దోరకని పదవ తరగతి జవాబు పత్రాలు

కోనసాగుతున్నా పోలీసుల. విచారణ

. బంగారు భవిష్యత్తు కోసం పదవ తరగతి విద్యార్థులు పరీక్ష. రాశారు… పలితాలలో ప్రతిభచాటుతామనుకున్నారు… కాని పోస్టల్ అదికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది… పటిష్ఠమైన బందోబస్తు మద్య. తరలించాల్సిన జవాబు పత్రాలను అటొలో తరలించారు…అటోలో తరలించిన జవాబు పత్రాలు మాయం అయ్యాయి… జవాబు పత్రాలు మాయం కావడానికి కారకులేవరు?అదిలాబాద్ జిల్లాలో పదవతరగతి జవాబు పత్రాల. మాయం పై ప్రత్యేక కథనం

 

. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో పదవ తరగతి జవాబు పత్రాలు మాయం సంచలనంగా మారింది.. ఉట్నూరు లో ఐదు పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షను రాశారు.. పరీక్షల అనంతరం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఆ ప్రాంతంలో పోస్టల్ కార్యాలయానికి తరలిస్తారు.. అక్కడి నుండి జిల్లా పోస్టల్ కార్యాలయానికి జవాబు పత్రాలు తరలిస్తారు..‌ జిల్లా పోస్టల్ కేంద్రాల ‌నుండి పరీక్ష వాల్యులేషన్ కేంద్రాలకు తరలిస్తారు.

…ఈ ప్రక్రియలో బాగంగా నిన్న. ఉట్నూర్ లో పదవతరగతి పరీక్ష రాసిన. విద్యార్థులు తెలుగు జవాబు పత్రాలను ఉట్నూర్ పోస్టల్ కార్యాలయానికి తరలించారు..‌అక్కడి నుండి మంచిర్యాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. అందులో బాగంగా ఉట్నూరు పోస్టల్ కార్యాలయంలో నుండి ‌పదకోండు బండిల్స్ కట్టారు…ఆ బండిల్స్ ను అటోలో వేసుకోని ఉట్నూరు బస్టాండు కు వెళ్లారు… మంచిర్యాలకు బస్సులో పంపే సమయంలో బండిల్స్ లేక్కించారు… కాని పదిమాత్రమే బండిల్స్ జవాబు పత్రాలు మాత్రమే కనిపించాయి… ఒక్క బండిల్స్ జవాబు పత్రాలు కనిపించలేదు..

… మాయమైనా జవాబు పత్రాల. కోసం పోస్టల్ అదికారులు అన్వేషణ కోనసాగించారు.. కాని బండిల్ లభించలేదు‌.‌జవాబు పత్రాలు దోరకలేదు ..దాంతో పోస్టల్ అదికారులు జవాబు పత్రాల మాయం పోలీసులకు పోస్టల్ అదికారులు పిర్యాదు చేశారు.. పోలీసులు జవాబు పత్రాల మాయంపైపోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. విచారణలో బాగంగా పోలీసులు జవాబు పత్రాలు కోసం అన్వేషణ కోనసాగించారు.. కాని జవాబు పత్రాలు లభించలేదు..

… అయితే మాయమైన జవాబు పత్రాలు మూడు వందల గ్రాముల బరువు ఉందని..‌ఇందులో ఉట్నూరు లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి రాసిన. తొమ్మిది మంది తెలుగు జవాబు పత్రాలు ఉన్నాయంటున్నారు ఎంఈఓ శ్రీనివాస్…జవాబు పత్రాల. తరలింపు తమకు బాద్యతలేదన్నారు..దీనికి పోస్టల్ అదికారులేదే బాద్యత అంటున్నారు

 

 

అయితే జవాబు పత్రాల. మాయం పై అదికారులు విచారణ. చేపట్టారు.. ‌ ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా , డీఈఓ ప్రణీత. ఉట్నూరు పోలీసులతో సమావేశం నిర్వహించారు..‌ ఈ సందర్భంగా జవాబుపత్రాలు తరలించడంలో పోస్టల్ అదికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై అడిషనల్ కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు..‌ ఎట్టిపరిస్థితిలో మాయమైనా జవాబు పత్రాలు స్వాదీనం చేసుకోవాలని అదేశించారు‌‌‌…సాయంత్రం వరకు పోస్టల్ అదికారులకు గడువు విదించారు‌. ఈలోగా జవాబు పత్రాలను పట్టుకోవాలని అదేశించారు… అడిషనల్ కలెక్టర్ అదేశంతో పోస్టల్ , పోలీసులు జవాబు పత్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు… ఒకవేళ. జవాబు పత్రాలు దోరకపోతే‌ఏం చేస్తారోనేది‌‌ … అధికారులు చెప్పడం లేదు… విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం జవాబు పత్రాల మాయం పై అందోళన చెందుతున్నారు‌‌.. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు

 

Leave A Reply

Your email address will not be published.