అన్నదానంతో నిరుపేదల ఆకలితీర్చుతున్నారు …..నిరుద్యోగుల కోలువులు సాధించడానికి అండగా నిలుస్తున్నారు.‌..కాని సర్కార్ వైపల్యాలు రాబోయే ఎన్నికలలో కోనప్ప పుట్టి ముంచుతాయా..? కోనప్ప కోటను బద్దలు చేసి… అసెంబ్లీలో అడ్డపెట్టాలన్నా అర్ ఎస్ ప్రవీణ్ కలనేరవేరుతుందా?కమలం పార్టీ అభ్యర్థి హరీష్ ఈసారైనా విజయం సాదించేనా?.సిర్పూర్ టి సమరంలో బరిలో నిలబడే కాంగ్రెస్ మొనగాడేవరు?. సిర్పూర్ నియోజకవర్గం లో పార్టీల,బలం బలగం ప్రత్యేక కథనం

.. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం తెలంగాణ. రాష్ట్రంలో నెంబరు వన్ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం లో కాగజ్‌నగర్‌ పట్టణం, కాగజ్ నగర్ రూరల్ , సిర్పూర్ టి, బెజ్హూర్ ,కౌటల, బెజ్జూర్‌, పెంచికల్ పెట్, దహేగామ్ మండలాలు ఉన్నాయి…వీటిలో 212320 ఓటర్లు ఉన్నారు.. ప్రదానంగా నియోజకవర్గం లో మున్నూర్ కాపు, ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనారిటీ ఓటర్లు ఉన్నారు.. వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు

.ఎమ్మెల్యే గా కోనప్ప 2004,2014,2018 ఎన్నికలలో విజయం సాదించారు..అయితే , 2014 ఎన్నికలలో బిఎస్పీ అభ్యర్థి గా పోటీచేసి ఎమ్మెల్యేగా కోనప్ప విజయం సాదించారు…ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో బిఎస్పీ నుండి అప్పటి టిఅర్ ఎస్ లో చేరారు. టిఅర్ ఎస్ అభ్యర్థిగా 2018 ఎన్నికలలో పోటీ చేసి 24036 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ పై విజయం సాదించారు కోనప్ప‌.

 

అదికారపార్టీ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పథకాలు సాదించారు.. తెలంగాణ లో మొదటి సారి సర్కారు ఏర్పడిన తర్వాత కాగజ్‌నగర్‌ లో మూతపడిన. పేపర్ మిల్లును పునప్రారంబించారు… అదేవిధంగా నియోజకవర్గం లో అనేక ప్రాంతాలకు రోడ్లు నిర్మాణం చేపట్టారు.. ‌రవాణా సౌకర్యం మెరుగుపరిచారు… గూడేం పై ప్రాణహిత పై వారిది నిర్మించారు.. మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ. రాష్ట్రాల.‌ మద్య. రాకపోకలు ప్రారంభమ్యాయి… అదేవిధంగా కాగజ్ నగర్ లో పేదల రోగులకు వైధ్యం అందించడానికి వంద పడకల. అసుపత్రిని నిర్మించారు.. అదేవిదంగా పట్టణంలో రోడ్లను, డ్రైనేజీలను నిర్మించారు‌..మురికి వాడలను అభివృద్ధి చేశారు

…అదికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నా ‌నియోజకవర్గాన్ని అభివృద్ధి జాడలు అంతంతమాత్రమే… మూతపడిన. సిర్పూర్ పేపర్ మిల్లు పున ప్రారంభమైన స్థానికులకు ఉద్యోగాలు దక్కలేదు… బీహార్, మధ్యప్రదేశ్ , ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉద్యోగాలు దక్కాయి.. .. తెలంగాణ సర్కారు రాయితీలు పోందిన యాజమాన్యం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు అసంత్రుప్తితతో రగిలిపోతున్నారు.. అదేవిధంగా కౌటల‌మండలం తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత పై నిర్మించాల్సిన. ఎత్తిపోతల పథకాన్ని దిగువకు తరలించారు..‌కాళేశ్వరం ఎత్తిపోతల పతకాన్ని నిర్మించారు.. ప్రాణహిత చెవేళ్ల తరలింపు ఈ ప్రాంత రైతులకు తీవ్రమైన అన్యాయం జరగింది.సాగునీరు అందుతుందని పెట్టుకున్నా రైతుల ఆశలు అవిరయ్యాయనని రైతులు వాపోతున్నారు‌. ఎత్తిపోతల పథకం తరలించిన ప్రాంతంలో వార్థా బ్యారేజి నిర్మిస్తామని సర్కారు హమీ ఇచ్చింది… కాని వార్థా బ్యారేజి పై అతిగతి లేదు… సర్కార్ పట్టించుకోవడం లేదు‌… ఎమ్మెల్యే కోనప్ప చోరవ చూపడం లేదని రైతులు అసంత్రుప్తితో ఉన్నారు..

