అడ్డకూలీలుగా మారిన అదివాసీ కళకారులు
కళప్రదర్శనలకు అవకాశం ఇవ్వని ఐటిడిఎ అదికారులు

.అద్బుతమైన కళకారులు… ఆ కళతో అదివాసీ దేవ దేవుళ్లను మేప్పిస్తున్నారు… అదివాసీ గూడాలలో సామాజిక చైతన్యం నింపారు… మూడ నమ్మకాలను దూరం చేశారు… రక్కసి రొగాలను పాతరేసేలా ..అంటువ్యాదులను అంతం చేసేలా కళను ప్రదర్శించారు ఆ గిరిజన మహిళలు… ఆ కళతో దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించారు.. కాని ఆకళ కడుపునింపడం లేదు… ఉపాది కరువైంది… ఆకలితో అలమటిస్తున్నారు… కుటుంబాన్ని పోషించడానికి కూలీలుగా మారారు…దినసరి కూలీలుగా పంటపోలాల్లో పని చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా అదివాసీ గిరిజన కళకారుల పై ప్రత్యేక కథనం
. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్ పేట గిరిజన గూడేం ఉంది… ఇది కళకారుల పుట్టినిల్లుగా పిలుస్తారు.. గూడేంలో గిరిజన మహిళల కళ బ్రుందం.. ఈ బ్రుందంలో పదిమంది అదివాసీ మహిళ కళకారులు ఉన్నారు.. వీరంతా కళను శిక్షణ పోందివాళ్లు కాదు…నేర్చుకోవడానికి ఏవరి దగ్గర శిష్య రికం చేయలేదు.. కాని అద్బుతమైన ప్రతిభ పాటవాలు వీరి సోంతం.. వారసత్వంగా వచ్చిన కళతో అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడంలో దిట్ట..
.. కోలాం మహిళ కళకారులు ఆటపాటలతో అదివాసీ దేవ దేవతలను కళతో మేప్పిస్తారు…ఈ కళకారులు దండారి పండుగ సమయంలో డెంసా న్రుత్యాన్ని ప్రదర్శిస్తారు.. అదేవిధంగా జల్కా న్రుత్యం చేస్తూ పాటలు పాడుతూ న్రుత్యం చేస్తుంటారు…ఈ సందర్భంగా అదివాసీ దేవతలను అంటువ్యాదులను దూరం చేయాలని,అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని వేడుకుంటూ గిరిజన.
మహిళలు మదురమైన రాగంతో పాటలు పాడుతూ కళ్లను కట్టిపడేలా జల్కా న్రుత్యం ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా జువారి న్రుత్యం మరోక. న్రుత్యం మహిళల అందాలు వర్ణిస్తూ పాడుతారు..అడుతారు. ఇదే సందర్భంగా మానవ సంబందాలను వివరిస్తూ న్రుత్యం చేస్తూ పాటలు పాడుతున్నారు గిరిజన మహిళలు..ఐక్యత బావాన్ని పెంపోందిస్తున్నారు
. ఈ కళకారులు గిరిజన దేవతలను కోలుస్తూ పాటలు పాడటం కాదు.. తమ కళతో ఐటిడిఎ అద్వర్యంలో గిరిజనుల సామాజికచైతన్యం కొసం ఏన్నో కోన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు.. 1995నుండి 2014 వరకు గిరిజనులలోసామాజిక మార్పుకోసం ప్రదర్శనలుఇచ్చారు. ప్రదానంగా గిరిజనులు అంటు వ్యాదుల బారిన పడకుండా, మూడనమ్మకాల చైతన్యం, మద్యపానం దూరంగా ఉండేలా, పరిశుభ్రత,,విద్య వైద్యం వంటి ఆంశాల పై నాటికలు, ఆట పాటలతో గిరిజనులలో గోండి బాష,తెలుగు బాషలో ప్రదర్శనలు ఇచ్చారు…ఐటిడిఎ ఇచ్చే వేతనంతో ఉపాది పోందారు.. ఈవిదంగా గిరిజనులలో సామాజిక మార్పుకొసం పాటుపడ్డామంటున్నారు గిరిజన మహిళ తానుబాయి
ఐటిడిఎ ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, రివార్డులు పోందారు.. కాని గిరిజనుల సామాజిక చైతన్యం కోసం వందల ప్రదర్శనలు ఇచ్చిన కళకారులకు … తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత వీరికి గుర్తింపు కరువైంది.. ఎందరో సర్కార్ కళకారులను గుర్తించి ప్రభుత్వ కళకారులుగా ఉద్యోగాలు ఇచ్చింది సర్కారు…కాని ఈ గిరిజన. మహిళకారులకు ఉద్యోగాలు దక్కలేదు..ఉపాది దోరకడంలేదు.. ఐటిడిఎ అధ్వర్యంలో నిర్వహించే ప్రదర్శనలు సైతం గిరిజనేతర కళకారులు సర్కారు ఉద్యోగాలు పోందినవారు ప్రదర్శనలు ఇస్తున్నారు.. దాంతో అదివాసీ కళకారులకు ఉపాది కరువైంది…కుటుంబాన్ని పోషించుకోవడానికి దినసరి కూలీలుగా మారారు..పంటపోలాల్లో పనిచేస్తూ కుటుంబాలనుపోషించుకుంటున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు… కూలీ దోరకని రోజులలో పస్తులు ఉంటున్నామని వాపోతున్నారు,కాథ్లే వనిత, జ్యోతి, గిరిజన. కళకారులు..తమ అదుకోవాలని సర్కార్ ను కోరుతున్నారు గిరిజన కళాకారులు