మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల స్పందన కరువు!

ప్రజల లేక వేలవేలబోయిన. బైంసా కార్నర్ మీటింగ్

..పేరుకు  పాదయాత్ర…. కాని  అదిపత్య యాత్ర.. రేవంత్    పై  దండయాత్ర…. ఆ  యాత్రతోనే    టీపీసీసీ అదినేతకు దడపుట్టించాలనుకున్నారు….. ఆ. ఎత్తుగడతో రేవంత్    దీటుగా    పాదయాత్రను ప్రారంభించారు మహేశ్వర్  రెడ్డి… పోటీ యాత్రకు  కాంగ్రెస్   ఉద్దండులు తరలించారు…  కాని  ఉద్దండుల ఉపన్యాసాలు   వినడానికి   జనం కరువయ్యారు….. మహేశ్వర్  రెడ్డి   పాదయాత్రలకు   ప్రజలలేందుకు   రావడంలేదు.. అయన   పాదయాత్రలో  తప్పటడగులు  వేస్తున్నారా..‌మహేశ్వర్    రెడ్డి  పాదయాత్రకు  స్పందన. కరువు పై   ప్రత్యేక కథనం

      టీపీసీసీ   అధ్యక్షుడు  రేవంత్  పాదయాత్రకు పోటీ  పాదయాత్ర. మహేశ్వర్  రెడ్డి ప్రారంభమైంది  … ఇప్పటికే పాదయాత్ర లో     బాగంగా రాహుల్ గాందీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను  ప్రజల్లోకి  తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ అదినేత .. రాబోయే ఎన్నికలలో పార్టీకి పట్టం  కట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు రేవంత్ …రేవంత్  యాత్రకు  దీటుగా పోటీగా     కాంగ్రెస్  ఎఐసీసీ కార్యక్రమాల. అమలు కమీటీ  చైర్మెన్  మహేశ్వర్  రెడ్డి నిర్మల్ జిల్లా  బైంసాలో   పాదయాత్ర చేపట్టారు.  శివాజీ చౌక్ నుండి అంబేడ్కర్‌ విగ్రహంవరకు     మహేశ్వర. రెడ్డి  పాదయాత్ర నిర్వహించారు…   కుబీర్ చౌరస్తాలో  సభను  నిర్వహించారు

..  రేవంత్    యాత్రను   సవాలు  విసిరేవిదంగా     ఆ పాదయాత్ర కు దీటుగా  నిర్వహిస్తున్నా  పాదయాత్రను  ప్రారంభించడానికి  కాంగ్రెస్       సీనియర్ నాయకులు  ఉద్దండులు హజరయ్యారు..  రేవంత్     యాత్రవైపు   కన్నెత్తి చూడని  సీఎల్పీ భట్టివిక్రమార్క,ఉత్తమ కుమార్  రెడ్డి, దామోదరరాజనర్సింహ, ప్రేమ్  సాగర్ రావు. రేవంత్  వ్యతిరేక వర్గం  నాయకులంతా  మహేశ్వర్  రెడ్డి పాదయాత్ర మద్దతుగా తరలివచ్చారు… ఆనంతరం   నిర్వహించిన.  సభలో  పాల్గోన్నారు..

. రేవంత్  కు పోటీగా  మహేశ్వర్  రెడ్డి  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  పాదయాత్రకు ప్రజల స్పందన.  కరువైంది.. వేలాది మంది తరలి వస్తారని ‌మహేశ్వర్   రెడ్డి అంచనాలు వేసుకున్నారు… కాని సభలకు వందల మంది   తరలివచ్చారు.. వచ్చిన వారిలో  మహేశ్వర్    రెడ్డి సోంత నియోజకవర్గం  నిర్మల్ నుండీ వచ్చిన వాళ్లే  అదికంగా  ఉన్నారు…సభ నిర్వహించిన. ముథోల్    నియోజకవర్గం నుండి    జనాన్ని తరలించడంలో  మహేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు  అట్టర్ ప్లాప్ అయ్యారు

