ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీల కుంభమేళా

జాతరకు బారీగా తరలివస్తున్నా అదివాసీలు

అది సర్పలోకం స్వర్గం… ఆ పవిత్రమైన. లోకానికి నాగోబా దేవుడు దివి నుండి భువికి దిగివచ్చే దివ్యక్షేత్రం..ఆ దివ్యక్షేత్రం లో పూజిస్తేచాలు… పుడమి బిడ్డల. దేవుడు కళ్ల‌ముందు ప్రత్యక్షమవుతున్నారు శేషనారయణుడు..పవిత్రమైన గోదావరి జలంతో అభిషేకం చేస్తే ఆశీస్సులు లబిస్తాయి..మహిమ గల ఇలవేల్పు నాగోబా దేవుడు.. అదివాసీల. ఇలవేల్పు నాగొబా దేవుని పై జాతర పై ప్రత్యేక కథనం

 

.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కెస్లాపూర్‌ గ్రామం‌ అదివాసీల గూడేం‌…‌అదివాసీ బిడ్డల.పవిత్రమైన. దేవుడు నాగోబా కోలువైనా ప్రాంతం… ఈ. నాగదేవతకు పుష్యమాస్యను పవిత్రమైన మాసంగా భావిస్తారు అదివాసీలు. . ఈ పవిత్రమైన. మాసంలో పురివిప్పి నాట్యమాడే నాగేంద్రుడు దివిలోని స్వర్గంనుండి భువికి దిగివస్తారని మేస్రం వంశస్తుల విశ్వాసం…అందుకే పవిత్రమైన. మాసంలో అదివాసీలు తమ ఇలవేల్పు ప్రార్థిస్తూ జాతర నిర్వహిస్తారు..

. అయితే తమ ఆరాద్య దైవమైనా నాగదేవత కోలుస్తూ అచారాలు సంప్రదాయాలు పాటిస్తారు.. పుస్యమాస్య ముందు నెల వంక కనిపించిన. తర్వాత అదివాసీలు పవిత్ర గోదావరి జలంకోసం కెస్లాపూర్‌ నుండి జన్నారం మండలం హస్తిమడుగులోని పవిత్ర గోదావరి జలం కోసం‌పాదయాత్రగా వెళ్లుతారు.. నూట.ఎనబై కిలో‌‌మీటర్ల. దూరం కాలినడకన. వెళ్లి పవిత్రమైన జలం తీసుకవస్తారు … ఇంతటి అధునిక యుగంలో సైతం నూట ఎనబై కిలోమీటర్లు నడిచి గోదావరి జలాన్ని తీసుకవస్తుండటం విశేషం.. తెచ్చిన పవిత్ర గోదావరి జలం ఉన్న కలశాన్ని మర్రి చెట్టుకు. కడుతారు… పుష్యమాస్య రోజు మర్రి చెట్టు వద్ద గోదావరి జలానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. పూజాలనంతరం మర్రి చెట్టునుండి నాగోబా ఆలయానికి చెరుకుంటారు…పుష్యమాస్య రోజు ఆర్థరాత్రిపూట పవిత్ర గోదావరి జలంతో మహబిషేకం నిర్వహిస్తారు.. ఈనెల ఇరవై ఒకటిన సంప్రదాయ వాయిద్యాలతో నాగోబాకు దేవతకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు… అనంతరం శేషనారయణునికి గోదావరి జలాబిషేకంతో చేస్తారు‌‌‌.. ఈ మహబిషేకాన్ని మెచ్చి నాగోబా దేవుడు వచ్చి ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని అదివాసీల నమ్మకం.. దాంతో మేస్రం వంశస్తుల. జాతర ప్రారంభం అవుతుందని అదివాసీలు అంటున్నారు‌. నాగోబా దేవున్ని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలు లబిస్తాయని గిరిజనుల నమ్మకం

