దాహంతో అలమటిస్తున్నా గిరిజన గూడాలు
గిరిజనులకు అందని మిషన్ భగీరథ నీళ్లు

.అదివాసీ గూడాలలో పాని పన్నీరైంది…త్రాగుదామంటే గుక్కేడు నీళ్ల లేవు. నీళ్ల కోసం అరిగోస పడుతున్నారు.. నీళ్లకోసం పంటపోలాలకు వెళ్లుతున్నారు.. కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావుల నుండి నీళ్లను తెచ్చకుంటున్నారు పశువులు త్రాగే నీళ్లను త్రాగుతున్నారు.. వారానికి ఒక రోజు స్నానం చేస్తున్నారు అదివాసీ బిడ్డలు.. ఆ స్నానం చేసిన నీళ్లతో బట్టలు శుభ్రం చేసుకుంటున్నారు…. దాహం తీర్చాల్సిన. మిషన్ భగీరథ. పథకం ఏందుకు మూలన పడింది ..త్రాగునీళ్ల. కోసం అదివాసీ బిడ్డల నీటి కష్టాల పై ప్రత్యేక కథనం
…. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సి లో నీటి సంక్షోభం తీవ్రమైంది.. గూడగూడన త్రాగునీటి కోసం అదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు..త్రాగునీరు అందించాల్సి మిషన్ భగీరథ నీళ్ల సరపరా లేదు.. దాంతో నీటి సరపరా లేక. గిరిజనులు త్రాగునీరు కోసం అదివాసీ బిడ్డలు పడరాని పాట్లు పడుతున్నారు.ఎడారి ప్రాంతంలో నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడుతారో అలాంటి పరిస్థితులు గిరిజన. గూడాలలోనెలకోన్నాయి..
.. ఇంద్రవేల్లి మండలం కోయల్ పాండ్రి అదివాసీ గూడంలో తీవ్రమైన నీటి సమస్య ఉంది. గత కోన్ని రోజులుగా మిషన్ భగీరథ. నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ అదికారుల వైఫల్యం గిరిజనులకు శాపంగా మారింది.. గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఉన్నాయి… ఈ. కుటుంబాలు త్రాగు నీరు కోసం పంటపోలాలకు వెళ్లుతున్నారు.. గూడానికి కిలోమీటర్ నర దూరంలో బావి వద్దకు వెళ్లుతున్నారు.. ఆ పంటపోలంలో ఉన్నబావినుండి నీళ్లను తెచ్చుకుంటున్నారు..ఆ మురికి నీటితో దాహం తీర్చుకుంటున్నారు
.. వ్యవసాయ. బావి నుండి నీళ్లను తోడటానికి అదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు..క్యాన్ లకు తాళ్లను కట్టి నీటిని బావి నుండి నీళ్లు తోడుతున్నారు.. క్యాన్లతో నీటిని తోడటం వల్ల చేతులు పొక్కులు వస్తున్నాయని గిరిజనులు అవేదన వ్యక్తం చేస్తున్నారు..నీళ్లను తోడటం ఒక ఎత్తతే. తోడిన నీళ్లను కిలోమీటర్ నర దూరం నెత్తి పై బిందేలు పెట్టుకొని మోస్తూ మహిళలు ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు వదిలేసి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని గిరిజనులు వాపోతున్నారు.. వేసవికాలంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటున్నారు.. మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నా నీళ్లు రావు.మ అందువల్లనే పంటపొలాల వద్దకు వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నామని గిరిజనులంటున్నారు..నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా అదికారులు పట్టించుకోవడం లేదని అదికారుల తీరు పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు
. హర్కాపూర్ గ్రామపంచాయితీలోని కోలాం గూడం ఉంది… ఈ. గూడేం లో రెండు వందల జనాభా ఉంది.. గ్రామంలో త్రాగుదామంటే నీళ్లు లేవు…ఎప్పుడో వారం రోజులకోకసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తాయి…ఆ. తర్వాత నీళ్లు రావు… మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో బోరు పై అదారపడుతున్నారు.. ఉన్నా బోరులో రావు.. ఒక గంట సేవు బోరు హ్యండిల్ కోడితే కేవలం ఒక బాకేట్ మాత్రం నిండుతుందని గిరిజన మహిళలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.బోరు కోట్టడం వల్ల కడుపు నోప్పులు వస్తున్నాయి తప్ప నీళ్లు రావడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.. తీవ్రమైన. నీటికోరత వల్ల. పిల్లలకు స్నానం చేయించలేకపోతున్నామంటున్నారు. ఒకవేళ స్నానం చేయిస్తే ఆనీళ్లతో బట్టలను ఉతుకుతున్నామంటున్నారుగిరిజన మహిళలు. నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నా అదికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గిరిజన. మహిళలు