పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనమేటు?

కమలంలో చేరుతారా?కాంగ్రేస్ లో‌‌కలుస్తారా?

ఖమ్మం  రాష్ట్ర రాజకీయాలకు    యుద్ద క్షేత్రమైంది.. బిఅర్  ఎస్  వర్సేస్   పోంగులేటి  మద్య పోరుసాగుతోంది  ..బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి సస్పెన్షన్  వేటు  వేసింది..ఈ  నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్తారని జోరుగా చర్చ జరుగుతోంది …అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపద్యంలో కాంగ్రెస్, బీజేపీ రెండిటిలో ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపడమా…లేక కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగుల వేస్తారా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను గెలవనివ్వను అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి శపథం చేయడం బట్టి చూస్తే పొంగులేటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నన్నది పొలిటికల్ సర్కిల్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది… పార్టీ మార్పు విషయంలో పొంగులేటి వ్యూహాత్మకంగా వెళుతున్నారా..అసలు తెర వెనుక జరుగుతున్నా  పరిణాలు ఎంటి? గులాబీ పార్టీని  ఎలా ఎదుర్కోంటారనేది   ఉత్కంఠను  రేపుతోంది

 

…మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో పొంగులేటి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరుగుతుంది..ఖమ్మం జిల్లాలో ఏ ఇద్దరినీ కదిలించిన పొంగులేటి ఏ పార్టీలోకి చేరబోతున్నారన్న విషయం పైనే మాట్లాడుకుంటున్నారు… కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు కూడా పొంగులేటి తమ పార్టీలకు వస్తారంటే తమ పార్టీలకు వస్తారని చెప్పుకుంటున్నారు..అయితే పార్టీ మార్పు విషయంలో మొదటి నుంచి కూడా పొంగులేటి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు…ఏ పార్టీలోకి వెళ్ళబోతున్న దానిపై చాలా గోప్యత పాటిస్తున్నారు.
అంతెందుకు పొంగులేటి దగ్గర అనుచరులకు కూడా పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారు అన్నదానిపై క్లారిటీ లేదంటే ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నదానిపై స్పష్టంగా అర్థమవుతుంది..

.. అయితే ప్రస్తుతం పొంగులేటి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నట్లు తెలుస్తుంది..ఆప్షన్-1 బిజెపి, కాంగ్రెస్ రెండిట్లో ఒక పార్టీకి వెళ్లడమా…ఆప్షన్-2 బి.ఆర్.ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలు అందరితో కలిసి సొంత పార్టీ ఏర్పాటు చేయడమా…రెండు ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ అయితే కచ్చితంగా తీసుకోబోతున్నారు… ప్రస్తుతం ఎన్నికలకు కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉన్న నేపద్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అంత ఈజీగా వర్క్ అవుట్ అయ్యే పనా అన్న చర్చ సైతం జరుగుతుంది.

అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను గెలవనివ్వను..అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి శపథం చేయడం బట్టి చూస్తే పొంగులేటి కచ్చితంగా కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుగులు పడే అవకాశాలు లేదన్న వాదన సైతం వినిపిస్తుంది..కాంగ్రెస్ లేదా బిజెపి ఈ రెండిటి లో ఏదో ఒక పార్టీ వైపే మొగ్గుచూపుతోనే పొంగులేటి అనుకున్న శపధం నెరవేరే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుతున్నారు.. పొంగులేటి శపధం నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం అప్రమత్తమయ్యారు.. పార్టీ అధిష్టానం సూచన మేరకు దూకుడు పెంచి పొంగులేటి పై ఎదురుదాడి ప్రారంభించారు…ఏమాత్రం అలసత్వం వహించిన అసలుకే ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు…ఇన్ని రోజులు ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క అన్న ధోరణితో ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తున్నట్లు తాజా రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది…

..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి..
8 నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలలో పొంగులేటి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పై విమర్శలు చేసిన పట్టించుకోలేదు..కానీ కొత్తగూడెం లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం జూపల్లితో పొంగులేటి జతకట్టి ఒకే వేదికను పంచుకొని పార్టీ అధిష్టానం పై విమర్శలు చేయడమే కాకుండా పార్టీలో ఉన్న చాలామంది అసంతృప్తి నేతలు అంతా ఒక తాటి పైకి వస్తారని మాట్లాడటంతో సీరియస్గా తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.. అంతేకాదు జూపల్లి ,పొంగులేటి చెప్పినట్లు వారితో జతకట్టడానికి సిద్ధంగా ఉన్న పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలు ఎవరన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం.. ఏ జిల్లాకు చెందిన నేతలు ఉన్నారన్న దాని పై నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకునే పనిలో బిజీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం..

.. ఆ అసంతృప్తిగా ఉన్న నేతలలో కొందరు
ఖమ్మం నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటితో కలిసి వేదికను పంచుకోబోతున్నారు..
ఇది కూడా మరింత కీలకంగా మారనుంది.. దీంతో అందరి దృష్టి ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం పై పడింది… ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు పొంగులేటి ఏర్పాటు చేస్తున్నారు.. ఈ ఆత్మీయ సమ్మేళనం తర్వాత పొంగులేటి పార్టీ మార్పు,లేక కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తారన్న దానిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…అయితే సమయం మరింత ఆలస్యం చేస్తే పొంగులేటి వెంట ఉన్న క్యాడర్ కూడా చేజారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే పొంగులేటి రాజకీయ నిర్ణయం ప్రకటించనున్నారని సమాచారం…అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి..

Leave A Reply

Your email address will not be published.