ముగిసిన వనదేవతల మినిజాతర

అమ్మవార్లను దర్శించుకున్నా లక్షలాది భక్తులు

 

ములుగు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక.. వీరోచిత పోరాటానికి చిహ్నం.. గిరిజన స్వయం పాలనకు దిక్సూచి.. ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీక అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర వైభవంగా ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన మినీ జాతర ముగిసినప్పటికీ రేపు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నాలుగు రోజులపాటు నాలుగు లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు అమ్మవారులను దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

వనదేవతల జనజాతర మేడారం సమ్మక్క సారలమ్మ మినీజాతర ముగిసింది. రెండేళ్ళకోసారి మాఘమాస శుద్ద పౌర్ణమి రోజు నుంచి నాలుగు రోజులపాటు కుంభమేళాను తలపించేలా మేడారం మహాజాతర నిర్వహిస్తారు.‌ మద్య ఏడాది శుద్ది పేరుతో మండెమెలిగే పేరుతో మినీజాతర జరుపుతారు. ఈనెల ఒకటి నుంచి ఈరోజు వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన మినీజాతరకు భారీగానే భక్తులు తరలివచ్చారు. తొలిరోజు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎస్ పి గౌస్ ఆలం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవారులను దర్శించుకున్నారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మ లను భక్తితో కొలిచి పులకించిపోయారు.
.

కాకతీయులపై పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మలు… ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే ఇలవేల్పులు. ఇప్పుడు అన్ని వర్గాలకు ఆరాధ్యదైవాలుగా మారి వనదేవతలుగా పూజలందుకుంటున్నారు. మినీ జాతర సందర్భంగా ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టడంతో సాఫీగా జాతర జరిగిందంటున్నారు అధికారులు, ఆదివారం భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ ఈవో రాజేందర్. ఆదివారం బుధవారం శుక్రవారం భక్తుల రద్దీ ఉంటుందని ఇకనుంచి ప్రతిరోజు భక్తులు అమ్మవారులనుని దర్శించుకునేలా ఆలయం తెరిచే ఉంటుందని తెలిపారు.

అధికారికంగా మినీజాతరను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించినప్పటికీ గత నెల రోజులుగా మేడారంకు  భక్తుల రద్దీ కోనసాగుతుంది. చిన్న పెద్ద తేడ లేకుండా భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటున్నారు. ఎత్తుబంగారం పసుపుకుంకుమల తో సారేచీర సమర్పించి ఎదురుకోళ్ళతో మొక్కలు చెల్లించారు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలను తమ ఇలవేల్పుగా కొలుస్తున్నామని భక్తులు అంటున్నారు.

రెండేళ్లకోసారి నిర్వహించే మహా జాతర వచ్చే సంవత్సరం నిర్వహిస్తుండడంతో ఇప్పటినుంచి అందుకు తగిన ఏర్పాటు చేసే పనిలో అధికార యంత్రాంగం తోపాటు ఆలయ పూజారులు నిమగ్నమయ్యారు. ఏమీ దొరకని చోట మేడారం, జాతరతో అన్నింటికీ కేంద్రంగా మారుతుంది..అలాంటి జాతరకు  విస్త్రుతమైనా ఏర్పాట్లు  చేస్తున్నారు అదికారులు

.

Leave A Reply

Your email address will not be published.