హిందు మంత్రం జపం చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్న

చాలీసా పారాయణం, యాగాలు నిర్వహిస్తున్నా ఎమ్మెల్యే

. యాగాలు నిర్వహిస్తున్నారు… చాలీసా పారాయణం చేస్తున్నారు.. శ్రీరాముని ‌శోభ యాత్ర ర్యాలీని అట్టహసంగా నిర్వహించడానికి సిద్దమవుతున్నారు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్నా రాజాసింగ్ మరిపిస్తున్నారు.. బిజెపిని చిత్తు చేయడానికి కోత్త ఎత్తుగడలు వేస్తున్నారు…రామన్న కోత్తరాగం హిందూ ఓటర్లను ఆకట్టుకుంటుందా? ఆదిలాబాద్ జిల్లా బిఅర్ ఎస్ ఎమ్మెల్యే  జోగురామన్న ఎత్తుగడపై   ప్రత్యేక కథనం

.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న… సరికోత్త పల్లవి వినిపిస్తున్నారు… హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి సరికోత్త. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. పదిహేను రోజుల వ్యవదిలో నే మూడు కార్యక్రమాలు నిర్వహించారు.. ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ‌కార్యాలయంలో హను మాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.. చాలీసా కార్యక్రమానికి బారీగా హజరయ్యారు. కార్యక్రమం లో రామన్న, బి అర్ ఎస్ శ్రేణులు చాలీసా పారాయణం చేశారు.. అదేవిధంగా చిరుతలు వాయిస్తూ రామన్న పాటలు పాడారు..వచ్చిన హనుమాన్ భక్తులను ఆకట్టుకున్నారు.

 

ఆ తర్వాత ‌ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో దుర్గమాత ఆలయం శత చండియాగం మూడు రోజుల పాటు నిర్వహించారు.. ఈ కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించిన. రామన్న అన్ని వనరులు సమాకూర్చారు.. అదేవిధంగా శత చండి యాగం లో పాల్గోని జోగురామన్న దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు..యాగానికి వచ్చిన భక్తులకు అన్ని కల్పించారు రామన్న…ఆదిలాబాద్ నియోజకవర్గం సర్వతోముఖాబివ్రుద్ది కోసం ,ప్రజల సుఖశాంతుల కోసం యాగాన్ని నిర్వహించామన్నారు‌‌

. యాగం నిర్వహించి మూడు రోజులు గడువక ముందే మళ్లీ‌శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముని శోభ యాత్రను చేస్తున్నారు… ప్రతి ఏటాయాత్రను నిర్వహిస్తున్నారు..కాని ఈసారి రామన్న అధ్వర్యంలో యాత్రను నిర్వహిస్తున్నారు.. రామన్న అధ్వర్యంలో నిర్వహించే రాముని శోభయాత్ర. రాజకీయంగా దుమారం‌‌‌రేపుతోంది.. బిజెపి రామన్న శోభయాత్ర పై విమర్శన ఆస్త్రాలు సందిస్తోంది..‌ఓట్ల కోసమే రాముని ‌జపంనిర్వహిస్తున్నారని బిజెపి మండిపడుతోంది.

..‌ ఆదిలాబాద్ నియోజకవర్గం లో బిజెపి బలంగా ఉంది..‌ బిజెపి అభ్యర్థి పాయల శంకర్ రామన్నకు దీటుగా‌‌ పోటీ‌పడుతున్నారు.. పైగా నలబై వేలకు పైగా ఓట్లను సాదిస్తోంది…‌హిందూ సానుభూతి పరులందరు బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారు..ఆ హిందూ సానుభూతి పరులు బిజెపి వైపు మొగ్గు చూపుకుండా ఎత్తగడలు వేశారు..అందులో బాగంగా యజ్నాలు, చాలీసా పారాయణం, రాముని శోభయాత్ర నిర్వహిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది…

 

.. చాలీసా పారాయణం, శత చండి యాగం, శ్రీరాముని శోభయాత్రతో ఈ‌కార్యక్రమాలతో బిజెపి అదిపత్యానికి రామన్న దెబ్బకోడుతున్నారట… అదేవిధంగా రామన్నకు హిందూ ఓటర్ల సానుభూతి పెరుగుతుందని బావిస్తున్నారట.. అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటారనే ‌ముద్రను ఎమ్మెల్యే తోలగించుకుంటున్నారని ప్రజల్లో చర్చ సాగుతుందట..ఒకవైపు యాగాలు నిర్వహిస్తున్నారు..మరోవైపు బిజెపి పై దూకుడుగా విమర్శనాస్త్రాలు సందిస్తున్నారట.. అందుకే బిఅర్ ఎస్ నాయకులు రామన్నను ఆదిలాబాద్ రాజాసింగ్ పిలుస్తున్నారట.. కాని బిజెపి మాత్రం రామన్న. హిందూ ఓటర్లను అకట్టుకోవడానికి ఎన్ని జపాలు చేసిన ప్రజలు నమ్మరని ఆ పార్టీ నాయకులు కోట్టిపారేస్తున్నారట.. మరి రామన్న యాగాలకు ,శోభయాత్రలకు ,చాలీసా పారయాణాలు హిందూ ఓటర్లను అకట్టుకుంటాయో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.