తల్లులు జైల్లో.. ఇండ్లలో పిల్లలు..

ఉద్యోగాల ఉద్యమంలో జైలు పాలైనా తల్లులు

 

. ఆ. ఉద్యోగాల. ఉద్యమం… తల్లులను కారాగారం పాలు చేసింది‌.. పిల్లలను దూరం చేసింది…భార్య ,భర్తల మద్య. ఏడబాటు పెంచింది.. … ఆకలికి అన్నం పెట్టే అమ్మలేక పిల్లలు తల్లడిల్లుతున్నారు..దుంఖంతో విలపిస్తున్నారు…. జైలు పాలైనా తల్లుల కోసం దిగులుతో పస్తులుంటున్నారు… జైల్లో ఉన్నా తల్లుల కోసం పిల్లల ఆరాటం పై  ప్రత్యేక కథనం

 

… కుమ్రంబీమ్ జిల్లాలో సింగరేణి ఓపేన్ కాస్ట్ గనుల్లో ఉద్యోగాల కోసం ఉద్యమం ఉద్రుతమైంది… ఖైరిగూడ ప్రాంతంలో లో ఒపెన్ కాస్టు గనులు ఉన్నాయి.. ఈ గనుల్లో బారీగా బోగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి.

. అయితే ఈ ఒపెన్ కాస్టు గనుల్లో ఉద్యోగాలు స్థానికులకు అవకాశం ఇవ్వాలని ఉల్లిపిట్ట, దాం పూర్, ,గూడేన్ ఘాట్,ఇప్పన్ నావ్ గావ్ చిర్రకుంట గ్రామ ప్రజలు తమకు ఒపెన్ కాస్టులో గనుల్లో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేస్తున్నారు..ఓపేన్ కాస్టు పనులు జరుగుతున్నా ప్రాంతానికి వెళ్లి స్థానికులు అందోళన చెపట్టారు.. ఈ సందర్భంగా స్థానికులకు, కంపేని ప్రతినిదుల ‌మద్య గోడవ జరిగింది.

. ఈ గోడవ పై కంపేని ప్రతినిదులు పోలీసులకు పిర్యాదు చేశారు..ఆ పిర్యాదుతో ముప్పై ఎనిమిది మంది పై పోలీసులు నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేశారు..‌ఇందులో పద్నాలుగు మంది మహిళలు ఉన్నారు..‌ ఈ కేసుల్లో అరెస్టు చేసి మహిళలను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.. అయితే అరెస్టైనా తల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది…వారిలో కోందరికి చంటి పిల్లులున్నా వారు ఉన్నారు.. తల్లులు జైలుపాలు కావడంతో ఆ పిల్లలు పడేవస్థలు అన్ని ఇన్ని కావు.. అమ్మను విడిచి క్షణం ఉండలేని …పిల్లలు అమ్మలేక వెక్కివెక్కి ఎడుస్తున్నారు.. పాలులేక. ఆకలితో‌ అలమటిస్తున్నారు‌.పస్తులు ఉంటున్నారు.. ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన. స్వరూప. జైలుపాలైంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు..స్వరూప కోడుకు అమ్మ కోసం ఎడుస్తున్నారని తండ్రి శ్రీనివాస్ అవేదన వ్యక్తం చేస్తున్నారు ‌. స్వరూప లేక. కోడుకు బుక్కేడు మేతుకులు తినడం లేదని వాపోయారు..బుజ్జగించి అన్నం తినపిస్తున్నాని వాపోయారు.. తమ భూమి సైతం ఒపేన్ కాస్టు లో కోల్పోయిన పరిహరం దక్కలేదన్నారు. ఇస్తామన్నా ఉద్యోగం దక్కలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు

మరోక మహిళ పార్వతీ కూడ. ఉద్యోగం కోసం జరిగిన ఉద్యమం పాల్గొన్నారు.. పోలీసులు కేసులు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు…పార్వతి కి ఒకమూగ కూతురుఉంది…అ కూతురు కూడ. తల్లితో కలిసి ఉద్యమంలో పాల్గోన్నది..తల్లి అరెస్టు కావడంతో అక్కడే చెట్లపోదల్లో దాక్కున్నది…ఒకరోజు తర్వాత. ఇంటికి చెరింది‌.‌ తల్లి జైలుకు వెళ్లిననాటి నుండి అన్నం తినడం లేదని తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు.. తన భార్య ఏలాంటి తప్పు చేయలేదని … కాని అరెస్టు చేసి జైలుకు తరలించారని అందోళన వ్యక్తం చేశారు.. పిల్లల మొహం చూసి బార్యను చూసి విడిపించాలని సింగరేణి అదికారులను కోరుతున్నారు..

 

. తల్లి యాటకార్ల లక్ష్మి జైలుకు వెళ్లడంతో కోడుకు సాయి కిరణ్ విచిత్రమైనా పరిస్థితులు ఏదుర్కోంటున్నారు.. సాయి కిరణ్ కు పెళ్లి నిశ్చయమైంది. ముహుర్తం కూడ ఖరారైంది. కాని తల్లి జైలు కు వెళ్లింది… ఇప్పుడు ఎం చేయాలో తెలియక అందోళన చెందుతున్నారు సాయి.. తండ్రి అనారోగ్యంతో చనిపోయారు.. కనీసం తల్లి పెళ్లి పెద్దగా ఉంటుందని కోడుకు పెట్టుకున్నా ఆశలు అడియాశలుగా ‌మారుతున్నాయి‌.తల్లి జైలుకు వెళ్లడంతో పెళ్లి జరుగుతుందా లేదా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయని వాపోయారు సాయికిరణ్..‌ఈ ఉద్యమంలో అమ్మ. ఏవరి పై దాడి చేయలేదన్నారు..‌కానిఅరెస్ట్ చేశారు..జైలుకు తరలించారని సాయికిరణ్ అందోళన వ్యక్తం చేశారు..అమ్మను విడిపించాలని సాయికిరణ్ దీనంగా వేడుకుంటున్నారు

‌. అయితే పోలీసులు ఉద్యోగాల కోసం విద్వంసంస్రుష్టించారని అసిపాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు…ఏవరి పై అక్రమంగా కేసులు నమోదు చేయలేదన్నారు.. ప్రభుత్వ అస్తులను ద్వంసం చేసిందుకు పీడీపీపీ నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేశామన్నారు.. ఇందులో మహిళలు కూడ ఉన్నారని ఆయన అన్నారు. ఇందులో కుట్రలు , అక్రమ కేసులు లేవని స్పష్టం చేశారు

 

Leave A Reply

Your email address will not be published.