ఆదిలాబాద్ జిల్లా ఎజెన్సిలో కల్తీ కల్లు ఖార్ఖానాలు
అదివాసీల. ప్రాణాలు మింగుతున్నా కల్తీకల్లు

అది కల్తీ.కల్లు… పాలలాగ నురులు కక్కుతోంది… త్రాగితే చాలు పైలోకానికి పంపిస్తోంది… అలసటను దూరం చేయడానికి త్రాగితే…. అదివాసీ బిడ్డలను పరలోకానికి పంపుతోంది… ప్రాణాలు మింగుతూ అదివాసీ గూడాలను ఖాళీ చేస్తోంది.. కల్తీ కల్లు అదివాసీ బిడ్డల. ప్రాణాలు మింగుతున్నా ఎక్సైజ్ అదికారులు ఎందుకు చర్యలు తీసుకోరు..?అదివాసీ బిడ్డలను మింగుతున్నా కల్తీ కల్లు పై ప్రత్యేక కథనం
.ఆదిలాబాద్ జిల్లా ఎజెన్సి ప్రాంతం లో కల్తీ కల్లు ఎరులై పారుతోంది… అదివాసీ బిడ్డలు నివసించే ప్రాంతంలో ఈత, తాటి వనాలు లేవు.. కాని కల్తీ కల్లు తయారు చేసే ఖర్ఖానాలు వందలు ఉన్నాయి… ఇంద్రవెల్లి , ఉట్నూరు, కేరమేరి,జైనూర్ , సిర్పూర్ యు, లింగపూర్ మండలాల్లో కల్తీ కల్లు కార్ఖానాలు ఏర్పాటు చేసింది కల్తీ కల్లు మాపియా…ఒకవేళ ఆ ప్రాంతం కల్తీ కల్లు ఖార్ఖానాలు లేకుంటే.. లేని ప్రాంతాలకు కల్లును ప్రత్యేకంగా వ్యాన్లు ఏర్పాటు చేసి కల్లు తరలిస్తున్నారు..అమ్మకాలు సాగిస్తున్నారు అక్రమార్కులు
.ఈ కల్తీ కల్లుకు అదివాసీలు బానిసలుగా మారుతున్నారు…ఒక్కసారి కల్తీ కల్లుబానిసైతే చాలు… త్రాగుకుంటే చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తుంటారు..మరి కోందరు ఆ మత్తు మోతాది మించి అకాస్మాతుగా ప్రాణాలు కోల్పోతున్నారు.. ఉట్నూరు మండలంలో చిన్న సుద్దగూడానికి ముప్పై ఎళ్ల యువకుడు ముప్పత్ కల్తీ త్రాగారు. త్రాగిన గంట వ్యవదిలో ముప్పత్ రావు ప్రాణాలు కోల్పోయారు.. అంతకుముందు ఇదే గూడంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
…కుటుంబానికి అసరాగా ఉండే కోడుకును కోల్పోవడంతో అదివాసీలు అందోళన చెపట్టారు.. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదివాసీలు అందోళన చేపట్టడంతో ఎక్సైజ్ అదికారులు లక్కారంలో కల్తీ కల్లు ఖార్ఖానా దాడులు నిర్వహించారు…ఆ దాడుల్లో భయంకరమైన నిజాలు భయటపడ్డాయి.. ప్రదానంగా కల్లు తయారు చేయడానికి బ్లీచింగ్ పౌడర్, లేమన్ క్రీమ్, యూరియా,హైడ్రో క్లోరిన్ వంటి పదార్థాలతో కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు బయటపడింది.. ఇలాంటి విషపు పదార్థాలతో కల్లు తయారు చేస్తూ గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడుతున్నారు… గిరిజనుల. ప్రాణాలతో చేలగాటం అడుతున్నా వ్యక్తి పై చర్యలు చేపట్టాలని గిరిజనులు అటవీ అదికారులను కోరుతున్నారు
వాయిస్ ఓవర్… కల్తీ కల్లు తయారు చేస్తున్నా ఖార్కానాకు అనుమతి లేదు…లైసెన్స్ లేకుండా కల్లు తయారు చేస్తున్నా వ్యక్తి కిష్ట గౌడ్ పై ఎక్సైజ్ అదికారులు కేసు నమోదు చేశారు.. అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. అదేవిధంగా కల్తీ కల్లు శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు.కల్తీ తయారు చేస్తున్నా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ కిషోర్ హెచ్చారించారు.