కీచక మహేష్ ప్రాణాలు తీసిన మహిళలు

పరువు తీసిన మహేష్ ను హత్య చేసిన కనకయ్య కుటుంబ సభ్యులు

వాళ్లిద్దరు ఐదేళ్లు గా ప్రేమించుకున్నారు..‌ కలిసి ఉన్నారు… కలహలతో విడిపోయారు…విడిపోయిన వీడలేదు రాక్షస ప్రేమికుడు…పెళ్లి చేసుకున్నా ప్రియురాలిని వేదించాడు… కలిసిఉన్నా వీడియోలను, పోటోలను సోషల్ మీడియాలో‌‌ పెట్టి ప్రియురాలి పరువు తీశాడు..ఆ అవమానం తట్టుకోలేక.భర్త అత్మహత్య చేసుకున్నాడు… పరువు తీసి భర్తను చంపినా ప్రియురాలిని వదలలేదు..‌ కలిసి ఉందామని వేదించాడు ప్రియుడు.. ఆ వేదింపులు తట్టుకోలేక కత్తులతో పోడిచారు..‌ బండరాళ్లతో బాదారు కీచక యువకుని ప్రాణాలు తీశారు.. మంచిర్యాల జిల్లాలో మహేష్ హత్యలో పోలీసుల విచారణలో భయటపడిన భయంకరమైన నిజాల పై ప్రత్యేక కథనం

. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహేష్ యువకుని హత్య పై పోలీసుల‌ విచారణలో ‌ సంచనలమైన విషయాలు బయట పడ్డాయి. మహేష్ యువకున్ని అత్యంత కిరాతక హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు..అరెస్టైనా వారిలో‌‌ పెద్దపల్లి కనకయ్య , ఆయన బార్య పద్మ, కూతురు శ్వేత, శ్రుతి, కుమారుడు సాయిని పోలీసులు అరెస్టు చేశారు‌. అదేవిధంగా హత్యకు ఉపయోగించిన. కత్తిని, సెల్ పోన్ స్వాదీనం చేసుకున్నామని తెలిపారు జైపూర్ ఎసిపి నరేందర్

జైపూర్ మండలం ఇందారం గ్రామానికిచెందిన. శ్రుతి, నజీర్ పల్లికి చెందిన. ముష్కే మహేష్ ఇద్దరు ప్రేమించుకున్నారు.‌ 2019 నుండి అత్యంత సన్నిహితంగా కలిసి ఉన్నారు.. కాని మహేష్ ప్రవర్తన. నచ్చక శ్రుతి దూరంగా ఉంటుంది.. ఆ తర్వాత శ్రుతికి మరోక. యువకునితో పెళ్లిచేశారు తల్లిదండ్రులు

.. శ్రుతి పెళ్లి చేసుకోవడంతో మహేష్ తట్టుకోలేక పోయాడు..ఆ పెళ్లిని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించాడు..అందులో బాగంగా శ్రుతితో కలిసి ఉన్నా, నగ్నంగా ఉన్నా వీడియోలు, ఇన్ స్టా గ్రామ్, పెస్ బుక్ లో పోస్ట్ చేశాడు.. సోషల్ మీడియా లో‌బార్య నగ్న వీడియోలు బయటకు రావడంతో శ్రుతి భర్త తట్టుకోలేక మనస్తాపం చెంది అత్మహత్య చేసుకున్నాడు..ప్రాణాలు కోల్పోయాడు శ్రుతి భర్త….

భర్తను వీడియోలతో చంపినా మహేష్ .. శ్రుతి పై మోజు వీడలేదు..మళ్లీ వేదిస్తున్నాడు.. రకరకాల చిత్రహింసలకు గురి చేస్తున్నాడు… పైగా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిన సందర్బాలు ఉన్నాయి.. ఈ వేదింపులు, న్యూడ్ వీడియోల పై పోలీసులకు పిర్యాదు చేశారు.మహేష్ పై కేసులు నమోదయ్యాయి.. అరేస్టై జైలుకు వెళ్లారు.. కాని మహేష్ ప్రవర్తన మారలేదు..వేదింపులు అగలేదు.

.. కూతురు జీవితం సర్వనాశనం కావడానికి కారణమైన మహేష్ హత్య. చేయాలని కనకయ్య., ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.. హత్య కోసం పథకంరచించారు…హత్య చేయడానికి అవసరమైన కత్తిని గోదావరి ఖని వెళ్లి కోనుగోలు చేశాడు.. ‌ ఇక ప్రతిరోజు గా లాగా ఇంటి ముందు నుండి వెళ్లే మహేష్ కోసం ‌కాపుకాశారు..బైక్ వస్తున్నా మహేష్ ను అడ్డుకున్నారు. కత్తితో దాడి చేశారు.. క్రిందపడిపోగానే మహేష్ పై సిమెంట్స్ బ్రిక్స్ తో కసి తీరా బాదారు.. రక్తం మడుగులో కోట్టుమిట్టాడుతు మహేష్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.. హత్య తర్వాత మహేష్ కుటుంబ సభ్యులు దాడి చేస్తారని కనకయ్య కుటుంబ సభ్యులు పారిపోవడానికి బయలుదేరారు.. కాని పోలీసులకు సమాచారం అందడంతో మహేష్ హత్యను చేసిన నిందితులను అరెస్టు చేశారు… అదేవిధంగా నిందితులు నేరాన్ని పోలీసుల విచారణలో అంగీకరించారు..‌వేదిస్తున్నందు వల్లనే హత్య చేశామని ఒప్పకున్నారు..

Leave A Reply

Your email address will not be published.