మహేశ్వర్ రెడ్డి పార్టీమార్పుతో పలితం మారుతుందా?
కాంగ్రేస్ నుండి బిజెపిలో చేరిన మహేశ్వర్ రెడ్డి

.. పార్టీ మారారు… కమలంగూటికి చేరారు.. పార్టీ మార్పుతో మహేశ్వర్ రెడ్డి రాత మారుతుందా? మహేశ్వర్ రెడ్డి పార్టీ మారడానికి కారణాలేంటి?ఆ ముగ్గురు చిరకాల ప్రత్యర్థులే మళ్లీ నిర్మల్ ఎన్నికల రంగంలో దిగుతారా? బి అర్ ఎస్ నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి నుండి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల. యుద్దంలో దిగనున్నారు..మరి కాంగ్రెస్ పార్టీ కూచడి శ్రీహరిరావు రంగంలో దిగుతారా? నిర్మల్ మారుతున్నా రాజకీయ సమీకరణాల పై ప్రత్యేక కథనం
.నిర్మల్ నియోజకవర్గం లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బిజెపి అధ్యక్షుడు నడ్డా, సంజయ్ , ఈటేల. రాజేందర్ సమక్షంలో డీల్లీలో పార్టీలో చేరారు… ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ గా మహేశ్వర్ రెడ్డి మానిక్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ టార్గెట్ విమర్శలు చేశారు.. తనకు షోకాజ్ నోటీష్ ఇవ్వడం పై అగ్రహం వ్యక్తం చేశారు..
ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తో షోకాజ్ నోటిష్ పై తెల్చుకుంటామని ప్రకటించారు.. కాని అంతలోనే కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరడంపై కాంగ్రెస్ షాకైంది.
.. అయితే మహేశ్వర్ రెడ్డి అకాస్మాత్తుగా పార్టీ మారడానికి రకరకాల. కారణాలు ఉన్నాయట.. ప్రదానంగా బిఅర్ ఎస్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కూచడి శ్రీహరి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తిరుగుబాటు చేశారు… అదేవిధంగా అవినీతి ,అసమర్థ మంత్రని ఆయనకు బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు… మంత్రిని ఓడించాలని ప్రజల్లోకి వెళ్లుతున్నారు
.. శ్రీహరి రావు మంత్రి పై తిరుగుబాటు చేయడానికి వ్యూహం ఉందట… రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బావించారట..అందులో బాగంగా బిజెపిలో చేరాలని నిర్ణయించుకన్నారట.. శ్రీహరి రావు బిజెపిలో చేరుతున్నారనే మహేశ్వర్ రెడ్డి పసిగట్టారట.. శ్రీహరి రావు బిజెపిలో చేరితే తనకు అవకాశం ఉండదని ఏలేటి బావించారట.. అందుకే కమలం పార్టీలోచేరారని ప్రచారం ఉంది…అయితే మహేశ్వర్ రెడ్డి తో పాటు స్థానిక ప్రజాప్రతినిదులందరు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు…రేపుమాపు బిజెపిలో చేరుతారట…దాంతో కాంగ్రెస్ ఖాళైంది
. అయితే తెలంగాణ ఉద్యమ కారుడు శ్రీహరి రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది..కమలం పార్టీలో మహేశ్వర్ రెడ్డి చేరడంతో…ఇక శ్రీహరి రావు ఎన్నికలలో పోటీ చేయాలంటే కాంగ్రెస్ తప్ప మార్గం లేదట..కాంగ్రెస్ లో చేరుతారా లేదా అనేది అసక్తి రేపుతోంది..ఇప్పటికే శ్రీహరిరావు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పై వైపల్యాల పై ప్రజల్లోకి వెళ్లుతున్నారు..మంత్రి ఒడించాలని పిలుపునిస్తున్నారు.. దీనితో ఎన్నికల బరిలో దిగడం ఖాయమమే సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది అసక్తి రేపుతోంది.. పోటీ చేయడానికి కాంగ్రెస్ తప్ప మరోక మార్గంలేదట.. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో దిగుతారని ప్రచారం ఉంది..
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీహరి రావు ముగ్గురు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నారు…2014 ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ చేశారు.. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుండి మహేశ్వర్ రెడ్డి, బిఎస్పీ నుండి మంత్రం ఇంద్రకరణ్ రెడ్డి, అప్పటి టిఅర్ ఎస్ నుండి శ్రీహరి రావు పోటీ చేశారు.. ఈ. ఎన్నికలలో బిఎస్పీ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాదించారు..ఈ ఎన్నికలలో ఇంద్రకరణ్ 61,368ఓట్లతో 38.%ఓట్లు సాదించారు.. టిఅర్ ఎస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావు 52,871ఓట్లతో 32%ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి కి 38,951ఓట్లతో 24.12% ఓట్లు సాదించారు. మూడోస్థానంలో నిలిచారు మహేశ్వర్ రెడ్డి .అదే 2018 ఎన్నికలలో బిఅర్ ఎస్ నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాదించారు.ఈఎన్నికలలో 79,985ఓట్లతో 46%ఓట్లు సాదించారు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి 70,714ఓట్లతో 40.%ఓట్లు సాధించారు. బిజెపి అభ్యర్థి స్వర్ణ రెడ్డి 16,900ఓట్లు సాదించారు.
.2023 ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు మారుతున్నారు. మళ్లీ ఈముగ్గురు ప్రత్యర్థులుగా నిలుస్తారని నియోజకవర్గం లో జోరుగా ప్రచారం సాగుతోంది.. అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి, ఈసారి బిజెపి అభ్యర్థిగా రంగంలో దిగనున్నారు…బిఅర్ ఎస్ నుండి మంత్రి పోటీ చేయనున్నారు.. కాంగ్రెస్ నుండి శ్రీహరి రావు పోటీ చేస్తారని ప్రచారం ఉంది.. గత ఎన్నికలలో బిజెపి పదహరు వేలకు పరిమితమైంది… మహేశ్వర్ రెడ్డి రాకతో బిజెపి బలం పెరిగింది.. అదేవిధంగా బిజెపికి ఊపు ఉంది… ఈ రెండింటితో గెలుపు ఖాయమని మహేశ్వర్ రెడ్డి బావిస్తున్నారట.. కాని నిర్మల్ నియోజకవర్గం లో ముస్లిం మైనారీటీల ఓట్లు బారీగా ఉన్నాయి…ఈ. ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి… ఇదే మహేశ్వర్ రెడ్డి కి దడపుట్టిస్తున్నాయట.. కాని ఆ ప్రభావం ఉండదని గత. పార్లమెంటు ఎన్నికలలో తెలింది.. ఎకంగా పార్లమెంటు ఎన్నికలలో బిఅర్ ఎస్ మూడోస్థానికి పడిపోయింది… కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది…ఈ రెండు పార్టీలను కాదని బిజెపి బారీ అదిక్యం సాదించింది… అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికలలో కోనసాగించి విజయం సాదిస్తామని మహేశ్వర్ రెడ్డి దీమాను వ్యక్తం చేస్తున్నారట.. మరి మహేశ్వర్ రెడ్డి అంచనాలు పలిస్తాయో లేదోచూడాలి