భూమి కోసం గోడ్డళ్లతో దాడులు చేసుకున్నా దాయాదులు

దాడిలో‌‌ ప్రాణాలు కోల్పోయిన. ఇద్దరు వ్యక్తులు

.భూమి కోసం దాయాదుల. పోరు… ఆపోరు యుద్దాన్ని మరిపించింది….పగలతో రగిలిపోతున్నా రెండు వర్గాలు గోడ్డళ్లతో దాడులు చేసుకున్నారు… కర్రలతో‌ కోట్టుకున్నారు.. ఆదాడులతో పచ్చని పంటపోలాలు రక్తంతో తడిసిపోయాయి… గోడ్డళ్ల దాడులకు ఇద్దరు బలయ్యారు…మరోక ఆరుగురు గాయాలపాలై అసుపత్రి పాలయ్యారు..‌భూవి వివాదం ప్రాణాలు తీయడానికి కారణాలేంటి? కుమ్రంబీమ్ ప్రాణాలు మింగుతున్నా దాయాదుల. భూ యుద్దం పై ప్రత్యేక కథనం

. ‌కుమ్రంబీమ్ జిల్లా రెబ్బేన మండలం జక్కుల‌పల్లి గ్రామంలో‌‌‌ దాయాదులైనా మడన్ కారి భీమయ్య, నాగయ్య అన్నదమ్ముల మద్య భూ. వివాదం ఉంది… 110,111,112 సర్వే నెంబర్ భూమిలో ‌‌‌ తోమ్మిది ఎకరాల‌భూమి పై వివాదం ఉంది… ఈ భూమి పై ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు తమది, భూమంటే..తమదే భూమి కోసం‌‌ కోట్లాడుతున్నారు
.
.అలాంటి వివాదస్పదమైన భూమిలో .ఒక‌వర్గం వ్యవసాయపనులు చేపట్టింది…మరోక వర్గంవారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు… ఆ పనులు చేపట్టిన. భూమి వద్దకు వెళ్లారు.. పనులను అడ్డుకున్నారు. పనులను అడ్డుకోవడంతో వివాదం‌ముదిరింది. ఈ‌సందర్బంగా రెండు వర్గాలు పరస్పరం గోడ్డళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.. ప్రత్యర్థుల మరిపించేవిదంగా వేంటపడి ఒకవర్గం మరోక వర్గాన్ని వేటాడింది. గోడ్డళ్లతో విచ్చలవిడిగా ‌నరుకున్నారు… పరుగులు పెడుతున్నా మహిళలను వదలిపెట్టలేదు..వెంటపడి దాడి చేసి ప్రాణాలు తీశారు.పరస్పరం చేసుకున్నా దాడిలో బక్కమ్మ, నర్సయ్య. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు… మరోక ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి..గాయపడిన బక్కయ్య పరిస్థితి విషమంగా ఉంది… చావుబ్రతుకుల‌మద్య. కోట్టుమిట్టాడుతున్నా భక్కయ్యను చికిత్స కోసం అసుపత్రికి తరలించారు

పరస్పరం దాడులతో దదరిల్లిన. ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సురేష్ సందర్శించారు… సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భూవివాదం కారణంగానే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయని ఎస్పీ‌ అన్నారు.. దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు..‌మళ్లీ దాడులు జరగకుండా చర్యలు చెపట్టామన్నారు… అందులో బాగంగా గ్రామంలో పోలీస్ పికేటింగ్ ఏర్పాటు చేశామని‌ తెలిపారు…గోడవకు కారణమైనా వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.