బీహర్ నుండి తెలంగాణకు బియ్యం సరపరా దందా
వందల కోట్ల. పీడిఎస్ బియ్యాన్ని తెలంగాణ సరపరా చేస్తున్నా మాపియా

..దాన్యాన్నిమింగేశారు .. వందల కోట్ల రుపాయలు కోట్టేశారు. సర్కారు ను దగా చేశారు..దోపిడి దందా బయట పడకుండా కోత్త ఎత్తుగడ వేశారు మిల్లర్లు..బీహర్ నుండి బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు…ఆ బియ్యాన్ని పీడీఎస్ బియ్యంగా తెలంగాణలో సరపరా చేస్తున్నారు…తెలంగాణ లో బీహరి బియ్యం దందా పై ప్రత్యేక కథనం
. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల దందాకు అడ్డు అదుపు లేదు… సర్కారు దాన్యం కోనుగోలు చేసిన తర్వాత సీఏం అర్ బియ్యంగా తయారు చేయడానికి రైస్ మిల్లర్లకు దాన్యం సరపరా చేస్తోంది..ఆ దాన్యాన్ని బియ్యంగా తయారు చేసి సీఎంఅర్ గా మార్చి పౌర సరపరా శాఖకు బియ్యాన్ని మిల్లర్లు చేయాలి… ధాన్యాన్ని బియ్యంగా మార్చి సర్కారుకు సరపరా మిల్లర కు చెల్లింపులు చేస్తోంది..ఈవిదంగా వచ్చిన బియ్యాన్ని పేదలకు నెలనెల సరపరా చేస్తున్నారు అదికారులు
.. కాని రైస్ మిల్లర్లకు సరపరా చేసిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు మిల్లర్లు… ఎకంగా పక్క రాష్ట్రాలకు వందల. కోట్ల దాన్యాన్ని అమ్ముకున్నారు.ఈవిదంగాఅమ్ముకోని కోట్లు గడించారు..కాని ఇప్పుడు సీఎంఅర్ బియ్యాన్ని సరపరా చేయడానికి మిల్లర్ల వద్ద. బియ్యం సరపరా చేయడానికి ధాన్యం లేదు, అదేవిధంగా మిల్లింగ్ చేసిన బియ్యం లేవు.. వేల మెట్రిక్ టన్నుల వరి దాన్యం మిల్లర్లు పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు…దీనితో రైస్ మిల్లులో ఒక్క సంచి దాన్యంకనిపించడం లేదు..మంచిర్యాల, నిర్మల్, కాగజ్ నగర్, ప్రాంతాలలో రెండు వందలకు పైగా మిల్లులు ఉన్నాయి… వీటిలో డెబ్బై శాతం రైస్ మిల్లులు 2022,2023ఖరఫ్ సిఎంఅర్ బియ్యాన్ని సరపరా చేతులు చేత్తేశాయి… అదికారులుబియ్యాన్ని గడువు మీద గడువు విదిస్తున్నారు..దాన్యం బయట అమ్ముకోవడంతో బియ్యం సరపరా చేయడం లేదు మిల్లర్లు ..నిర్మల్ రబీ సీజన్ ఇంకా ఆరవై శాతం బియ్యాన్ని సరపరా చేయాల్సి ఉంది…దాన్యంలేక. గడువులు దాటుతున్నా బియ్యాన్ని సరపరా చేయడం లేదు.
.. అయితే దాన్యంఅమ్ముకున్నా దందా బయట పడకుండా మిల్లర్లు కోత్త దందాకు తెరలేపారు.. బీహర్ ,మద్యప్రదేశ్ ప్రాంతాలలో అక్కడి పీడిఎస్ బియ్యాన్ని కోనుగోలు చేస్తున్నారు.. అక్కడి నుండి పీడిఎస్ బియ్యాన్ని కిలోకు పదిరుపాయలకు కోనుగోలు చేసి ఇక్కడి తరలిస్తోంది రైస్ మిల్లు మాపియా..ఆ బియ్యానే రైస్ మిల్లర్లు సీఎంఅర్ బియ్యంగా పౌర సరపరా అదికారులకు, పుడ్ కార్పోరేషన్ అప్ ఇండియాకు సరపరా చేస్తున్నారు… ఈవిదంగా బీహార్ ,మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ , ప్రతినెల వేల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ కు సరపరా అవుతున్నాయి..ఇటీవల. నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద. బీహర్ నుండి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నా లారీని పౌరసరపరా శాఖ అదికారి తానూజా పట్టుకున్నారు.. రెండు వందల యాబై క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు.. ఈ బియ్యం జగిత్యాల జిల్లాకు తరలిస్తున్నారని తెలింది.. ఇలా ప్రతినిత్యం వందల లారీలలో ఇతర రాష్ట్రాల నుండి వందల లారీలలో తెలంగాణకు , ఉమ్మడి ఆదిలాబాద్ కు బియ్యం సరపరా అవుతుందని అదికారుల. విచారణలో తెలింది
.. అయితే రైస్ మిల్లర్ల బియ్యం దందా అడ్డగోలుగా సాగుతోంది…రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో అక్రమంగా తరలించకుండా కట్టడి చేయడానికి సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఉన్నాయి.. కాని అక్రమ బియ్యం రవాణా చేతులు ఎత్తేశాయి… కనీసం తనిఖీలు చేయడం లేదు.. అక్రమ బియ్యం రవాణా కట్టడి చేయడం లేదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోరజ్, వాంకిడి సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కేంద్రాలు ఉన్నాయి..ఈ చెక్ పోస్టుల వద్ద అదికారులు మాపియాతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి.. అందుకే దందా అడ్డుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు…ఇప్పటికైనా అక్రమ బియ్యం రవాణా అడ్డుకట్టవేయడానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.