ది గ్రేట్ వైన్ గ్రూప్ లూటీ దందా

ప్రజల నుండి వంద కోట్లు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన గ్రూప్

లిక్కర్ దందా లో పెట్టుబడి పెడితే చాలు…మత్తేక్కించే లాభాలు…. ఒక్కసారి ‌ పెట్టుబడి పెడితే… ప్రతి రోజు లాభాల వర్షం కురుస్తోంది.. వేయ్యి పెట్టుబడి పెడితే చాలు… మూడు రోజుల్లో మూడు వేల లాబాలు‌….తోంబై ఆరు వేలు పెట్టుబడి పెడితే… నాలుగు లక్షల పైగా లాభాలు… ఆ ప్రచారమే ప్రజల కోంపలను ముంచింది‌.. లక్షల్లో పెట్టుబడుల వారిని ది గ్రేట్ వైన్ గ్రూప్ నిండాముంచింది. ప్రజల నుండి వంద కోట్ల లూటీ చేసింది… కంపేని మూతపడింది… డైరెక్టర్లు పత్తా లేకుండా పోయారు… పెట్టిన‌‌ పెట్టుబడి కోసం‌ వేలాది బాదితులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు… పెట్టిన పెట్టుబడి కోసం పోరాటం సాగిస్తున్నారు… ది వైన్ గ్రూప్ దోపిడి దందా పై ప్రత్యేక కథనం

మంచిర్యాల

.. ది వైన్ గ్రూప్ కంపేని…. లిక్కర్ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడంలో ప్రపంచంలో పేరుగాంచింది…. పేరు గాంచిన. ది వై‌న్ గ్రూప్ కంపేనిలో‌పెట్టుబడులు పెట్టాలని ప్రజలను కోరింది..‌ ఆన్ లైన్ లో ఆ పెట్టుబడుల. కోసం బారీ ప్రచారం నిర్వహించింది… వేయ్యి పెట్టుబడితే చాలు… మూడు రోజుల్లో మూడువేల లాభాలని ప్రచారం చేసింది,.. మొదట్లో‌ వందల్లో ‌ పెట్టుబడి పెట్టిన వారికి వేలల్లో‌ లాభాలు వచ్చాయి.
.

. ఈవిదంగా పెట్టుబడులకు లాభాల వర్షం ‌ కురిసింది… లిక్కర్ గ్రూప్ లో పెట్టుబడి పెడితే చాలు….లాభాల వరద వచ్చి చేరుతుందని అందరు భ్రమ పడ్డారు… ఆ భ్రమతోనే మంచిర్యాల. జిల్లాలో వేలాది మంది పెట్టుబడులు పెట్టారు… చైన్ లింక్ బిజినేస్ కావడంతో ఒక్కోక్కరు కుటుంబ సభ్యులను, తెలిసివాళ్లను పెట్టుబడులు పెట్టించారు…‌ఇక పెట్టుబడి పెడితే చాలు… ప్రపంచంలో ఏక్కడ లేనివిదంగా రోజు లాభాలను పంచింది గ్రూప్ … అందుకే వేయ్యి ‌పెట్టుబడితే చాలు… మూడురోజుల్లో మూడు వేల లాబాలు.. తోంబై ఆరు వేలు పెట్టుబడి పెడితే… రోజు కు ఎనిమిది వేల ఆరవై నాలుగు చోప్పున యాబై ఐదు రోజుల పాటు నాలుగు లక్షలకు పైగా ‌లాబాలు వస్తాయన్నారు

.ఈ ప్రచారంతోనే గ్రూప్ లో ‌ పెట్టబడులు పెట్టారు… అడ్డకూలీ నుండి పెద్ద వ్యాపారులు ఇందులో పెట్టుబడులు పెట్టారు..‌పదివేల నుండి ఇరవై లక్షల వరకు పెట్టుబడి పెట్టారు… చెన్నూర్ లో ఒక కిరాణ వ్యాపారి, ఆయన. దగ్గర. పని చేసే దినసరి కూలీతో సహ పెట్టుబడులు పెట్టారు.. వ్యాపారి లక్షల్లో పెట్టబడి పెడితే…‌ దినసరి వేలల్లో పెట్టుబడులు పెట్టారు… ఇలా పెట్టుబడి పెట్టినవారు ఒక్క చెన్నూర్ లో ఎడు వందల మంది బాదితులున్నారు… మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వేల మంది ఉన్నారని బాదితులు అంటున్నారు… అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్‌ , నిజామాబాద్ లో వేలాది బాదితులు ఉన్నారు‌..వీరందరి నుండి వంద కోట్ల పై గ్రూప్ నిర్వహకులు లూటీ చేశారని అందోళన వ్యక్తం చేస్తున్నారు బాదితులు..

. ఒకప్పుడు పోన్లు చేసి పెట్టుబడి పెట్టాలని కోరిన గ్రూప్ నిర్వహకులు ఇప్పుడు స్పందించడం లేదు..‌ లాబాలు పంచడం చేతులు ఎత్తేశారని బాదితులు వాపోతున్నారు.తమ డబ్బులు ‌తమకు కావాలంటూ బాదితులు వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకోని పోరాటానికి సిద్దమవుతున్నారు…ఇప్పటికే కోంతమంది సైబర్ పోలీసులకు పిర్యాదు చేశారు…తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు… తమ. డబ్బులు తమకు ఇప్పించకపోతే ఆత్మహత్య లే శరణ్యమంటున్నారు బాదితుడు డేగ శ్రీనివాస్… తమకు న్యాయం చేయాలని బాదితుడు పోలీసులను వేడుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.