తెలంగాణలో కుటుంబపాలన అవినీతి సాగుతోంది

అవినీతి పాలన అంతం చేయాలని ప్రదాని ప్రజలకు పిలుపు

 

హైదరాబాద్     పరేడ్  గ్రౌండ్ లో తెలుగులోప్రదాని నరేంద్ర మోడి   ప్రసంగం ప్రారంబించారు ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ  తెలుగులో  మాట్లాడి సబికులను అకట్టుకున్నారు. ఈ. సందర్భంగా  ప్రదాని‌  మాట్లాడారు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ రైలు ద్వారా టెక్నాలజీ నుంచి ఆధ్యాత్మిక ప్రాంతానికి కనెక్టివిటీ పెరగనుంద‌ని అన్నారు

 

 

యుపిఎ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు.సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు..కానీ మేము సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కే సాథ్ అనే నినాదంతో సామాన్యులతోనే ఉండి దేశాభివృద్ధికి పాటుబడ్డమన్నారు .కేంద్రంలోకి తాము వచ్చాక తెలంగాణ భారీగా అభివృద్ధి జరిగిందన్నారు.మెట్రో,  ఎంఎంటిఎస్  పనులు చేపట్టాం.. ఇవ్వాళ 13  ఎంఎంటి ఎస్  రైళ్లను సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ప్రారంభించామన్నారు

 

 

ప్రస్తుతం దేశం ఒక నవభారతం.దేశం నలుమూలల అభివృద్ధి జరుగుతోందని  అన్నారు రికార్డుస్థాయిలో పనులు పూర్తి చేశామన్నారు.సికింద్రాబాద్ నుంచి మహాభూబ్  నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తయన్నారు కర్ణాటక బెంగుళూరుకు మధ్య కనెక్టివిటీ పెరగతుందన్నారు.తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులతో రవాణా సమయం తగ్గడంతో పాటు ట్రాన్స్ పోర్ట్ సులువుగా అయింది. పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు

హైదరాబాద్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్ గా మారనుందన్నారు .ఇండస్ట్రీ, టెక్స్ టైల్ రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. దేశవ్యాప్తంగా 7 టెక్స్ టైల్ పార్కులను కేంద్రం ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోందన్నారు

 

కానీ పిడికెదంత కూడా లేని కొందరు వ్యక్తులు మా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.కుటుంబ పార్టీ, మామ, అల్లుడు, కూతురు, కొడుకు ఉన్న పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు .కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు కుటుంబ పార్టీలు అందరినీ తమ కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తాయని అన్నారు వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే నచ్చదన్నారు .అవినీతి చేసిన డబ్బులనన్ని దాచుకున్నారని ఆరోపించారు.ప్రజా సంక్షేమం కోసం అందించే నిధులు కూడా వారి ఖాతాల్లోనే దాచుకుంటున్నారనొ విమర్శించారు.కుటుంబ పార్టీల అవినీతిని ఎదుర్కోవాలా వద్దా.. వారిని ప్రశ్నించాలా వద్దా.. ప్రజలు నిర్ణయించాలన్నారు అవినీతి చేసే కుతూ6పార్టీలకు చెక్ పెట్టాలా వద్దా, వారికి బ్రేకులు వేయలా వద్దా  ప్రజలను  ప్రశ్నించారు ప్రదాని మోడి9 ఏండ్ల మా పాలనలో దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. దీనితో మహిళల పరువు దక్కింది తెలంగాణలో ఉన్నట్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ పార్టీలు సామాన్యుల రేషన్ కూడా దోచుకుంటున్నాయన్నారు.రాబోయే 25 ఏండ్లలో దేశంతో పాటు తెలంగాణకు మహర్దశ  ఉంటుందన్నారు ప్రదాని

Leave A Reply

Your email address will not be published.