రాజ్యం లేని.. కిరీటం లేని అదివాసీ రాజులపాల‌న

ఉమ్మడి ఆదిలాబాద్ లో అదర్శంగా నిలుస్తున్నా రాజవంశీయులు

.వాళ్లు గోండు రాజులు… నిజామ్ రాజు కు దడ పుట్టించిన వాళ్లు‌..ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన యోదులు‌‌… కోటలు నిర్మించిన వాళ్లు…కాకతీయులును మరింపించిన వాళ్లు.. పాలనతో చరిత్రలో నిలిచిన వాళ్లు…. గోండురాజులు…కాని ఇప్పుడు రాజ్యాలు లేవు.. ఒకప్పుడు కోటల్లో నివసించిన రాజవంశస్థులు ఇప్పుడు బికారీలుగా మారారు. గుడిసేల్లో నివసిస్తున్నారు.. పాలన సాగించిన వాళ్లు సాగు సమరం చేస్తున్నారు.. ఆ కిరీటం లేని రాజులే గూడాలలో పాలన. సాగిస్తున్నారు…అదివాసీ గూడాలలో కిరీటం లేని రాజుల పాలన పై  ప్రత్యేక కథనం

….గోండురాజులు.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు రాజదానిగా పాలన సాగించిన. రాజ వంశీయులు అత్రం వంశీయులు.మొదటగా బల్లార్షా రాజు క్రింద సామంతరాజులుగా పాలన సాగించారు..ఆ తర్వాత. ఉట్నూరు రాజదానిగా రాజ హన్మంతరావు, జలపతిరావు , రాజ దేవ్ షా పాలన సాగించారు. ప్రజా సంక్షేమం లో ఇతర రాజులకు అదర్శంగా నిలిచిన చరిత్ర గోండు రాజులది.

. ఇప్పటికీ గోండురాజులు నిర్మించిన శత్రుదుర్బేద్యమైన కోట ఉట్నూర్ లో ఉంది.ఇది శిథిలావస్థకు చేరింది.. అక్కడే అద్బుతమైన మేట్లబావులున్నాయి. అదేవిధంగా పంటలకు సాగునీరు అందించడానికి గోండు రాజుల. చెరువులు తవ్వించారు.. ఉట్నూరు కోటతో పాటు సిర్పూర్ యు పంగిడి,సీతా గోంది గోండురాజులకు సంబంధించిన. కోటలు నిర్మించారు..ఈ విదమైన పాలనతో రాజ్యాన్ని మద్య భారత దేశం వరకు విస్తరించారు‌‌ గోండు రాజులు.

.. అయితే రాజ్యాలు కాలగర్భంలో పోయాయి.. ఆ రాజకుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి.. అనాటి రాజకుటుంబాల వారసులు ఉట్నూరు లో, సిర్పూర్ మండలం కంచన్ పల్లిలో ఉన్నారు.. ఉట్నూర్ లో గంగాదర్ రావు, అదేవిధంగా కంచన్ పల్లి అత్రం బీమ్ రావు రాజకుటుంబాలు ఉన్నాయి..ఈ కుటుంబాలకు ఒకప్పుడు వందల. ఏకరాలు భూములు ఉండేవి ..కాని దాన దర్మాలు చేయడంతో ఉ‌న్నాఅస్తులు కరిగిపోయాయి. ఉట్నూరు లో ఏర్పాటు చేసిన ఐటిడిఎ. కార్యాలయంకు ఇచ్చిన స్థలం రాజకుటుంబీకులదే.. గిరిజన ప్రజల పాలన కోసం రాజకుటుంబీకులు దానం చేశారు..అదేవిధంగా కంచన్ పల్లి బీమ్ రావు‌ కుటుంబానికి ఒకప్పుడు వందల ఎకరాలు ఉండేది..‌కాని ఇప్పుడు కేవలం బీమ్ రావుకు కేవలం ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే మిగిలింది..

… ఆ భూములలో రాజవంశీయులు బీమ్ రావు సాగు చేస్తున్నారు.. ఆ భూములలో పండిన పంటలతో బీమ్ రావు కుటుంబీకులు జీవనం సాగిస్తున్నారు.. ఇలా బీమ్ రావు ఒక్కరే‌ కాదు.‌‌ పంగిడిలో ఉన్నారు, సీతగోందిలో ఉ‌న్నా రాజవంశీయులు సాదసీదా జీవనం సాగిస్తున్నారు..కడుపేదరికంలో చిక్కుకోని ఇబ్బందులు పడుతున్నారు..

. రాజ్యం లేకున్నా… పేదరికంలో తల్లడిల్లుతున్నా ఇతర గిరిజనులు ఏవరైనా సహాయం కోరితే కాదనడం లేదు.. దానాలు దర్మాలు చేస్తున్నారు రాజవంశీయులు.. ‌పరిసర ప్రాంతాలలో ఏ చిన్న సమస్య వచ్చిన రాజవంశీయుల వద్దకు గిరిజనులు వస్తున్నారు… దానికి రాజవంశీయులు పరిష్కారం చూపుతున్నారు…అందుకే తమకు రాజ్యం లేకున్నా… కిరీటం లేకున్నా అందరి కోసం పాటుపడటం ఆనందంగా ఉందంటు‌న్నారు‌ రాజ.వంశీయులు అత్రం బీమ్ రావు.

 

Leave A Reply

Your email address will not be published.