పెన్ గంగానదిలో చమురు తవ్వకాలను‌ మరిపిస్తున్నా ఇసక దోపిడి దందా

నది గర్బం నుండి ఇసకను తోడేస్తున్నా మాపియా

… సముద్రాన్ని మరిపించే లోతున్నా నది,…ఆ నది గర్బంలో కోట్ల విలువైనా అపారమైన ఇసకను నిల్వలు ఉన్నాయి..‌ఆ ఇసక. నిల్వల పై ఇసక మాపియా కన్ను పడింది… పాథళలోకంలో ఉన్నా ఇసకను పైపులాద్వారా తోడేస్తున్నారు… అక్రమంగా కోట్ల రుపాయల ఇసకను లూటీ చేస్తున్నారు.. పెన్ గంగా నదిలో చమురు తవ్వకాలను మరిపిస్తున్నా ఇసక దోపిడి దందా పై ప్రత్యేక కథనం

.. ఆదిలాబాద్ జిల్లా లో పెన్ గంగా నది ప్రహిస్తోంది… జైనథ్ ,బేల. మండలాల్లో ఈ నది ప్రవాహిస్తోంది..నదిలో గర్బంలో కోట్ల రుపాయల విలువ గల నిల్వలు ఉన్నాయి. ఈ ఇసకనే దోపిడిదార్లకు కాసుల వర్షం కురిపిస్తోంది

.ఇసక తవ్వకాలు చమురు నిక్షేపాలను తవ్వకాలను మరిపిస్తున్నాయి.. డోలారా ప్రాంతంలో పెన్ గంగా నది గర్బంలో తోడేయడానికి ఒక ప్రత్యేకంగా ఒక పడవను ఏర్పాటు చేస్తున్నారు… ఆ పడవలో నది గర్బం నుండి ఇసకను తోడటానికి యంత్రాలు ఉన్నాయి… యంత్రాలతో నది గర్బంలో ఇసకను తోడటానికి పైపులను ‌ ఏర్పాటు చేసుకున్నారు…‌ఏర్పాటు చేసుకున్నా పైపులతో ముప్పై మీటర్ల లోతు నుండి ఇసకను వెలికితీస్తున్నారు… ఆ ఇసకను పైపుల ద్వారా ఒక ప్రాంతానికి చేరుతుతోంది… బారీగా పైపులా ద్వారా వచ్చే ఇసకను తరలించడానికి రెండు బారీ ప్రోక్లైన్ యంత్రాలను ఏర్పాటు చేసుకు‌న్నారు..

… ఆ ప్రోక్లైన్ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా పైపులైన్ ద్వారా వచ్చిన ఇసకను ట్రాక్టర్లు , టిప్పర్లలో తరలిస్తున్నారు… వందల లారీలు, ట్రాక్టర్లలో ఇసకను మాపియా రాత్రి , పగలి తేడా లేకుండా అక్రమంగా తరలిస్తోంది మాపియా.. ప్రదానంగా ఆదిలాబాద్,బోథ్, ఇచ్చోడ,మహరాష్ట్ర లోని ఇతర ప్రాంతాలకు లారీలలో ట్రాక్టర్లలో ఇసకను తరలిస్తోంది మాపియా. మాపియా దోపిడీ దందాకు అడ్డులేదు..అదుపులేదు…కోట్లరుపాయల. ఇసకను తరలిస్తోంది.. అయితే ఇసక మాపియాకు స్థానిక విడీసీలు ముప్పై లక్షలకు అమ్మేశారు…ఆ విడీసీల అనుమతి తోనే క్వారీలు ఏర్పాటు చేసుకోని తవ్వకాలు చేస్తోంది మాపియా

. మరోకవైపు విచ్చలవిడిగా ఇసక తవ్వకాలు చేస్తున్నా సమీప ప్రాంతం లోనే అంతరాష్ట్ర. బ్రిడ్జి ఉంది…. ఇది దక్షిణ భారతదేశానికి , ఉత్తర బారత దేశానికి వారదిగా ఉంటుంది.. అలాంటి బ్రిడ్జీ అడ్డగోలుగా తవ్వకాలు చేయడంలో కూలిపోతుందని ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించేవాళ్లు భయడపతుతున్నారు..అయినప్పటికీ అదికారులు కన్నేత్తి చూడటం లేదు… పిర్యాదు చేసిన. పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు…బ్రిడ్జి‌ని రక్షించడానికైనా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.