మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దారేటు?

అనుచరుల అబిప్రాయాలు సేకరించిన మాజీ ఎమ్మెల్యే

. వరస ఓటమలు… ఓటమి ఒడ్డేక్కాలంటే పార్టీ మారాలంటున్నా అనచురులు.. కమలం గూటికి చేరితేనే విజయం సాదిస్తామంటున్నా కార్యకర్తలు…పార్టీ మారితే మునుగుతామని భయపడుతున్నా మహేశ్వర్ రెడ్డి… మూడు రోజుల్లో మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పు నిర్ణయం తీసుకుంటారా.?లేదంటే కాంగ్రెస్ ఉంటూ మళ్లీ పాద యాత్ర మొదలు పెడుతారా? ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమీటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి పార్టీ మార్పు పై ప్రత్యేక కథనం

.. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మార్పు ఉత్కంఠ రేపుతోంది‌..నిర్మల్ జిల్లా బైంసాలీ మహేశ్వర రెడ్డి పాదయాత్ర. ప్రారంభించారు ‌‌‌ నాలుగు రోజుల పాటు కొనసాగింది.. ఆతర్వాత మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే అడ్డకున్నారు… పాదయాత్రను నిలిపివేయాలని అదేశించారు.. న నాలుగు రోజుల పాటు చేసిన పాదయాత్రను మానిక్ రావు థాక్రే అడ్డుకోవడం పై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి తో ఉన్నారు‌.‌ పాదయాత్రను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలని మానిక్ రావు కు లేఖ రాశారు మహేశ్వర్ రెడ్డి. .. లేఖకు మానిక్ రావు స్పందించలేదు..సమాధాన ఇవ్వలేదు..

.. దాంతో మహేశ్వర్ రెడ్డి అసంత్రుప్తితో ఉన్నారు..అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. అసంత్రుప్తితో రగిలిపోతున్నారు.. కాంగ్రెస్ లో సరియైన గుర్తింపు లభించడం లేదని మనస్థాపం చెందుతున్నారు..అందులో బాగంగా నిన్న. నిర్మల్ లో ఆయన ఇంట్లో ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు..ఈ. సందర్భంగా పార్టీ మార్పు పై కార్యకర్తలు, నాయకుల నుండి అభిప్రాయాలను సేకరించారు‌.‌మేజారీటి కార్యకర్తలు పార్టీ మారాలని సూచించారట‌.. పార్టీ మారకుంటే మునుగుతామన్నారట.. ఇప్పటికే 2014,2018ఎన్నికలలో ఓడిపోయారు. తెలంగాణ. బిజిపి పుంజుకున్నది…నిర్మల్ నియోజకవర్గం లో కమలం పార్టీ ఊపు పెరిగింది.. ఆ. పార్టీలో చేరాలని పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి కి సూచించారట‌‌.పార్టీ మార్పు మహేశ్వర్ రెడ్డిగూడెం సానుకూలంగా స్పందించారని కోందరు నాయకులు సెల్ పోన్లలో స్టేటస్ లు కూడపెట్టుకున్నారట…ఆ తర్వాత.ఒత్తిడి రావడంతో స్టేటస్ లు తోలగించారు..

… అయితే పార్టీ మార్పు పై అన్ని అంచనాలు వేసుకుంటున్నారట..‌ కమలంపార్టీలో చేరితే విజయవకాశాలు ఏలా ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారట.. అందులోబాగంగా పార్టీ మార్పు పై మూడు రోజులలో స్పష్టత ఇస్తారని ప్రచారం ఉంది ..అయితే మూడు రోజుల తర్వాత. మహేశ్వర్ రెడ్డి ఏలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది ఉత్కంఠ రేపుతోందట..

పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే ఈ నెల పదిహేడు రోజున బిజెపిలో చేరుతారని ప్రచారం ఉంది‌.. అయితే పార్టీ మార్పు చేయాలని బావించడానికి అనేకకారణాలు ఉన్నాయట… ప్రదానంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బిఅర్ ఎస్ నాయకుడు శ్రీహరిరావు తిరుగుబాటు చేశారు‌.మంత్రి పై విమర్శలు చేశారు… కమలం పార్టీలో చేరడానికి శ్రీహరిరావు మంత్రి పై విమర్శలు చేశారని ప్రచారం ఉంది…శ్రీహరి రావు చేరితే తనకు పార్టీలో చేరడానికి అవకాశాలు ఉండవని మహేశ్వర్ రెడ్డి అందోళన చెందుతున్నారట.. అందుకే పార్టీ మార్పు పై మహేశ్వర్ రెడ్డి ఉత్సహం చూపుతున్నారట..

. అయితే పార్టీ మార్పు పై ముందుకు కదులదామంటే మైనారిటీ ఓట్లు దడపుట్టిస్తున్నాయట.‌‌ బిజెపిలో చెరితే మైనారిటీ ఓట్లు రావు…. అందువల్ల మైనారిటీ ఓట్లుగుంప గుత్తగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పడుతాయని మహేశ్వర్ రెడ్డి అందోళన చెందుతున్నారట.. ముప్పై వేల ఓట్లు ఎక పక్షంగా మంత్రిని మొగ్గుచూపితే…. మంత్రి సునాయసంగా విజయం సాదిస్తారని ఒక అంచనా.. దీనితో కమలం పార్టీలో చేరిన. పలితం ఉండదని అంచనా వేస్తున్నారట‌. అదే కాంగ్రెస్ లో కొనసాగితే మైనారిటీ ఓట్లు మంత్రి కన్నా తనకే ఎక్కువగా పడుతాయని బావిస్తున్నారట.. దీనికి తోడు మంత్రి ప్రజల వ్యతిరేకత తోడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారట… ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి ని పార్టీ మారకుండా బుజ్జగిస్తున్నారట…ఆ బుజ్జగింపులకు చల్లబడితే…ఈ నెల పదిహేను నుండి దిలావర్ పూర్ నుండి పాద యాత్ర ప్రారంభిస్తారట..‌నియోజక వర్గాన్ని చుట్టేస్తారట.. సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతారట… మరి మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారో లేదంటే పాదయాత్ర చేస్తారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.