  సభలో      జనం లేక.    కాంగ్రస్ నాయకులకు     ఉత్సహం కరువైంది.. పాదయాత్ర చేపట్టిన. మహేశ్వర్  రెడ్డి ,ఎమ్మెల్సీ జీవన్  , ఉత్తమ్ కుమార్  రెడ్డి  ,దామోదర రాజనర్సింహ  ప్రసంగాన్ని నిమిషాల్లో   ముగించడంవిశేషం…సభలో  చివరిగా  మాట్లాడారు సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క,.. రాహుల్  గాందీ హథ్ సే హథ్   సందేశాన్ని  ప్రజలకు  తెలియజెప్పడమే    ఈ యాత్ర లక్ష్యమన్నారు…  తెలంగాణ సర్కారు  వైపల్యాలను  పాదయాత్రతో ప్రజల్లోకి  తీసుక వెళ్లుతున్నా మహేశ్వర్   రెడ్డిని  ఈ సందర్భంగా భట్టి అభినందించారు… అదేవిధంగా    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో   కాంగ్రెస్ హయంలో  చేపట్టిన పథకాలను   భట్టి వివరించారు… వీటితో పాటు  తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నా     సీఎం   , ఆయన కుటుంబ సభ్యులకు   వచ్చే   ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. కాని    ప్రజలనుండి స్పందనమైంది… కనీసం  చప్పట్లు కోట్టే వారు కరువు కావడంతొ   భట్టి కూడ ప్రసంగాన్ని ముగించారు… కేవలం నలబై  నిమిషాలలో     సభ ముగించారు…

. పోటీ  పాదయాత్ర జనం పోటేత్తురాని  బావిస్తే….  మహేశ్వర్  రెడ్డి   పాదయాత్ర కు జనం  స్పందన  కరువు   కావడం పై   ‌మహేశ్వర్  రెడ్డి   ఆందోళన చెందుతున్నారట… సీనియర్ కాంగ్రెస్ నాయకుల. ముందు  పరువు పోయిందని   మథన పడుతున్నారట..  రేవంత్   పాదయాత్ర కన్నా   … తన పాదయాత్రకు  ప్రజలు  బారీగా   అంచనాలు వేసుకున్నారట మహేశ్వర్  రెడ్డి.. కాని  రేవంత్ పాదయాత్రకు వస్తున్నా స్పందనకు  తన పాదయాత్రకు   స్పందన అణువంతా కూడ  లేదని   తెలిందట‌..నిర్మల్ లో  ‌రాహుల్ గాందీ పాదయాత్ర  విజయవంతం  చేశారు‌.‌ బారీ బహిరంగ సభలు  సక్కేస్   చేశారు . కాని  తన పాదయాత్ర కు  స్పందన లేకపోవడం    తట్టుకోలేకపోతున్నారట..  జనాన్ని  తరలించడంలో  విపలమైనా  అనుచరులపై అగ్రహం వ్యక్తంచేశారట మహేశ్వర్ రెడ్డి

.. అయితే   మహేశ్వర్  రెడ్డి పాదయాత్ర స్పందన కరువు కావడానికి అనేక కారణాలు ఉన్నాయట…. మహేశ్వర్  రెడ్డి  పాదయాత్ర. సోంత. నియోజకవర్గం కాకుండా   ముథోల్  నియోజకవర్గం లో   పాదయాత్ర చేపట్టారు…ఈ నియోజకవర్గం లో   డీసీసీ  అధ్యక్షుడు  రామరావు పటేల్  పార్టీకి రాజీనామా  చేసి బిజెపిలో చేరారు.. క్యాడర్   మొత్తం  ఆయనతో  పాటు వెళ్లింది… కాంగ్రెస్  జెండా  కట్టేవాళ్లు  లేనిచోట  మహేశ్వర్   రెడ్డి  పాదయాత్ర చేపట్టడం  మైనస్  గా  మారిందట…ఈ. నియోజకవర్గం లో వద్దని  సొంత నియోజకవర్గమైనా  నిర్మల్ లో    యాత్రను  చేపట్టాలని సన్నిహితులు,  సీనియర్లు     సూచించారట… కాని  మహేశ్వర్  రెడ్డి ఇవేవి పట్టించుకోలేదట…మహేశ్వర్  రెడ్డి అతి ఉత్సహం   పరువు తీసిందని   కార్యక్తలు అందోళన. చెందుతున్నారట..ఆరంభమే    అట్టర్ ప్లాప్ గా మారడం …ఈ ప్రబావం తర్వాత. రోజులలో నిర్వహించే   పాదయాత్ర పై పడకుండా చర్యలు  చేపట్టారట.. బారీగా జనాన్ని  తరలించాలని   అనుచరువద్దలకు మహేశ్వర్  రెడ్డి   అదేశాలు జారీచేశారట…‌మరి   రానున్నా   రోజులలో    పాదయాత్ర కు  ప్రజల. నుండి ఏలాంటి  స్పందన లబిస్తుందో  చూడాలి

Leave A Reply

Your email address will not be published.