మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అగ్గిరాజేస్తున్నా అసంత్రుప్తి
మంత్రి వల్లనే పార్టీ దిగజారుతోంది ..శ్రీహరిరావు

మంత్రి పదవిని రెండు సార్లు దక్కించుకున్నారు… అదికారాన్ని అనుభవించారు… జెండాలు మోసిన కార్యకర్తలకు అన్యాయం చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బిఅర్ ఎస్ ఉద్యమ నాయకుడు శ్రీహరిరావు తిరుగుబాటు చేశారు.. ఎనుగు తోండాలు తోకలను నింపకుంటే సరిపోదని మంత్రి దోపిడి ప్రశ్నించారు.. అత్మలేదు..ఆత్మీయత లేని మంత్రికిఅత్మీయసమ్మెళనాలు నిర్వహించే హక్కులేదని అగ్గిరాజేశారు శ్రీహరి రావు.మంత్రిఇంద్రకరణ్ రెడ్డి పై బిఅర్ ఎస్ లోఅసంత్రుప్తి జ్వాలాలపై ప్రత్యేక కథనం.
నిర్మల్ జిల్లా కారుపార్టీలో అసంత్రుప్తి కాకరేపుతోంది..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బిఅర్ ఎస్ ఉద్యమ నాయకుడు కూచడి శ్రీహరి రావు తిరుగుబాటు చేశారు…మంత్రి తీరు పై నిప్పుల సేగను కక్కారు. రెండుసార్లు మంత్రి పదవి లభిస్తే ఆ పదవిని అనుభవిస్తున్నారు తప్ప కార్యకర్తలకు చేసింది ఏమిలేదన్నారు.. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అత్మీయ సమ్మెళనాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు..అత్మ, అత్మీయత లేని మంత్రికి అత్మీయ. సమావేశాలు నిర్వహించే హక్కులేదన్నారు.. ఎన్నికల అవసరం తీరగానే కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు
..తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్ని కేసులు ఎదుర్కోని కార్యకర్తలు పనిచేశారన్నారు…అలాంటి త్యాగాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు.. కేవలం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన వర్గానికి మాత్రమే పదవులు ప్రాదాన్యతనిస్తున్నారని ఆరోపించారు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2014 ఎన్నికలలో బిఎస్పీ నుండి విజయం సాదించారు..ఆ తర్వాత బిఎస్పీ నుండి బిఅర్ ఎస్ లో చేరారు..ఆయనతో పాటు వచ్చిన. వారికి ప్రాదాన్యతనిస్తున్నారు తప్ప.. ఉద్యమ. కాలంలో పనిచేసిన. వారికి ప్రాదాన్యత ఇవ్వడం లేదని శ్రీహరి రావు అవేదన. వ్యక్తం చేశారు..
. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై సంచలన ఆరోపణలు ఎనుగు తోండాలు, తోకలు నింపుకుంటే సరిపోదన్నారు..ఈవిదంగా పరోక్షంగా మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్నా దోపిడీ ని ప్రశ్నించారు.. నా బ్రుందం బాగుంటే సరిపోతుందనే పరిస్థితి చెల్లదని హెచ్చరించారు.. త్యాగాలు చేసిన కార్యకర్తలకు పదవులు దక్కకపోతే మీ పదవి ఏం లాభమని మంత్రిని నిలదీశారు. ఎన్నికలు రాగానే అత్మీయతలు ఒలకబోస్తే కార్యకర్తలు నమ్మరన్నారు…మంత్రికి , వలస పాలకులకు ఎమితేడా లేదన్నారు… పార్టీ కార్యకర్తలు గడప గడపకు వెళ్లి గెలిపించారన్నా సంగతిమంత్రి మరువవద్దని సూచించారు..
.మరో వైపు మంత్రి ఇంద్రకరణ్ ఒంటేద్దు పోకడల వల్ల పార్టీ పరిస్థితి దిగజారుతుందన్నారు.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి విజయం సాదించారు..కాని ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిఅర్ ఎస్ మూడోస్థానానికి దిగజారిందన్నారు..దీనికంతటికి మంత్రి వైఖరే కారణమన్నారు.. నిర్మల్ గడ్డ పౌరుషలా అడ్డన్నారు..కుత్రిమ. అత్మీయతలకు ఏవరు లోంగరన్నారు.. ఇక్కడి ప్రజలు చరిత్రను రాసినోళ్లు.. కాగల కార్యాన్ని తీర్చే రోజులు దగ్గరనే ఉన్నాయన్నారు.
. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై సంచలన ఆరోపణ చేసిన శ్రీహరిరావు ఏవరని తీవ్రమైన చర్చ సాగుతోంది.. తెలంగాణ ఉద్యమం కాలంలో పనిచేశారు…ఆదిలాబాద్ జిల్లా అప్పటి అర్ ఎస్అద్యక్షునిగా పనిచేశారు..అదేవిదంగా,2009, 2014ఎన్నికలలో నిర్మల్ టిఅర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయారు..2014 ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బిఎస్పీ అభ్యరిగా పోటీ చేశారు…ఆ ఎన్నికలలో టిఅర్ ఎస్ అభ్యర్థిగా శ్రీహరిరావు పోటీ చేశారు..ఈఎన్నికలలో బిఎస్పీ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి పై అత్యల్ప ఓట్ల తేడాతో శ్రీహరి రావు ఓడిపోయారు.. ఆ తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి బిఅర్ ఎస్ లో చేరారు మంత్రి అయ్యారు.. అప్పటి నుండి శ్రీహరి రావుకు పార్టీలో ప్రాదాన్యత లభించడం లేదని ఆయన భావిస్తున్నారు.. అయితే2018 ఎన్నికలలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి గెలుపు కోసం శ్రీహరిరావు పనిచేశారు. ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినందుకు శ్రీహరిరావుకు ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని ప్రచారం సాగింది..కాని ఏలాంటి పదవి లభించలేదు…మంత్రి వల్లనే పదవి లభించలేదని శ్రీహరి రావుఅసంత్రుపత్తితో ఉన్నారు.. అందుకే శ్రీహరిరావు తిరుగుబాటు చేశారని పార్టీ చర్చ. సాగుతుంది.. ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని శ్రీహరి రావు బావిస్తున్నారట..టిక్కేట్ వస్తే బిఅర్ ఎస్ నుండి లేదంటే బిజెపి నుండి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది…మరి శ్రీహరిరావు బిఅర్ ఎస్ శ్రీహరిరావును బుజ్జగించి పార్టీ దారికి తెస్తారో లేదంటే శ్రీహరి రావు పార్టీ మారుతారో చూడాలి