నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దడపుట్టిస్తున్నా ప్రజా వ్యతిరేతకత?

సర్కార్ పై వ్యతిరేకత మాజీ మహేశ్వర్ రెడ్డికి అనుకూలంగా మారుతుందా

  పరుగులు పెట్టించిన ప్రగతిని..మున్సిపల్   ఉద్యోగాల అమ్మకాలతో మంత్రి పరువు తీశాయి..  ఓట్ల వర్షం కురిపించాల్సిన దళిత  బందు  మంత్రికి  తిరగబడింది…  ఆ పథకంపై    ఇంద్రకరణ్  రెడ్డి మాటలు  దళితులను తిరుగుబాటు చేయించింది…  పారీలో  సన్నిహితులు  దూరమయ్యారు…  అసంత్రుప్తి అగ్గిరాజేస్తోంది.. సర్కార్ పథకాలు  మంత్రిని మళ్లీగట్టేక్కిస్తాయా?.. హ్యట్రిక్  విజయా‌‌నికి దారులవుతాయా?..మళ్లీ  ముచ్చటగా మూడోసారి మహేశ్వర్  రెడ్డికి  ఓటమి తప్పదా?  సర్కార్ పై  వ్యతిరేకత ఉన్నా… మంత్రి పై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా  ప్రజల‌‌మద్దతు కూడగట్టడం ఆ కాంగ్రెస్ నాయకుడు  ఎందుకు విప‌లం అవుతున్నారా?ఈసారి  విజయంతీ   మంత్రిపై  మహేశ్వర్  రెడ్డి ప్రతికారం తీర్చుకుంటారా?  కారు కోటలో    కమలంపార్టీ  ఖాతా  తెరుస్తుందా?నిర్మల్ ‌‌  మారుతున్నా రాజకీయ సమీకరణాల పై‌ప్రత్యేక కథనం

. నిర్మల్   నియోజకవర్గం   రాజకీయ. చైతన్యం  ఉన్నా నియోజకవర్గం…నియోజకవర్గం లో  మామడ, లక్ష్మణ చాందా , సోన్,,నిర్మల్ పట్టణం,  నిర్మల్  రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి  మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయిఈ నియోజకవర్గం లో   నూతన ఓటరు జాబితా ప్రకారం   రెండు లక్షల ముప్పై  రెండు వేల.    నూట డెబ్బై  రెండు    ఉన్నాయి… ఇందులో మున్నూర్ కాపు,ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి,గంగపుత్రుల ఓట్లు  గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. .. ఈ నియోజకవర్గం   నుండి మంత్రి  ఇంద్రకరణ్  రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు..2014 అసెంబ్లీ   ఎన్నికలలో  మంత్రి   ఇంద్రకరణ్   రెడ్డి  బిఎస్పీ పార్టీ తరపున విజయం సాదించారు…ఆ తర్వాత మారిన‌  సమీకరణలతో‌ అప్పటి ‌టిఅర్ ఎస్ ఇప్పటి   బిఅర్ ఎస్ లో  చేరారు.. సీఎం కేసిఅర్ క్యాబినెట్ లో మంత్రయ్యారు ఇంద్రకరణ్  ..మళ్లీ  2018అసెంబ్లీ  ఎన్నికలలో ‌టిఅర్ ఎస్ అభ్యర్థి గా పోటీ చెశారు..ఈ ఎన్నికలలో  79,985ఓట్లతో 46%ఓట్లు సాదించి… కాంగ్రేస్ అభ్యర్థి ‌మహేశ్వర్ రెడ్డి పై   విజయం‌సాదించారు…9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం‌సాదించారు‌.‌  క్యాబినెట్ లో రెండోసారి మంత్రి అయ్యారు..

. . రెండోసారి   ‌మంత్రిగా  అబివ్రుద్దితో  నిర్మల్   నియోజకవర్గం  రూపు రేఖలు మార్చారు…‌ నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు..కాలనిలలో  రోడ్లు నిర్మించారు.. జిల్లా‌కేంద్రంలో    ఇంటిగ్రేటెడ్ ‌కలెక్టరెట్ నిర్మాణం,  ‌మెడికల్    కళశాల వంటివి  సాదించారు‌..అదేవిధంగా  మారుమూల ప్రాంతాలకు  రోడ్డు  రవాణా కల్పించారు. అదేవిధంగా  నిర్మల్   ఆసుపత్రి‌ని వంద. పడకల అసుపత్రిగా  మార్చారు..   ఈ  ప్రగతితో నిర్మల్   రూపురేఖలు మార్చారని పేరుంది..వీటితో పాటు  అడెల్లి ఆలయాన్ని  అభివృద్ధి చేస్తున్నారు..

