మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దడ పుట్టిస్తు‌న్నా నాయకుల అసంత్రుప్తి

ఎకమవుతున్నా మంత్రి వ్యతిరేకులు

. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తిరుగుబాటు చేస్తున్నా గులాబీ పార్టీనాయకులు.. ఉద్యమ నాయకులకు పదవులు ఇవ్వడం లేదంటున్నారు…బిఎస్పీ నాయకులకు పదవులతో పట్టాబిషేకం చేస్తున్నారంటున్నారు…అసమర్థ మంత్రి వద్దంటూ తిరుగుబాటు జెండా ఎగురువేస్తున్నారు…మంత్రి తో‌‌సమరానికి సై అంటున్నారు..గులాబి పార్టీలో అసంతృప్తి జ్వాలాలు‌‌ మంత్రికి దడ పుట్టిస్తున్నాయా? మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై అగ్గిరాజేస్తున్నా అసంతృప్తి పై ప్రత్యేక కథనం

… నిర్మల్ నియోజకవర్గం లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై గులాబి పార్టీ నాయకుల అసంతృప్తి తారాస్థాయికి చెరింది.. మంత్రి వ్యవహరశైలి పార్టీలు ఎదురుతిరుగుతున్నారు‌.. ఆయన ఓంటేద్దు పోకడల పై నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ప్రదానంగా తెలంగాణ. ఉద్యమ నాయకుడు బిఅర్ ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు కూచడి శ్రీహరి రావు ‌మంత్రి తీరు పై బహిరంగ. విమర్శలు చేస్తున్నారు.. మంత్రి తీరుతో పార్టీకి నష్టమని… అలాంటి మంత్రి కి బుద్ది చెప్పాలని ప్రజల్లోకి వెళ్లుతున్నారు…మంత్రి పై సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు.. రెండు సార్లు మంత్రిగా చేసిన నియోజకవర్గానికి చేసింది ఎమిలేదంటున్నారు..అదికారంతో మంత్రి బాగుపడ్డారు ..తప్ప ప్రజలకు ఓరిగింది ఏమి లేదంటున్నారు.

.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2014 ఎన్నికలలో బి ఎస్పీ నుండి విజయం సాదించారు.. ఆ తర్వాత అప్పటి టిఅర్ ఎస్ లో చేరారు..ఆయనతో పాటు బిఅర్ ఎస్ లో చేరిన వారికి పదవులు దక్కాయని… తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారికి ప్రాదాన్యత. లభించడం లేదంటున్నారు…ఉద్యమకారులు త్యాగాలు చేస్తే…. మంత్రి,ఆయన. అనుచరులు అదికారం, పదవులు అనుభవించడం పై శ్రీహరి మండిపడుతున్నారు… నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని అసమర్థ మంత్రికి ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిస్తున్నారు

.. డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించని, దళితులకు మూడు ఎకరాల. పంపిణీ చేయని,దళిత బస్తీ పథకంతో ప్రజల జీవితాలు మార్చని మంత్రి పై యుద్ధం ప్రకటించారు.. ఈ యుద్దంలో ప్రజలందరు తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు..నోట్లతో ఓట్లు కోనుగోలు చేసే ‌మంత్రికి ఇక అటలు సాగవంటున్నారు.. ఐదు వందలు, వేయ్యి, రెండు రుపాయలకు ఓట్లు అమ్ముకోవద్దని ప్రజలను కోరుతున్నారు… మంత్రి బుద్ది చెప్పడానికి తనతో కలిసి రావలంటున్నారు మంత్రి

… ఇప్పటికే ఉద్యమకారుడు శ్రీహరి రావు మంత్రి పై తిరుగుబాటు చేశారు‌.‌ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని ప్రచారం ఉంది..అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించడానికి శ్రీహరిరావు, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శోభసత్యనారయణ గౌడ్,ఆమె భర్త. సత్యనారాయణ , సారంగపూర్ జడ్పీటీసీ పత్తిరాజేశ్వర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.. కాని ఒక్కక్కరు కీలకమైన నాయకులు మంత్రికి దూరమవుతున్నారు.. శ్రీహరి రావు తన దారి తాను చూసుకున్నారు. అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ మంత్రికి దూరంగా ఉంటున్నారు.. పార్టీ సమావేశాలకు హజరుకావడం లేదు.. మంత్రి పై అసంత్రుప్తి వల్లనే పార్టీకి దూరం ఉంటున్నానని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారట.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి బిఅర్ ఎస్ రేబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.. ఆ తర్వాత ఆయన నామినేషన్ బలవంతంగా ఉపసంహరించారు.. అప్పట్లో‌ ఉపసంహరణ వివాదం మంత్రికి రాజేశ్వర్ రెడ్డి కి మరింత దూరం పెంచింది…ఆయన మంత్రికి దూరంగా ఉంటున్నారు… అయితే మంత్రి వ్యతిరేకులంతా ఏకం కావడం మంత్రి కి దడ‌పుట్టిస్తోందట… రాబోయే ఎన్నికలలో వీరంతా కలిసి పని చేస్తారట.. మంత్రి ఓటమే లక్ష్యంగా వీరంతా ఎకమవుతున్నారనిప్రచారం నియోజకవర్గంలో జోరుసాగుతుందట..వ్యతిరేకులంతా ఎకం కావడం మంత్రి ‌కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట‌… తనకు వ్యతిరేకంగా ఎంతమంది కుట్రలు చేసిన… సర్కార్ సంక్షేమపథకాలు గట్టేక్కిస్తాయని మంత్రి దీమాతో ఉన్నారట.. మంత్రి వ్యతిరేకులు మాత్రం ఈసారి ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బావిస్తున్నారట..మరి గులాబీ పార్టీలో అదిపత్య పోరులో మంత్రి విజయం సాదిస్తారో లేదంటే వ్యతిరేకులు విజయం సాదిస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.