మేడికో ప్రీతి మ్రుతి పై వీడని మిస్టరీ
రెండునెలలు గడుస్తున్నా అందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

వరంగల్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి మిస్టరీగానే మిగిలింది. రెండు నెలలు కావస్తున్న ప్రీతి డెత్ ఆత్మహత్యనా,. హత్యనా తేలక అనుమానస్పద మృతిగానే పోలీసులు పరిగణిస్తున్నారు. ప్రీతి ఏలా చనిపోయిందో స్పష్టమైన ఆధారాలు లభించకపోయినప్పటికి ర్యాగింగే ప్రీతి డెత్ కు కారణమని పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందుకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్ధి సైప్ ను అరెస్టు చేసి జైల్ కు పంపగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. ప్రీతి ఎలా చనిపోయిందో తెలియక, సైఫ్ కు బెయిల్ లభించడం, ఎంజీఎం లో ప్రీతి పడిపోయిన గది సీజ్ తొలగించడం, కేఎంసీ యాజమాన్యం పై చర్యలు లేకపోవడంతో ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెడిక్ ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయారు. నిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ప్రీతి ప్రాణాలు కోల్పోయారు. ప్రీతి మృతి పై అనేక అనుమానాలు ఆందోళనలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు ర్యాగింగే కారణమని తేల్చారు. సైఫ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మూడుసార్లు బేయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగా 56 రోజుల అనంతరం షరతులతో కూడిన బెయిల్ లభించింది. పది వేల బాండ్, ఇద్దరు పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ ఇచ్చి, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.
ముందుగా ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ టాక్సికాలజీ రిపోర్టులో ఎలాంటి మత్తు రసాయనాలు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదు. ఎవరైనా హత్య చేశారా అంటే అందుకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. హత్య కాదు… ఆత్మహత్య చేసుకోలేదు.. మరి ప్రీతి ఎలా చనిపోయిందనేది అందరి మదిని తోలుస్తున్న ప్రశ్న. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా బావిస్తూ అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా సాగిస్తున్న విచారణలో ఏమి తేలలేదు.
పోలీసులకు సవాల్ గా మారిన ఈ కెసులో కీలకంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స విబాగంలో ప్రీతి పడిపోయిన విశ్రాంతి గది సీజ్ ను తొలగించారు. ఘటన జరిగిన రోజున మట్టెవాడ పోలీసులు ఈ గదిని సీజ్ చేసి పలుమార్లు సిపి రంగనాథ్ సందర్శించి స్వయంగా విచారణ చేశారు. ఇప్పటి వరకు కేసులో ఏలాంటి పురోగతి కనిపించకపోగా, మట్టెవాడ పోలీసులు సీజ్ చేసిన గది తాళాలను తొలగించి ఎంజీఎం అధికారులకు అప్పగించారు. ఈ కేసును పోలీసులు ఎటు తేల్చకుండానే గది తాళాలను ఎంజీఎం అధికారులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రీతి డెత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్రమంగా కేసు తీవ్రతను తగ్గిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను ప్రీతి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగాలేదని, ఇప్పటివరకు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా కేఎంసీ ప్రిన్సిపల్ హెచ్వీడి పై చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ లో రూమ్ ఎందుకు సీజ్ తొలగించారని ప్రీతి సోదరుడు పృథ్వి ప్రశ్నిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందని ఇండైరెక్ట్ గా చెబుతున్నారని, అదే నిజమైతే ఎందుకు రక్తం ఎక్కించారు.. కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయిన గది సీజ్ ను తొలగించడానికి కారణం పీజీ వైద్య విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర చికిత్స కోసం అవసరం కావడంతోనే సీజ్ తొలగించి ఆసుపత్రికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఏ ఒక్క చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని సిపి రంగనాథ్ తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా జాగ్రత్తగా లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. ఫైనల్ గా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ నిర్ణయానికి రాలేమన్నారు సిపి రంగనాథ్. ఒకవేళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినా, సాధారణ మరణమే అయినా అందుకు ర్యాగింగే కారణమని స్పష్టం చేశారు. సైఫ్, ప్రీతి సెల్ ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్ ల ఆధారంగా ప్రీతి ర్యాగింగ్ కు గురైందని నిర్ధారించామని, ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం సైఫ్ కు పదేళ్ళ శిక్షతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు శిక్ష అదనంగా ఉండే అవకాశం ఉందని ఇటీవల సీపి ప్రకటించారు.
దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇంకా పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రాకపోవడం, కేసు మిస్టరీ వీడకపోవడంతో కన్నవారు మానసిక ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. ఎలా చనిపోయిందో స్పష్టం చేసి ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
.