పూజిస్తేచాలు నాగోబా దేవత ప్రత్యక్షమవుతుందంటున్నా అదివాసీలు

మహపూజలో నాగోబా దర్శనమిస్తేనే జాతర ప్రారంభమంటున్నా అదివాసీలు

 

.. ప్రక్రుతి అరాదించే జాతర‌..
అదివాసీ బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకేజాతర… అమావాస్యల. చీకట్లను దూరం చేసే‌.. కోటి కాంతులు నింపే జాతర..కోలుస్తే చాలు… నాగ దేవుడే… కళ్లముందే దైవంగా ప్రత్యక్షంగా కనిపించే జాతర…ఆ నాగోబా దేవతను పూజిస్తు పుడమి పులకించిపోతున్నారు… అదివాసీ బిడ్డల నాగోబా జాతర పై ప్రత్యేక కథనం

.అడవి బిడ్డలు… అదివాసీలు… ప్రక్రుతిని అరాదిస్తారు.ప్రాణకోటిని దైవంగా పూజిస్తారు.. మేస్రం వంశస్తులు మేచ్చిన దేవుడు నాగోబా దేవత.‌‌‌…వందల ఏళ్లుగా నాగోబా దైవాన్ని మేస్రం వంశస్థులు కోలుస్తున్నారు….ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌ లో మేస్రం వంశస్తుల ఇలవేల్పు నాగోబా కోలువైనా దివ్యమైన క్షేత్రం… ఈ క్షేత్రాన్ని అదివాసీలు తమ ఆరాద్యమైనా ఏడు తలల శేషనారయణుడు కోలువైనా స్వర్గంగా బావిస్తారు అదివాసీలు…

. ఏడు తలల‌‌ శేషనారయణుడే…. పున్నమి కాంతులు నింపే దైవంగా బావిస్తారు పుడమి బిడ్డలు‌…ప్రతిఏటా ఈ పుడమి బిడ్డలు… పుష్యమావాస్య వచ్చిందంటే చాలు… నాగోబా జాతర. సంబురం మొదలవుతుంది… నెల వంక కనిపించిన నాడే.. నేల. తల్లి బిడ్డలు జాతరకు శ్రీకారం చుడుతారు..‌‌ పవిత్రమైన గోదావరి జలం కోసం.. కెస్లాపూర్‌ నుండి హస్తినామడుగు పవిత్రమైనా యజ్నానికి పాదయాత్రగా వెళ్లుతారు…‌శ్వేత వర్ణం దుస్తులు దరించి… కోండలు ,కొనలు,బండలు దాటుతూ‌ మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు.. పాదయాత్రలో అడుగు తడబడదు…అలసట నేరగకుండా జన్నారం‌మండలంలో కలమడుగు సమీపంలోని గోదావరి తీరంలోని హస్తినమడుగు చేరుకుంటారు..‌ అక్కడే పవిత్రమైన. జలాన్ని తీసుకోని కెస్లాపూర్‌ చేరుకుంటారు మేస్రం వంశస్థులు

ఆతర్వాత. పుష్యమావాస్య రోజు నాగోబాకు అత్యంత. ప్రీతిపాత్రమైనా రోజు… ఈ రోజే . అదివాసీలు అర్థరాత్రి పూట నాగోబాకు అచారాలు, సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తారు..‌ ఏడుగురు మేస్రం కటోడాలు, పీఠాదిపతులతో కలిసి నాగోబా దేవతను పూజిస్తారు‌ఆ పూజలకు మేచ్చి‌నాగోబా ప్రత్యక్షంగా కనిపిస్తుందని అదివాసీలు చెబుతున్నారు‌.. అదేవిధంగా పూజ సందర్భంగా శేషనారయణుడు వచ్చి అక్కడ కప్పినా తెల్లటి వస్త్రాన్ని కదుల్చుతుందంటున్నారు
తాము మహపూజ సందర్భంగా సమర్పించే నైవేద్యాన్ని నాగోబా స్వీకరిస్తుందని అంటున్నారు‌ మేస్రం పెద్దలు… నాగోబా దేవత ప్రత్యక్షమైన తర్వాతనే పవిత్ర గోదావరి జలంతో అభిషేకం చేసిజాతరను ప్రారంభిస్తామని అదివాసీలు చెబుతున్నారు
మేస్రం గణపతి పూజలు నిర్వహించే ఎడుగురిలో ఒకరు. జాతర అదివాసీల మేస్రం వంశస్తులను ‌ఎకం చేస్తోంది.. పండుగవచ్చిందంటే మేస్రం పరివార్ మొత్తం కదిలి కేస్లాపూర్ కు తరలి వస్తోంది… మేస్రం వంశస్థులు వాళ్లున్నానప్రాంతం మహరాష్ట్రైనా,మధ్యప్రదేశైనా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లో ఎక్కడ ఉన్నా అందరు కెస్లాపూర్‌ సన్నిదికి చేరుకుంటారు.. అందరు ఒకే కుటుంబంగా కలిసి నాగోబా దేవతను పూజిస్తారు.అదేవిధంగా మేస్రం వంశస్తులు కోడుకులకు పెళ్లి .‌కోత్తగా కోడళ్లు వస్తారు.. వచ్చిన కోడళ్లను నాగోబా దేవతకు బేటింగ్ తో పరిచయం చేస్తారు‌.. అదేవిధంగా మేస్రం పెద్దలకు కోడళ్లను పరిచయం చేస్తారు‌‌‌…ఈవిదంగా పరిచయం చేయడం వల్ల. మేస్రం కుటుంబాలలో అనుబందాలు, అప్యాయతలు పెరిగి బందాలు బలపడుతున్నాయని అంటున్నారు…అంతేకాదు వంటలు సైతం ఇరవై రెండు పోయ్యిలపై వంటలు చేస్తారు… ఆ వంటలతో చేసిన బోజనాలను అందరు కలిసి తింటున్నారు.. ఇలా వారం రోజులపాటు కలిసి పరమాన్నం తింటూ ప్రేమా అప్యాయతలను చాటుతున్నారు..ఇలా అందరు కలిసి అడుతూ పాడుతూ జాతరలో పాల్గోనడం ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