.‌నాగోబా జాతరపై పురాణ ఇతిహసం ఉంది… మేస్రం వంశస్తులకు చెందిన నాగమోతి రాణి ఉంది… నాగమోతి రాణికి నాగేంద్రుడు దేవుడు కలలో‌ కనిపించి.. నీ కడుపున జన్మిస్తానని చెప్పాడట.. చెప్పినట్లుగానే నాగేంద్రుడు నాగమోతి రాణికి కడుపున జన్మించాడు.. నాగమోతి రాణి కడుపున జన్మించిన నాగేంధ్రునికి, నాగమోతి రాణి తమ్ముడు కూతురు గౌరి దేవితో వివాహం జరిపించింది.. అత్త అజ్న మేరకు వివాహనంతరం గౌరి దేవి,నాగేంద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరి స్నానానికి వెళ్లింది..‌ గౌరి దేవి గోదావరి లో స్నానం అచరించగానే నాగేంద్రుడు మనిషిగా మారడట… మనిషిగా మారిన. గౌరి దేవిని ఒక కోరికను కోరుకోవాలని కోరాడట… అదివాసీ సంప్రదాయాలు,అచారాలు కావాలో…. కీర్తి ప్రతిష్టలు కావాలో కోరుకోమ్మని నాగేంద్రుడు భార్య గౌరిదేవిని కోరారట….. కాని భార్య కీర్తిప్రతిష్టలు కోరుకుందట.. నాగేంద్రుడుని కోపం వచ్చి అక్కడి నుండి అద్రుశ్యమైడయ్యాట..‌ చివరికి నాగేంద్రున్ని గౌరిదేవి వేతికినా పలితం లేకుండా పోయిందట‌. దాంతో గౌరి సతి గుండం లో దూకి అద్రుశ్యమైందట…అయితే కోన్ని రోజుల తర్వాత గోదావరిలో స్నానానికి వెళ్లిన‌ మేస్రం వంశీయులకు నాగేంద్రుడు ప్రత్యక్షమయ్యాడట.. అంతటి పవిత్రమైన జన్నారంలోని గోదావరి జలంతో అభిషేకం చేస్తే నాగోబా దర్శనమిస్తాడని అదివాసీల. నమ్మకం… అదే అనవాయితీని ప్రతి ఏటా కోనసాగిస్తున్నారు.. ఇప్పటికి గోదావరి జలంతో మహబిషేకం చేస్తూ అచారాన్ని పాటిస్తున్నారు

.నాగోబా జాతర ప్రపంచంలోనే విశిష్టమైన జాతర…‌‌ఈ జాతర మానవ సంబందాలను పెంపోందిస్తొంది.. అనురాగాలను, అప్యాయతలు పంచుతున్నది….అందులో బాగంగా బెటింగ్ నిర్వహిస్తారు‌‌‌.. కోత్తగా పెళ్లైనా . అడపడుచులను దేవునికి పరిచయం చేస్తారు.. అదేవిధంగా మేస్రం పేద్దలకు పరిచయం చేసి …వారి ఆశీర్వాదం తీసుకుంటారు..దీనిని బేటి కోరియాల్ గా పిలుస్తారు.. ఇలా పరిచయాలు చేసుకోవడం బందాలు బలపడుతాయని అదివాసీల విశ్వాసం… ఒకవేళ బేటింగ్ హజరుకాకపోతే ఎన్నాళ్లైనా నాగోబా దేవుని దర్శించుకోవడానికి అనుమతి లబించదు…దాంతో పెళ్లైనా ప్రతి అడపడుచు బెటింగ్ హజరుకావడం ఆనవాయితీ గా వస్తోంది.. బేటింగ్ బందాలు , అనుబందాలు, పెంచడంలో దోహదపడుతుందంటున్నారు మేస్రం వంశస్థులు

 

 

.‌నాగోబా జాతర సమస్యలను పరిష్కరించే వేదిక… గిరిజన బిడ్డల కన్నీళ్లను తుడిచే వేదికగా ప్రజలు బావిస్తారు .. అదివాసీలు. అమాయకులు.. సర్కార్ సంక్షేమ పథకాలు తెలియవు.. పోడుసాగు చేస్తూ పోట్ట నింపుకుంటున్నారు.. అలాంటి అదివాసీ బిడ్డలకు ఎన్నొ సమస్యలు ఉంటాయి.. కాని వాటిని అదికారుల ద్రుష్టికి తీసుకవెళ్లడానికి సరియైన వసతులు లేవు….ఇలాంటి అదివాసీలు సమస్యల పరిష్కారం కోసం నిజాం కాలంలో హెమండ్ డార్ప్ ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టారు… జాతర. కోసం వివిద ప్రాంతాల నుండి వచ్చిన వారినుండి గిరిజన దర్బార్ లో అర్జీలు స్వీకరిస్తారు..‌వాటిని అక్కడే పరిష్కరిస్తారు‌. అయితే ఇప్పుడు కలెక్టర్ అద్యక్షతన నిర్వహిస్తున్నారు. మంత్రులు ,సర్కారు దిగి వచ్చి సమస్యలను పరిష్కరించే వేదిక. దర్బార్ ..అదే అనవాయితీ ఇప్పటికే కొనసాగుతుందని పీఠాదిపతి వెంకట్ రావు అంటున్నారుఅసి

Leave A Reply

Your email address will not be published.