తెలంగాణలో ప్లాస్టిక్ రహిత తోలి అదివాసీగూడేం
గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నా గిరిజన గూడేం

ప్లాస్టిక్ వద్దంటున్నారు.. పర్యావరణమే ముద్దంటున్నారు..పాయిజన్ లాంటి ప్లాస్టిక్ గూడేం గడపకు చేరకుండా పాతరేస్తున్నారు.. ప్లాస్టిక్ సమరం పై సాగిస్తున్నారు అదివాసీ బిడ్డలు.. పాయిజన్ లాంటి ప్లాస్టిక్ పై కట్టడి చేయడాని గ్రీన్ టాక్స్ విదిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రం లో గ్రీన్ టాక్స్ అమలు చేస్తున్నా గిరిజన గూడేం పై ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్
మనం చూస్తున్నా గూడేం అదివాసీ గూడేం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దోంగచింత గ్రామం. ..ఈ గూడేంలో ఐదువందల. జనాభా ఉంటుంది… వీరంతా గిరిజనులు…గిరిజనులు సరకుల కోసం సంతకు వెళ్లిలా…. సంతలో నిత్యవాసర. వస్తువులు కోనుగోలు చేసిన ప్లాస్టిక్ కవర్లు వినియోగించే వాళ్లు…. ఇబ్బడిమబ్బుడిగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల. గూడేమంతా ప్లాస్టిక్ తో నిండిపోయింది… ప్లాస్టిక్ తో గూడేం డంప్ యార్డుగా మారింది..
.. ప్లాస్టిక్ గిరిజనులకు భూతంలా మారింది.. ఆకలితో అలమటిస్తున్నా ఆవులు,మేకలు ప్లాస్టిక్ ని తిన్నాయి…రోగాలబారిన పడ్డాయి..బారీగా ప్లాస్టిక్ కడుపులో చేరి ఆవులు, మేకలు బలయ్యాయి… కళ్లముందు పెంచుకున్నా పశువులు,మేకలు ప్రాణాలు కోల్పోవడంతో అదివాసీ బిడ్డలు తల్లడిల్లిపోయారు..
. కన్నబిడ్డలా బావించే మేకలు, ఆవులు ప్రాణాలు కోల్పోవడం పై అదివాసీలు అందోళనకు గురయ్యారు… ప్రాణం లాంటి పశువులు .. అదేవిధంగా తరుచుగా రోగాల బారిన పడటం అదివాసీలు తట్టుకోలేక పోయారు గిరిజనులు.. ఆ భూతం లాంటి ప్లాస్టిక్ ను పాతరేయాలని నిర్ణయించారు…అందులో బాగంగా గూడేంలో సర్పంచ్ కుమ్రం జుగదీరావు అధ్వర్యంలో గిరిజనులంతా సమావేమయ్యారు.. పశువులను మింగుతున్నా… ప్రజలకు హని చేస్తున్నా ప్లాస్టిక్ వాడవద్దని తీర్మానం చేశారు… ఈ తీర్మానికి గిరిజనులంతా మద్దతు పలికారు…ప్లాస్టిక్ పై సమరానికి సై అన్నారు… ప్లాస్టిక్ వాడమని గిరిజనుల ప్రమాణం చేశారు
ప్రమాణం చేయడమే కాదు…పాటిస్తున్నారు… ప్లాస్టిక్ దూరంగా ఉంటున్నారు.. సంతకు వెళ్లిలా సరుకులకోసం పాలిథీన్ కవర్లు వినియోగించడంలేదు.. బట్టల. సంచి లేదంటే.జనుముతో తయారు చేసినా సంచులు వాడుతున్నారు…కనీసం బోజనంలో ఇంతకుముందు విందులు జరిగితే పేపర్ ప్లేట్లు వాడేవారు..కాని ప్లాస్టిక్ రహిత గూడేం కోసం తీరు మార్చుకున్నారు.. ఒకప్పడు పేపర్ ప్లేట్లు వాడే అదివాసీలు.. ఇప్పుడు పేపర్ ప్లేట్లకు బదులుగా అడవిలో లబించే మోతుకు, టేకు ఆకులలో బోజనాలు చేస్తున్నారు అదివాసీలు..
.. అదేవిధంగా ఎవరైనా ప్లాస్టిక్ ఉద్యమాన్ని తూట్లు పోడువకుండా చర్యలు తీసుకుంటున్నారు .. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఐదు వందలు జరిమానా విదిస్తామని తీర్మానం చేశారు.. ఒకవేళ. తీర్మానం ఉల్లంఘిస్తే వారికి జరిమానావిదిస్తున్నారు..ఐదు వందల జరిమానా విదిస్తున్నారు.. ఈ జరిమానాను అదివాసీలు గ్రీన్ టాక్స్ భావిస్తున్నారు… ఈ. రూపంలో వచ్చిన వాటిని గ్రామాబివ్రుద్దికి వినియోగిస్తామంటున్నారు సర్పంచ్ జుగదీరావు… అదేవిధంగా ఎక్కడైనా ప్లాస్టిక్ మిగిలి ఉంటే వాటిని గుంతలలో పూడ్చిపెడుతున్నారు…ఈ విదంగా ప్లాస్టిక్ ను పాతిపెట్టడం వల్ల పశువుల. వాటిబారినపడవంటున్నారు…ఆకలైనా గడ్డి తింటాయి తప్ప… ప్లాస్టిక్ తినేవకాశం లేకుండా చేస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు… సామాజిక ఉద్యమం కోనసాగిస్తూ ప్లాస్టిక్ రహిత. గూడంగా అందరి మన్ననలు పోందడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
.