.. అదేవిధంగా నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ అయినా. రవాణా సౌకర్యాలు అద్వాన్నంగా ఉన్నాయి. ‌‌ ‌‌. మారుమూల గూడాలకు రోడ్ల. సౌకర్యం లేదు… గూడాలలో గిరిజనులకు రోగం వస్తే రవాణా సౌకర్యాలు లేక అంబులేన్స్ లు రావు.. అంబులేన్సు లు రాకపోతే గర్బిణి మహిళలు ఎండ్ల బండి పై వెళ్లుతున్నారు…సకాలంలో అసుపత్రికి చేరక. గర్బీణిలకు కడుపు శోకం మిగులుతోంది… పురింట్లో‌‌ పిల్లలను కోల్పోయి తల్లులు తల్లాడిల్లుతున్నారు..‌ రవాణా సౌకర్యాలు గూడాలకు కాదు‌.. మండలాలకు వెళ్లే దారులు సరిగా లేక ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారు..ఇక కాగజ్ నగర్ పట్టణం రోడ్ల పై దుమ్మురేగుతుండటం విశేషం.. దాంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు..అదేవిధంగా పోడు భూములు సాగు చేసుకుంటున్నా రైతులు బారీగా ఉన్నారు…కాని హక్కు పత్రాలు లభించడం లేదు..‌ఇప్పుడు అప్పుడు పత్రాలు ఇస్తామని ఎమ్మెల్యే మాటలు తప్పుతున్నారని అక్కసు వెళ్లగక్కుతున్నారు

.. సర్కారు అభివృద్ధి పథకాలు చేపట్టడంలో వైపల్యం చెందారు… కాని సామాజిక సేవ. కార్యక్రమాలతో ప్రజల మనస్సులను చూరగోన్నారు… కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆకలితో ‌అలమటించే అన్నదానం చేస్తున్నారు‌..నిరుపేదల ఆకలి తీర్చుతున్నారు….అదేవిధంగా నిరుద్యోగులకు పోటీపరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు… బోజనం తో పాటు పోటీపరీక్షలకు మేటీరీయల్ తో ఇస్తూ అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి పథకాల చేపట్టడంలో వైపల్యం ఉన్నా సామాజిక కార్యక్రమాలు, ప్రజల. సమస్యలపై స్పందించే గుణం రాబోయే ఎన్నికలలో గట్టేక్కిస్తుందని ఎమ్మెల్యే దీమాతో ఉన్నారు

.. అయితే కారు కోట పై బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురిపెట్టారు.. … ఇక్కడి నుండి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు .. సిర్పూర్ ఎన్నికలలో విజయం సాదించి అసెంబ్లీలో అడుగుపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు..ఒకవేళ విజయం సాదిఖచకపోతే. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు అర్ ఎస్పీ… ఇదే నియోజకవర్గం నుండి 2014 అసేంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కోనప్ప.విజయం సారించారు …అదే భరోసాతో బిఎస్పీ నాయకుడు ప్రవీణ్ ఎన్నికల రంగంలోదిగుతున్నారు.. నియోజకవర్గం లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు ఉన్నారు… ఆ వర్గాలే అండగా నిలుస్తారని ఆయన. అంచనా వేసుకుంటున్నారు… ఇవన్నీ ఒకత్తైతే కోనప్ప తెలంగాణేతరుడని ఆంద్రవాదని తెలంగాణ వాదాన్ని రగిలిస్తున్నారు .క దీనితోపాట కోనప్ప అవినీతికి పాల్పపడ్డారని ఆరోపిస్తున్నారు ప్రవీణ్… ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో గెలుపు ఖాయమని ప్రవీణ్ భావిస్తున్నారు ..

,… అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన. పాల్వాయి హరీష్ …ఈసారి బిజెపి నుండి పోటీ చేయనున్నారు… బిజెపి ఊపు తనకు కలిసి వస్తుందని ఆయన అంచనా వేసుకుంటున్నారు.. అదేవిధంగా అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీతో త్రిముఖ పోటీ తనకు కలిసి వస్తుందని బావిస్తున్నారు…దాంతో గత. ఎన్నికలలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి హరీష్ తహతహలాడుతున్నారు‌. ముఖ్యంగా బెంగాల్ నుండి కాగజ్ నగర్ కు వలస వచ్చిన కాందిశీకులు ఉన్బారు … వీరంతా బిజెపి వైపు మొగ్గు చూపేవకాశం ఉందని హరీష్ లేక్కలు వేసుకుంటున్నారు…కాని పాల్వాయి హరీష్ కు గతంలో అండగా ఉన్నా మైనారీటీ ఓటర్లు దూరకావడం దడపుట్టిస్తోంది‌..‌అయినప్పటికి గత ఎన్నికల ఓటమి సానుభూతి తోడైతే ‌కమలం జెండా సిర్పూర్ గడ్డపై ఎగురుతుందని ఆశలు పెట్టుకు‌న్నారు హరీష్.. కాంగ్రేస్ అభ్యర్థి గా రావిశ్రీనివాస్ ఎన్నికల బరిలో దిగడానికి సిద్దమవుతున్నారు..బలమైనా నాయకుడు కాకపోవడంతో పోటీ చేసిన పెద్దగా ప్రభావం ఉండదని ఆ పార్టీలో చర్చ జరుగుతుండటం విశేషం….‌నలుగురు అభ్యర్థులు అందరు గెలుపు పై దీమాను వ్యక్తం చేస్తున్నారు… ‌మరి ప్రజలు ఎవరిని అదరిస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.