.  అభివ్రుద్ది తో  నిర్మల్     దశ మారిన ప్రజల్లో  మంత్రి పై అసంతృప్తి    పెరిగింది… ప్రదానంగా  నిర్మల్    ‌మున్సిపల్  లో     నాలగో తరగతి  ఉద్యోగుల నియమాకం  వివాదస్పందంగామారింది.. ఉద్యోగాలన్ని   మున్సిపల్ చైర్మన్   ఈశ్వర్ బందువులకు, బిఅర్ ఎస్    కౌన్సిలర్లు  ప్రజాప్రతినిదుల. బందువులకు దక్కాయి.. అక్రమంగా   ఉద్యోగాల నియమాకాలపై   తీవ్రమైన దుమారం‌ రేగింది.. సంతలో సరుకులా   మున్సిపల్ ఉద్యోగాలు    అమ్ముకున్నారని     ప్రజలు   పార్టీలో అధ్వర్యంలో  ఉద్యమించారు..‌  ఈ అక్రమంగా  ఉద్యోగాల నియమాకాల పై   అర్డీఓ. చేత విచారణ జరిపించారు..‌ఆవిచారణలో   ఉద్యోగాలు  అక్రమంగా  నియమాకాలు చేశారని     తెలింది…‌ ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఒ సిపార్స్   చేశారు..మంత్రి కూడ. రద్దు చేస్తామనిప్రకటించారు‌..  ఇది మంత్రికి మచ్చగా మారింది.. అదేవిధంగా  ఇంటిగ్రేటెడ్  కలెక్టరెట్   నిర్మాణం  వివాదంగా‌ మారుతోంది…చెరువులో ఎప్ టి  ఎల్    లేవల్   నిర్మాణం   ఒక వివాదమైతే…‌ దీనికి తోడు   మంత్రి,  బందువులకు  భూములు ఉన్నచోట.  కలెక్టరెట్  నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు  అరోపిస్తున్నాయి..ఉద్యోగాల. మచ్చ తోలగక ముందే పట్టణంలో  మాస్టర్ ప్లాన్  మంత్రికి దడపుట్టిస్తోంది.. తమ భూములు కోల్లగోట్టేందుకు  మాస్టర్  ప్లాన్ ముసాయిదా రూపోందించారని   రైతులు అందోళన కోనసాగిస్తున్నారు..భూములకు నష్టం  కల్గించమని మంత్రి బరోసానిస్తున్నారైతులు నమ్మడంలేదట…ఇది  ఎన్నికల పై ప్రబావం చూపేవకాశం ఉంది

వీటితోపాటు  డీ1 పట్టాలు     మంత్రి    బందువులు అక్రమంగా పోందారని   కాంగ్రెస్, బిజెపిలు  ప్రజల్లో     ప్రచారం చేస్తున్నాయి..ఇదంతా  ఒకత్తేతే  దళితుల. సంక్షేమం  అమలు చేస్తున్నా పథకం…ఈ దళితబందు పథకం   మంత్రికి అడ్డంగా తిరిగింది.. నర్సాపూర్ జిలో    దళిత బందు గురించి మంత్రిని ‌ప్రశ్నించిన మహిళ పై  కేసు నమోదైంది…    అది దళిత వర్గాల పై వ్యతిరేకతను పెంచింది.‌‌.. నియోజకవర్గం లో సాగునీరు అందించే  ప్రాణహిత. చేవేళ్ల  27 ప్యాకేజీ   పనులు అంగులం కదలడం లేదు..అబివ్రుద్ది పనులు  పురోగతి లేకున్నా పార్టీలో   అసంతృప్తి మంత్రిగా తలనోప్పిగా మారింది‌.గత అసెంబ్లీ ఎన్నికలలో   టిఅర్ ఎస్    రాష్ట్ర కార్యదర్శి  మాజీ ఆదిలాబాద్  జిల్లా పరిషత్ చైర్మన్  శోభసత్యనారయణ భర్త సత్యనారాయణ, సారంగపూర్  జడ్పీటీసీ, మాజీ  ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్   రెడ్డి,  బిఅర్ ఎస్  కీలక నాయకుడు శ్రీహరి మంత్రి   గెలుపులో కీలకంగా వ్యవహరించారు…కాని    వీళ్లంతా  ఇప్పుడు మంత్రికి దూరంగా   ఉంటున్నారు..  అసంత్రుప్తితో  రగిలిపోతున్నారు.. మంత్రి గెలుపు కోసం పనివేసిన.  పట్టించుకోవడంలేదని  సన్నిహితుల. వద్ద. అందోళన వ్యక్తం  చేస్తున్నారు.

