వరంగల్ లో హింది పేపర్ లీక్
ఈ. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝూళిలపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు.
దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్ ప్రశాంత్ ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్ లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.