రణరంగా మారిన. రేణుక సిమెంట్ నిర్వసితుల పోరు
పోలీసు వాహనం ఎక్కి అందోళన చేపట్టిన అదివాసీ మహిళలు

… రామాయి రణరంగమైంది. భూ నిర్వహితుల పోరు యుద్ద భూమిని మరిపించింది… పరిశ్రమ ప్రారంభించలేదు… మా భూములు మాకు ఇవ్వాలని తిరుగుబాటు చేశారు… అదివాసీలకు అడ్డంతిరిగినా పోలీసులు మందు డబ్బాలతో ఎదురు నిలబడ్డారు…భూములు ఇచ్చేదాకా కదలమంటూ పోలీసుల వాహానాలు ఎక్కి కూర్చున్నా అదివాసీ మహిళలు.. రణ రంగంగా మారిన రేణుక. సిమెంట్ పరిశ్రమ నిర్వహిసితుల పోరు పై ప్రత్యేక కథనం
. ఆదిలాబాద్ జిల్లాలో రేణుక. సిమెంట్ పరిశ్రమ నిర్వసితుల పోరు ఉద్రుతమైంది.. రామాయి, రాంపూర్ గ్రామాల. .శివారు ప్రాంతంలో రేణుక. సిమెంట్ పరిశ్రమ. భూములు సేకరించారు… ఆ సేకరించిన భూములలో పరిశ్రమను నిర్మిస్తామన్నారు..భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు…. కాని పరిశ్రమ నిర్మించలేదు…పరిశ్రమ నిర్మించకపోవడంతో నిర్వసితులకు ఉద్యోగాలు దక్కలేదు..
ఉద్యోగాలు లేవు…ఉన్నా భూములు కోల్పోవడంతో అదివాసీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలని అందోళన చేస్తున్నారు.. అందులో బాగంగా బిజెపి అధ్వర్యంలో ఆ భూములను స్వాదీనం చేసుకోవడానికి రైతులు ఎండ్ల బండి పై బయలుదేరారు.. పరిశ్రమ వద్ద. రైతులను పోలీసులు అడ్డుకున్నారు.. పోలీసుల తీరును నిరసిస్తూ మందు డబ్బాలతో అదివాసీలు అందోళన చెపట్టారు.. అందోళన చేపట్టిన ఆదివాసీలను అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించారు..ఈ సందర్భంగా అదివాసీలకు , తీవ్రమైన వాగ్వివాదం జరిగింది.. అరెస్టు ను అదివాసీలు ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది… ఇదే సమయంలో అదివాసీ మహిళలు పోలీసు వాహనం ఎక్కి అందోళనచెపట్టారు..
.మహిళలు పోలీసు వాహనం ఎక్కడంతో పరిస్థితి మరింత. ఉద్రిక్తతమారింది… పోలీసులు అప్రమత్తం అయ్యారు….బలవంతంగా అందోళన చేస్తున్నా వారిని అరెస్టు చేశారు.. తాంసి,జైనథ్ , మండలాల పోలీస్ స్టేషన్లకు అదివాసీలను తరలించారు..
.. అక్రమ అరెస్టు ల పై ఎంపి సోయం బాపురావు అగ్రహం వ్యక్తం చేశారు…నిర్వసితులు భూముల కోసం పోరాటం చేస్తే కేసులు నమోదు చేస్తారా అంటూమండి పడ్డారు.. అరెస్టు చేసిన. వారిని విడుదల చేయాలని … అదేవిధంగా కేసులు ఎత్తివేయాలని అదివాసీలు డిమాండ్ చేశారు..లేదంటే పోరాటాన్ని ఉద్రుతం చేస్తామని ఆయన. హెచ్చరికలు జారీ చేశారు..పోలీసులు బిఅర్ ఎస్ కు వంతపాడటం మానుకోవాలని సూచించారు..
.