ఓడిపోయా దోరా…రాజీనామా చేస్తున్నా దోరా

ఎమ్మెల్యే సంజయ్ దోరా వేదింపులు తట్టుకోలేక. రాజీనామ చేస్తున్నా మున్సిపల్ చైర్మన్ శ్రావణి

ఓడిపోయాము… దోరా… నువ్వు గెలిచావు.సంజయ్ దోరా.. పదవి. నాది పెత్తనం ఆయనది… ఎమ్మెల్యే సంజయ్ దోరా నీ వేదింపులు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నానని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు
మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త భేదిరించారని ఆరోపించారు.డబ్బులు కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పామన్నారుబీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారని అందోళన వ్యక్తం చేశారు..తాను చేసేఅన్ని పనులకు అడ్డు తగాలరన్నారు. ఎమ్మెల్యే
చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేశారన్నారు.. వేదింపులతో మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారిందన్నారు.అవిశ్వాసం ఎమ్మెల్యే డ్రామారని మండి పడ్డారు… మూడేళ్లుగా ఎమ్మెల్యే వేదింపులతో నరకయాతన అనుభవించానని శ్రావణి విలపించారు…బానిస సంకేళ్లు తెంచి గడిలను బద్దలు చేసే రోజులు వస్తాయని ఎమ్మెల్యేను హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.