కల్లు కోసం గిరక తాటి చెట్టు ఎక్కిన‌మంత్రి

చెట్టుక్రింద కూర్చోని కల్లు త్రాగిన. మంత్రి

ఇటీవల ఎక్కడికి వెళ్లిన కల్లు రుచి చూసే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏకంగా గిరకతాటి చెట్టే ఎక్కారు. నిచ్చెన సహాయంతో చెట్టు ఎక్కి కల్లు పారాడం చూశారు. మూడేళ్ళ క్రితం తాను పంపిణీ చేసిన గిరకతాళ్ళు సురాపానకం ఇవ్వడం చూసి ఆనందం వ్యక్తం చేశారు. కల్లు దింపి చెట్టు కింద కూర్చుని కల్లు సేవించారు. ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహించే జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ళ క్రితం పంపిణీ చేసిన గిరకతాళ్ళు ఏపుగా పెరిగి కల్లు పారడంతో ఆనందం వ్యక్తం చేశారు. కళ్ళు రుచి మరిగిన మంత్రి ఎర్రబెల్లి తాటి చెట్టు ఎక్కడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కళ్ళు సేవించడమే కాదు చెట్టెక్కి మంత్రి తన ప్రత్యేకతను చాటుకున్నారని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.