మంత్రి పై   ప్రజల్లో   వ్యతిరేకత,  అవినీతి  ఆరోపణలను   తమకు అనుకూలంగా మలుచుకోవడానికి   కాంగ్రెస్  ,బిజెపి  ఎత్తుగడలు  వేస్తున్నాయి..  రెండుసార్లు    అత్యల్ప ఓట్లతో  ఓటమిపాలైనా   ఈసారి ఆరునూరైనా  విజయం  సాధించాలని మాజీ   ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి   వ్యూహలు రచిస్తున్నారు..‌ప్రజల్లోకి  వెళ్లుతున్నారు ..మంత్రి వ్యతిరేకతను   తనకు  అనుకూలంగామార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఎన్నికలలో ప్రజల మద్దతు  ఇవ్వాలని కోరుతున్నారు… అదేవిధంగా  అవినీతి మంత్రి ని  ఓడించాలని   ప్రజలను కోరుతున్నారు… ఈసందర్బంగా   ఎలేటి మహేశ్వర్   ఎన్నికలలో  గెలుపు ఓటములను ప్రభావితం చేసే  బిసీ, ఎస్సీ,బీసీ , మద్దతు కూడగడుతున్నారు… ఎలేటికి  ప్రజల్లో మద్దతు లబిస్తున్నా…. ఎన్నికల  వరకు  మద్దతు   ఉపయోగించుకోవడం లేదని పేరుంది.‌  ఈసారి  చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన. భావిస్తున్నారు… అయితే మహేశ్వర్  రెడ్డి   నియోజకవర్గం లో   కార్యకర్తలకు, ప్రజలకు  అందుబాటులో ఉండటంలేదని ప్రచారం ఉంది… చుట్టం చూపులా  హైదారాబాద్ నుండి  వచ్చి పోతున్నారని బావన ఉంది…ఈ బావన తోలగించుకోకుంటే   ప్రతికూలంగా    మారుతుందని  కార్యకర్తల్లో ఉంది….అదేవిధంగా  సర్కార్ వైపల్యాల పై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని  సోంత పార్టీలో ఉంది..‌మంత్రి పై  వ్యతిరేకత ఉన్నా    అనుకూలంగా మలుచుకోకపోతే… గత. రెండు ఎన్నికల పలితాలే పునారవ్రుతం అయ్యేవకాశం  ఉంది… కాని ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా  మంత్రి పై   ప్రతీకారం   తీర్చుకోవాలని  బావిస్తున్నారు.. ఎన్నికలలో  గెలిచి  తీరాలనే కసితో    ప్రజల్లోకి వెళ్లుతున్నారు…. కచ్చితంగా గెలుస్తామనే  దీమాను వ్యక్తం చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి..మరోకవైపు  గతపార్లమేంట్  ఎన్నికలలో    బిజెపి అనూహ్యమైన. ఓట్లు లబించాయి..‌ ఆ. ఊపుతో బిజెపి నిర్మల్    కోట పై జెండా ఎగురవేయాలని  తహతహలాడుతోంది… మాజీ మున్సిపల్  చైర్మన్  అప్పాలగణేష్ ,డాక్టర్  మల్లికార్జున్    రెడ్డి  ఎన్నికల బరిలో  దిగడానికి  సిద్దమవుతున్నారు. బిజెపికి  యువత, వివిద వర్గాల మద్దతు లబిస్తోందని … ఆ మద్దుతుతో  టిఅర్ ఎస్ , కాంగ్రెస్  చిత్తుచేసి విజయం సాదిస్తామనే దీమాను వ్యక్తం చేస్తోంది కమలం  పార్టీ..‌  అయితే  కాంగ్రెస్, బిజెపి,  ఎన్నిఎత్తగడలు వేసినా.. సంక్షేమ. పథకాలు   తమను  గెలిపిస్తాయని బావిస్తున్నారు మంత్రి…మరిఈ మూడు పార్టీలలో ప్రజలు ఏవరిని అదరిస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.