మట్టికోసం పెన్ గంగా నదిని విద్వంసం చేస్తున్నా కంట్రాక్టర్
నదిలో దారులు నిర్మించి మట్టిని లూటీ చేస్తున్నా కంట్రాక్టర్

.. మట్టికోసం గుట్టలనుమింగేస్తున్నారు.. పెన్ గంగానదిని విద్వంసం చేస్తున్నారు…. పాథళలోకం కనిపించేలా తవ్వకాలు చేస్తున్నారు.. తవ్విన మట్టిని తరలించడానికి నదిలో రహదారులు నిర్మించారు.. నది ప్రవాహ దిశను మార్చారు… దర్జాగా మట్టి తరలిస్తూ నదిని లూటీ దందాసాగిస్తున్నారు… పిప్పల్ కోటి అనకట్ట. నిర్మాణం కోసం మట్టి దోపిడీ దందా సాగిస్తున్నా కాంట్రాక్టర్ .. ఆనకట్ట కోసం పెన్ గంగానది ని విద్వంసం చేస్తున్నా కంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి అదికారులు ఏందుకు జంకుతున్నా అదికారులు… మట్టికోసం పెన్ గంగా నదిని విద్వంసంపై ప్రత్యేక కథనం
ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్వహిస్తున్నారు…నిర్మాణంలో బాగంగా అనకట్ట నిర్మిస్తున్నారు… ఆనకట్టకు లక్షల. క్యూబిక్ మీటర్ల. మట్టి అవసరం.. ఈ మట్డి కోసం కాంట్రాక్టర్ బరితెగించారు… తెలంగాణ రాష్ట్రం లోఅత్యంత ముఖ్యమైన నదులలో పేన్ గంగా నది ఒకటి…. రైతులు ప్రాణంలా బావించే జీవనదిని …మట్టికోసం పెన్ గంగానది ప్రాణం తీస్తున్నారు రిజర్వాయర్ కంట్రాక్డర్…
. అనుమతులు లేవు… పర్మిషన్లు లేవు… కాని అడ్డగోలుగా తాంసి కే శివారు ప్రాంతంలో నదిలో తవ్వకాలు చేస్తున్నారు… నదికి ఇరువైపులా బారీ యంత్రాలతో మట్టిని తవ్వకాలు చేస్తున్నారు… తవ్విన మట్టిని వందల టిప్పర్లలో ఆనకట్టకు తరలిస్తున్నారు.. నదికి మట్టి ఇరువైపులా తవ్వకాలు చేయడమే కాదు… నది మద్యలో తవ్వకాలు చేస్తున్నారు.బారీ కందాలను నదిలో తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు… ఏకంగా ప్రవాహించే నదిలో రహదారులు మరిపించేలా దారులు నిర్మించారు…ఆ దారుల గుండా మట్టిని తరలిస్తూ దోపిడీ దందా సాగిస్తున్నారు కాంట్రాక్టర్..
..ఈ మట్టి దందా విచ్చలవిడిగా రాత్రి పగలు లేకుండా సాగుతోంది..ఆ తవ్వకాలతో నది రూపురేఖలు మారిపోయాయి.. .. ఒకప్పుడు పచ్చటి చెట్లు, మహవ్రుక్షాలతో నది ఇరువైపులా కనిపించేది… ఇప్పుడు ఎక్కడ చూసిన పాథళలోకం కనిపించేలా కయ్యలు కనిపిస్తున్నాయి.. ఈ కయ్యలు విద్వంసానికి గురై వ్రుక్షాలు కనిపిస్తున్నాయి.. ఇంతటి బారీ స్థాయిలో నది మద్యలో, ఇరవైపులా మట్టిని లూటీ చేస్తున్నా రేవిన్యూ, మైనింగ్ అదికారులు అటువైపు కన్నేత్తి చూడటం లేదు… ఇదే అదనుగా కాంట్రాక్టర్ మట్టి దోపిడీ దందా సాగిస్తున్నారు… మట్టి తవ్వకాలతో పెన్ గంగా నది రూపాన్నికోల్పోయింది.. ఈ రూపం కోల్పోయారు నది వర్షకాలంలో ప్రవాహ దిశను మార్చుకుంటుందని రైతులు అందోళన చెందుతున్నారు.. పిడికెడు మట్టి తీయడానికి అనుమతులు తీసుకోని… విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తుంటే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు
. మట్టి కోసంనదిని మింగిన. కాంట్రాక్టర్ అడవులను, చెరువులను, వదిలి పెట్టడం లేదు…ఆకాశం తాకే కోండలను తవ్వేస్తున్నారు.. గుట్టలను మాయం చేస్తున్నారు… పచ్చటి అడవులలోమట్టిని తరలిస్తూ మైదానాలను చేస్తున్నారు… ఎక్కడ స్థలం కనిపిస్తే చాలు..అక్కడ కాంట్రాక్టర్ తవ్వకాలు చేస్తున్నారు..లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తున్నారు..మర్కగూడ లో దట్టమైన అడవిలో తవ్వకాలు చేస్తున్నారు.. కోండను పూర్తిగా తవ్వేశారు… మట్టిని తరలిస్తున్నారు.. అదేవిధంగా అక్కడే చెరువు ఉంది. చెరువు ను వదిలి పెట్టడంలేదు…చెరువు సమీపంలో తవ్వకాలు చెస్తు మట్టిని తరలిస్తున్నారు… మట్టికోసం నది విద్యంసం చేస్తూ, అడవులను కనుమరుగు చెస్తున్నా అదికారులు అటు వైపు కన్నెత్తిచూడటం లేదు..పోని మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటే అదిలేదు.. అయినప్పటికీ నిబంధనలు అక్రమంచి తవ్వకాలు చేయడం పై కాంట్రాక్టర్ తీరు పై ప్రజలు మండిపడుతున్నారు..మట్టి కోసం నదిని నాశనం చేస్తున్నా వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
.