రైతులను ముంచిన ఆకాల వర్షాలు
కోనుగోలు కేంద్రాలలో తడిసిన వరిదాన్యం

.ఈదురు గాలులతో కూడిన బారీ వర్షాలు… ఆ బారీ వర్షాలు పంటలను నీటిలో ముంచుతున్నాయి…నేలమట్టం చేస్తున్నాయి..నీటిలో మునిగిన. దాన్యానికి మొలకలు వస్తున్నాయి.. ఆకాల వర్షంతో రైతులు తల్లడిల్లుతున్నారు.. అందోళన చెందుతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కన్నీటి మిగిల్చిన పంటల పై ప్రత్యేక కథనం
.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా బారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈదురు గాలులతో కూడిన బారీ వర్షాలు భీభత్సాన్ని స్రుష్టించాయి. ప్రదానంగా మంచిర్యాల జిల్లాలో లక్షిట్ పెట , దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాల్లో వేలాది ఏకరాలలో వరిసాగు చేశారు రైతులు.. వరి పంట ఈదురుగాలులతో కూడిన బారీ వర్షాలకు తీవ్రమైన నష్టం సంభవించిందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. గాలుల దెబ్బకు వరి పంట. నేల పాలైంది..వరిపంట నేల మట్టం కావడంతో వరిదాన్యం రాలిపోయింది..నేల పాలైంది..అదేవిదంగా కోతకు వచ్చిన ధాన్యాన్ని కోనుగోలు చేసి కోనుగోలు కేంద్రాలకు తరలించారు… తరలించిన దాన్యం ఆకాల వర్షానికి తడిసి పోయింది.. కవర్లు లేకపోవడంతో వరి దాన్యం వరదలో కోట్టుకోని పోయిందని రైతులు వాపోతున్నారు…ఇంతటి నష్టం ఎప్పుడు సంబవించలేదని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరి తర్వాత జోన్న,మొక్కజోన్న పంటలకు తీవ్రమైన నష్టం సంబవించింది…. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జోన్న, మొక్కజోన్న నేలపాలైంది…తీరా కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులను కోలుకోలేని దెబ్బతీసింది..జోన్న పంట. క్రిందపడటంతో తెల్లని జోన్నలు నల్లబారుతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు..బూజుపాడుతున్నాయి… అదేవిధంగా వడగండ్ల వానకు జోన్నలు రాలిపోయానని వాపోతున్నారు జోన్న రైతులు.. మొక్కజోన్న పంటలు కోందరు కోతకొశారు..మరికోందరు కోయడానికి సిద్దమయ్యారు.. కాని బారీ ఈదురు గాలులతో కోనుగోలు కేంద్రాలలో అమ్మకానికి సిద్దంగా మొక్క జోన్నలు తడిసిపోయాయి.. కోతకు వచ్చిన. మొక్క జోన్న పడిపోయింది. బారీగావర్షాలు కురుస్తుండటంతో క్రిందపడిన. మొక్కజోన్నలకు మొలకలు వస్తున్నాయని రైతులు అందోళ చెందుతున్నారు..
.అప్పు తెచ్చి సాగు చేసిన పంటలు ఆకాల వర్షాల పాలయ్యాయి… పంటల సాగు కోసం వేల రుపాయలు పెట్టుబడి పెట్టారు.. కాని వర్షాలతో అణా పైసా వచ్చే పరిస్థితి లేదంటున్నారు.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులను కట్టేదేలా అందోళన చెందుతున్నారు…వరి రైతులు ఎకరాకు నలబై వేలు పెట్టామని …కాని పదివేలు కూడ వచ్చే పరిస్థితి లేదందటున్నారు..జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది… పంటంతా నేలమట్టమైంది..కంకులు రాలాయి….. ఆరాలిన కంకులకు గింజలు లేవు.. గింజలన్ని భూమి పాలయ్యాయి.. ఏకరాకు ఇరవై క్వింటాళ్ల జోన్నలు పండించె రైతులు..ఇప్పుడు ఆకాల వర్షాలతో ఐదు క్వింటాళ్లు మించవంటున్నారు రైతులు.. ఇలాంటి పరిస్థితులలో పంటల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేమని రైతులు బాదపడుతున్నారు…నష్టపోయిన రైతులను అదుకోవాలని కోరుతున్నారు.. నష్టపోయిన పంటలకు పరిహరం ఇప్పించాలని సర్కార్ ను రైతులు వేడుకుంటున్నారు..