నరికిన అడవులకు పోడు పట్టాలు ఇవ్వాలంటున్నా మాజీ కలప స్మగ్లర్లు

దరఖాస్తు చేసుకున్నా పట్టాలు ఇవ్వడం లేదంటున్నా ముల్తానీ ముస్లింలు

వాళ్లు మాజీ కలప స్మగ్లర్లు… కలప కోసం అడవులను నరికారు… నరికిన అటవీ భూముల్లో సాగు చేస్తున్నారు.. సాగు చేసుకుంటున్నా భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.. స్మగ్లింగ్ మానేశాము సర్థార్లుగా బ్రతుకుతున్నాము ..పోడు పట్టాలు ఇవ్వాలని సర్కార్ కోరుతున్నారు మాజీ ముల్తానీ కలప స్మగ్లర్లు…. పోడు పట్టాలు కావాలంటున్నా ఒకప్పటి ముల్తానీ స్మగ్లర్ల. పై ప్రత్యేక కథనం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ‌ మండలం గుండాల, కేశవపట్నం, ఎల్లమ్మ గూడ గ్రామాల్లో‌‌‌‌ ముల్తానీ తేగకు చెందిన ముస్లింలు నివశిస్తున్నారు … వీరంతా ఒకప్పుడు పేరు మోసిన. కలప స్మగ్లర్లు… అడవుల్లో కలపను ‌ నరకడము…నరికిన కలపను ‌‌ స్మగ్లింగ్ చేయడం‌‌వారి వ్రుత్తి.. అదే జీవనదారంగా బ్రతికినవాళ్లు.. అయితే గత. కోన్ని‌ఏళ్లుగా ‌ సర్కార్ కలప స్మగ్లింగ్ ‌ను అరికట్టడానికి చర్యలు చెపట్టింది…పూచిక. పుల్లను బయటకు తరలించకుండా నిఘాను పెంచింది…‌దాంతో ‌కలప స్మగ్లింగ్ కు అడ్డుకట్టపడింది.

దాంతో కోందరు స్మగ్లింగ్ మానేశారు..‌నరికిన‌భూములను చదును‌చేశారు… ఆ భూముల్లో‌సాగు చేస్తున్నారు.. పత్తి , సోయం, కందులు,వంటి పంటలు పండిస్తున్నారు ముల్తానీలు…కాని అటవీ ‌భూములు కావడంతో‌ వీరికి పట్టాలు లేవు…పట్టాలు లేకపోవడం ముల్తానీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు…బ్యాంకు రుణం లభించడం లేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.. అదేవిధంగా రైతు బంధు రావడం లేదంటున్నారు…ఇక పంట పండించి మార్కేట్లో అమ్ముకొవాలంటే పట్టాపాస్ పుస్తకం అడుగుతున్నారు.‌పట్టాలు లేక ఇతరుల. పట్టాపాస్ పుస్తకాల పై పంటలను అమ్ముకుంటున్నారు‌ముల్తానీలు

ఈ భూములకు పోడు ‌పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు…గత ఏడాది నవంబర్ మాసంలో పోడు పట్టాల కోసం‌ధరఖాస్తు చేసుకున్నారు… ధరఖాస్తు చేసుకున్నా భూములలో‌ అటవీ‌అదికారులు సర్వేలు చేశారు…‌ ఏవరు ఎంత. సాగు చేస్తున్నారో తెలుసుకోవడానికి కోలతలు తీసుకున్నారు. కాని పట్టాలు రావడంలేదంటున్నారు. పోడు పట్టాల కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసిన రాలేద‌ని అందోళన వ్యక్తం చేస్తున్నారు.

.గుండాల గ్రామాని చెందిన షేక్ అప్సర్ పదిఏకరాలలో‌‌ పోడు సాగు చేసుకుంటున్నారు…అందులో పంటలు పండించి కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ఒకప్పుడు అడవిన. నరికిన. రెండు కేసులు ఉండేవి… ఆ కేసు నుండి బయట పడ్డారు.. స్మగ్లింగ్ కు దూరంగా ఉంటున్నారు.. సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు షేక్ అప్సర్…‌ అదేవిధంగా షేక్ అదామ్ కూడ. పది ఏకరాలలో పోడుసాగు చేస్తున్నారు… ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా పట్టాలు లేవని అదామ్ ‌అన్నారు..సర్కార్ స్పందించి తమకు పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ముల్తానీలు సర్కారు ను కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.