చెరువులను తలపిస్తున్నా కోనుగోలు కేంద్రాలు

బారీ వర్షాలకు తడిసిన వరి దాన్యం నిల్వలు

. కుండపోత. వర్షాలు కురిసాయి.. ఆ వర్షపు నీటితో కోనుగోలు కేంద్రాలు నీటిలో మునిగాయి… వరదనీటితో ‌చెరువులను తలపిస్తున్నాయి. ఆ తడిసిన దాన్యానికి మొలకలు వస్తున్నాయి.నీటిలో మునిగిన.దాన్యం చూసి కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..ఆరబేట్టుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కోనుగోల్లు లేక. వర్షాలు కోంపలు ముంచుతున్నాయని రైతులు అందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలో బారీగా వర్షాలతో నష్టపోయిన రైతుల పై ప్రత్యేక కథనం

..మంచిర్యాల జిల్లాలో రెండు రోజులు కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.. మరోక వైపు భయంకరమైన గాలులు వీస్తున్నాయి..ఈదురు గాలులతో కూడిన. బారీ వర్షాల వల్ల రైతులకు తీవ్రమైన నష్టం సంభవించింది… ప్రదానంగా లక్షిట్ పెట., హజీపూర్, దండపల్లి‌ మండలాల్లో బారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు..

బారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాలు నీటితో నిండిపోయాయి..అమ్మకం కోసం తెచ్చిన దాన్యం కోనుగోలు కేంద్రాలలో నీటిలో మునిగిపోయాయి..దాన్యం కుప్పలపై కవర్లు కప్పినా బారీ వర్షాలకు దాన్యం కుప్పలు నీటిలో మునిగిపోయాయి… హజీపూర్ మండలం గుడిపేటలో కోనుగోలు కేంద్రం పూర్తి గా నీటిలో మునిగిపోయింది.. అక్కడ. పోసిన దాన్యం నీటిలో ‌మునిగిపోయిందని రైతులు ‌ అవేదన వ్యక్తం చేస్తున్నారు… వరద నీటి నుండి బయటకు దాన్యం తీద్దామంటే తీయ లేని పరిస్థితులు ఉన్నాయని రైతులు వాపోయారు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట పూర్తిగా వర్షం పాలైందని రైతులు కన్నీటి పర్యంతం‌అవుతున్నారు

లక్షిట్ పెట మండలం కోత్తూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రం లో దాన్యం వర్షానికి తడిసింది..వారం రోజుల వ్యవధి లో మూడు సార్లు తడవటంతో దాన్యానికి మొలకలు వచ్చాయి.. తడిసిన ధాన్యాన్ని అరబేట్టుకోవడానికి కౌలు రైతు రాయమల్లు ,. ప్రయత్నాలు చేస్తున్నారు.. పూర్తిగా నీటిలో మునిగిన దాన్యాన్ని అరబేడుతున్నారు…రెండేకరాలు కౌలు తీసుకోనిసాగు చేసుకున్నా రాయమల్లు కు ఆకాల. వర్షాలు అపారమైన నష్టాన్ని మిగిల్చాయి.. వర్షాలతో పేట్టిన పెట్టుబడి దేవుడేరుగు‌.కనీసం కౌలు వచ్చే పరిస్థితి లేదని ఆయన వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాయమల్లు ఒక్కరిది కాదు..‌ ఈ ప్రాంతం లో అందరిది ఇదేవిదంగా రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

..కోత కోసిన పంటను ఆకాల వర్షాలు కోనుగోలు కేంద్రాలలో ముంచింది‌.‌మరోక వైపు కోతకు వచ్చిన పంట. ఈదురు గాలుల దెబ్బ కు నేలమట్టమైంది… దాంతో వండ్లు రాలిపోయాయి.వడగండ్ల వాన, ఈదురు గాలులకు వరి గడ్డి కూడ పనికి రాకుండా పోతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు… అదేవిధంగా బారీ ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపోయాయి… ఆ. విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలు మింగుతున్నాయి.. అదేవిధంగా పశువుల ప్రాణాలు తీస్తున్నాయి.. ర్యాలీఘడ్ గ్రామంలో ఈదురుగాలుకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి..ఆరు ఎద్దులు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు..పశువులను ‌కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. . ఆకాల వర్షాల వల్ల. రైతులు సర్వం కోల్పోయారు… నష్టపోయిన తమను అదుకోవాలని రైతులు సర్కార్ ను కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.