మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింటా విషాదం
విద్యుత్ షాక్ తో పెళ్లి కోడుకుమ్రుతి

మహబూబాబాద్ జిల్లాలో పెళ్ళికొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. పెళ్ళి ఇంటా విషాదం అలముకుంది. రేపు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్ళిసందడిగా ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది.
మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాలో పెళ్ళికొడుకు భూక్య యాకూబ్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. భూక్య బాలాజీ కాంతి దంపతుల ఏకైక కుమారుడు యాకుబ్ కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు మోటార్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్ళింటా విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారుతోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతి చెందిన పెళ్ళికొడుకు యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్ళి పనుల్లో భాగంగా ఇంట్లో నీళ్ల కోసం బోరు మోటారు ఆన్ చేస్తుండగా షాక్ గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా షాక్ గురయ్యారు. 12న అర్థరాత్రి పెళ్ళి, 13న ఆదివారం యాకుబ్ ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయగా కరెంట్ షాక్ విషాదాంతంగా మార్చిందని బందువులు కన్నీటి పర్యంతమయ్యారు.
పెళ్ళికొడుకు అక్క పెళ్ళీడు కొచ్చాక మృతి చెందగా పెళ్లి సమయంలోనే యాకుబ్ ప్రాణాలు కోల్పోవడంతో బందువులు తలుచుకుంటూ విలపించారు. యాకుబ్ కు ఒక చెల్లెలు ఉన్నారని తెలిపారు. విధి వక్రీకరించడంతో బాజాలు మ్రోగాల్సిన ఇంట చావు డప్పు మ్రోగడంతో చూపరుల హృదయాలను ద్రవింపజేసింది