.నాగోబా దేవత అత్యంత మహిమ. గల‌‌.‌దేవత‌.‌ పూజిస్తేచాలు‌‌…ప్రార్థిస్తేచాలు..‌ పాడిపంటలను ఇచ్చే దేవత.. అలాంటి దేవతను దర్శించుకోవడానికి గూడాలు కదిలివస్తుంటాయి‌..‌ కాలిబాటన ఎండ్లబండి…బస్సులు, బైక్ లపై వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు‌..‌‌నాగోబా దేవతను దర్శించుకుంటున్నారు‌‌‌..‌ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు‌‌‌..గిరిజనులే కాదు…. బారీగా గిరిజనేతర భక్తులు దర్శించుకుంటున్నారు..
ఈ పవిత్రమైన దేవున్ని మొక్కుకుంటే చాలు నేరవేరని కోరిక ఉండదంటున్నారు..

..అదివాసీలు‌.. అమాయకులు… వందల‌ఎళ్లుగా అడవులను అవాసాలుగా చేసుకోని జీవిస్తున్నా పుడమి తల్లి బిడ్డలు‌… అలాంటి అదివాసీ బిడ్డలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు… సాగుచేసుకుంటున్నా భూములకు హక్కులు లేవు‌.. అదేవిధంగా త్రాగునీరు… సాగునీరు లేదు‌‌‌… త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తూ నీళ్లను తెచ్చుకుంటున్నారు… అదేవిధంగా వర్షదారంగా పంటలు పండిస్తున్నారు..‌ పైగా పండిన పంటలను ఇప్పటికి వ్యాపారులు ధరలో దగా చేస్తూ దోపిడీచేస్తున్నారు‌.‌ ఇలాంటి అదివాసీ బిడ్డల సమస్యలను పరిష్కరించడానికి నిజాం కాలంలో మానవ పరిణామ శాస్త్రవేత్త నాగోబా జాతరలో 1942లో దర్బారు కు శ్రీకారం చుట్టారు.. జాతరకు వచ్చిన గిరిజనుల నుండి సమస్యలను తెలుసుకోవడం… అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం హేమండ్ డార్ప్ చోరవచూపేవారు… అదే అనవాయితీ సంప్రదాయాన్ని ఇప్పటికీ స్వాతంత్ర్యం తర్వాత. సర్కార్ కోనసాగిస్తోంది‌‌‌…దర్బారు కలెక్టర్ అధ్యక్షత. నిర్వహిస్తున్నారు..‌‌ఈ‌ దర్బార్ సమావేశానికి మంత్రులు కూడ. హజరవుతున్నారు…‌కాని అడంబరాల దర్బార్ గా ‌ మారింది తప్ప…‌ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని గిరిజనులు అందోళన వ్యక్తం చేస్తున్నారు..

అద్బుతమైన కళకారులు… గోప్ప సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నావాళ్లు‌.. అధ్బుతమైన కళలు….సంగీతం వారి సోంతం… గుస్సాడీ న్రుత్యాలతో గుండేలను హత్తుకుంటున్నారు… థింసా న్యుత్యాలతో ‌మనస్సులను దోచుకుంటారు‌… అదేవిధంగా అదివాసీలు రామయాణం,మహబారతం, అదివాసీల. రాజుల. కథనలను అధ్బుతంగా ప్రదర్శిస్తారు.. మహబారతంలో కౌరవ,పాండవుల యుద్దమైనా , సందైనా , సమరమైనా సన్నివేశానికి అనుగుణంగా అదివాసీలు గోండి భాష లో ఇస్తున్నా ప్రదర్శనలు అందరిని అకట్డుకుంటున్నాయి..

.నాగోబా జాతర ‌లో అపూర్వమైన ఘట్డం.‌‌.. బేతాల్ పూజ‌…. గంగాజలం పాదయాత్ర మొదలు పెట్టి నాటి నుండి మహపూజ వరకు రకరకాల పూజలు అదివాసీలు నిర్వహిస్తారు‌‌. ‌‌‌వీటిన్నింటిని విజయవంతంగా క్రమపద్దతిలో నిర్వహిస్తారు… అచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ తుచా తప్పకుండా నిర్వహిస్తారు‌‌‌‌…ఇలా విజయవంతంగా నిర్వహించడానికి బేతల్ శక్తి దేవుడే కారణమని సంబరాలు నిర్వహిస్తుమంటున్నారు పీఠాదిపతి…‌ సంబరాలలో బాగంగా అదివాసీలు కర్ర ప్రదర్శన చేస్తారు…‌ఆ కర్ర ప్రదర్శన. యుద్ద కళను మరిపిస్తుండటం విశేషం.
ఆ తర్వాత మహిళలు, పురుషులు వేర్వేరుగా అడుతూ పాడుతు సంబరాలు చేసుకుంటారు మేస్రం వంశస్థులు

Leave A Reply

Your email address will not be published.