అదివాసీలకు అయిల్ ఇంజన్లే విద్యుత్ మోటర్లు

డిజీలు ఖర్చు బారంగా మారిందంటున్నా అదివాసీ రైతులు

ఆదిలాబాద్

అదివాసీలకు అయిల్ ఇంజన్లే…విద్యుత్ మోటర్లు…ఆ ఇంజన్లతో పంటపోలాలకు సాగునీరు అందిస్తున్నారు.. పంటలు పండిస్తున్నారు.‌. కాని పైసా లాభం లేదు… ఇంజన్ల ఇందనం కోసం డీజిల్ వినియోగిస్తున్నారు… డీజిల్ బారంగా‌ మారి రైతులు డీలా పడుతున్నారు.. అప్పులే మిగులుతున్నాయని రైతులు అందోళన చెందుతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీల సాగు సమరంపై ప్రత్యేక కథనం

 

. తెలంగాణ రాష్ట్రం లో అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం.. ఈ ప్రాంతం లో స్వాతంత్ర్య. రాకముందు ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో…. ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయి..గిరిజన బిడ్డలు ఎజన్సీ ప్రాంతంలో పంటలు పండించడానికి పడే పాట్లు అన్ని ఇన్ని కావు

 

.. ఈ ప్రాంతంలో పంటలకు సాగునీరు అందించడానికి ఉట్నూరు, కెరమెరి, లింగాపూర్, జైనూర్, తిర్యాని, ఇంద్రవెల్లి, సిర్పూర్ యు మండలాల్లో ప్రాజెక్టులు లేవు.. పోని బోర్లు వేసిపంటలు పండిద్దామంటే… త్రీ పేజ్ విద్యుత్ సరపరా లేదు‌‌…దాంతో గిరిజన రైతులు పంటలు పండించడానికి బావులు తవ్వుకుంటున్నారు… ఆ బావులకు సాగునీరు అందించడానికి విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసుకుందామంటే…‌త్రీపేజ్ కరెంట్ సరపరా లేదు.. దాంతో పంటపోలాలకు సాగునీరు అందించడాని బావులకు ఇంజన్లు బిగిస్తున్నారు

 

.. ఆ అయిల్ ఇంజన్లతో సాగునీరు అందిస్తున్నారు.. ఇంజన్లతో పంటపోలాలకు సాగునీరు అందించమంటే అసామాషీకాదు… అయిల్ ఇంజన్లకు డిజిల్ ఇందనంగా వాడుతుంటారు.. నాలుగు నుండి ఐదు గంటలు ఇంజన్ నడవాలంటే కనీసం ఐదునుండి ఆరు లీటర్లు డిజీల్ కావాలి…అంటే కనీసం రోజుకు డీజిల్ కోసం ఐదు వందల రుపాయలు బరిస్తున్నారు.. ఇలా సాగు చేయడానికి బారీగా పెట్టుబడి వ్యయం పెరుగుతుందని అదివాసీ రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు

 

 

.. ‌పైగా అయిల్ ఇంజన్లు తరుచుగా రిపేర్ కు గురువుతున్నాయి.. రిపేర్ ఖర్చులు రైతులకు బారంగా మారుతున్నాయి… అంతేకాదు అయిల్ ఇంజన్లు స్టార్ట్ చేయడం అంత సులువు కాదు.. హ్యండిల్ తో తిప్పి ఇంజన్ స్టార్ట్ చేయాలి…ఇలా ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి‌.‌ఇంజన్ వీల్ లో చిక్కుకోని కాళ్లు, చేతులు, విరిగి పోతున్నాయని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు గిరిజన రైతులు..

‌. ఇన్ని ప్రయాసలు పడి అయిల్ ఇంజన్లతో పంటలు పండిస్తే… చివరికి మిగిలేది… ఎం లేదని రైతు బాజీరావు వాపోతున్నారు… డిజిల్ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నాము..‌‌పంటలు అమ్మిన తర్వాత. బారీగా డిజీల్ అప్పులకే పోతుందని మరోకరైతు శ్యామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఎజెన్సి ప్రాంతంలో త్రీ పేజ్ విద్యత్ సరపరా మెరుగుపరచాలని‌..అదేవిధంగా ఈప్రాంతం గిరిజన రైతుల పంటపోలాలకు సాగునీరు అందించడానికి ప్రాజెక్డులు నిర్మించాలని గిరిజన రైతులు సర్కార్ ను కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.