రాజ పలాలకు రాకాసి రోగం దెబ్బ

మామిడిని కాటేస్తున్నా నల్లతామర రోగం

 

మదురమైనా మామిడి పండ్ల స్వర్గదామం కోల్లపూర్ …తేనే కన్నా  తీయనైనా పండ్లు..   ఆ ‌మదురమైన. పండ్ల కోసం  మహరాజులే  ఆశగా  ఏదురుచూసే  వాళ్లున్నారు… ఖండాంతర ఖ్యాతి గడించిన పండ్లను  కాటేస్తున్నా   రాకాసి  తేగుళ్లు..తీయని మామిడి పండ్ల పై   తేగుళ్ల పంజా    పై ప్రత్యేక కథనం

— ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 వేల 838 ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి.ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే 32 వేల 708 ఎకరాల్లో మామిడితోటలు ఉండగా అందులో కొల్లాపూర్ ప్రాంతంలోనే 22 వేల 300 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఏటా 2 లక్షల 24 వేల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది.ఇందులో కేవలం 12 నుంచి 15 శాతం మాత్రమే జిల్లావాసుల అవసరాలకు వినియోగించు కుంటున్నారు. మిగిలింది అంతా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవాల్సిందే. ప్రతిఏటా ప్రత్యేక్షంగా,పరోక్షంగా వేలాది మంది మామిడి తోటలపై ఆదారపడి ఉపాధిపొందుతున్నారు.సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించే వారు. ఇంత ప్రాచుర్యం ఉన్నా ఇక్కడి మామిడి రైతులకు ఆశించిన స్దాయిలో లాభాలు రావటం లేదు.అనేక వడిదుడుకులు ఎదుర్కొని మామిడికాయలు పండించినా చివరకు విక్రయించేందుకు సరైన మార్కెట్ సదుపాయం లేక…కొన్నాళ్లు నిల్వచేద్దామన్నా కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేక రైతులకు అవస్దలు తప్పటం లేదు.దీంతో దిగుబడి వచ్చిన మామిడిని దళారులను ఆశ్రయించి అమ్ముకునే దయనీయమైన పరిస్ధితి నెలకొంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది మామిడి రైతుల పరిస్దితి దయనీయంగా మారింది.వరుసగా వస్తున్న అతివృష్టి, అనావృష్టి మరియు వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా ఇక్కడి మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీంతో ప్రకృతి ప్రకోపం కారణంగా మామిడి రైతులు నిండా మునుగుతున్నారు.

 

మాండుస్‌ తుఫాన్ కు తోడు, రకరకాల తెగుళ్లకు తోడు నల్ల తామర పురుగు ఉధృతి పెరగడం రైతన్నను నట్టేటా ముంచేశాయి.దీనివల్ల మామిడి పూత దశలోనే రాలిపోవటంతో రైతులు  అందోళన చెందుతున్నారు.ఇక్కడ వేలాది మంది కౌలు రైతులు యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని మామిడి తోటలను లీజుకు తీసుకుంటున్నారు.లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు ఇప్పుడు అవి తీర్చే దారిలేక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు..

 

ఈసంవత్సరం కొల్లాపూర్ మామిడి ప్రియులకు నిరాశే మిగులనుంది. నల్ల తామర అనే పురుగు చేరి పూతలోని రసం పీల్చేసి పిందెలను రాకుండా నాశనం చేస్తుంది.గత మూడు సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి నెలకొంది.మామిడి రైతులు మరియు కౌలు రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు.మామిడి తోటలో నల్ల తామర పురుగు నివారణ కోసం ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం లేకపోయింది.లక్షల రుపాయలు వెచ్చించి ఎన్ని సార్లు  పిచికారి చేసిన ఉపయోగం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మామిడి పూతలు భారీగా విరగ పూసాయి కానీ ఆ మామిడి పూతలను తెగుళ్లు తుంచేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ నల్ల తామర పురుగు నివారించడం కోసం రైతులు చేయని ప్రయత్నం అంటూ లేదు.మామిడి పిందెలు ఉన్నచోట పసుపు రంగులో మరి రాలిపోతున్నాయి.ఒకవైపు పూతలు నిలబడక మరోవైపు ఉన్నచోట పసుపు రంగులో మారి పిందేలు రాలిపోతుండడంతో రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదేవిధంగా మామిడి పంట ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు.ఆశించిన దానికంటే తక్కువ పంట వస్తుందని మామిడి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యానవనాధికారులు మామిడి తోటలను పరిశీలించి మామిడి రైతులకు సలహాలు సూచనలు చేస్తున్నారు అయినా కూడా నల్ల తామరం పురుగు ఉద్ధృతి తగ్గడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అలాగే మామిడి తోటలో కొత్తగా వచ్చి చేరిన నల్ల తామర పురుగు నివారణ కోసం శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు మామిడి తోటల్లో నల్ల తామర పురుగు ఇలాగే ఉంటే భవిష్యత్‌ కొల్లాపూర్ మామిడి పండ్లు దొరకడం కష్టమని రైతులంటున్నారు ఇక ఈ నల్ల తామర పురుగు దెబ్బతో మామిడి చెట్లను తొలగించేస్తామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

రాత్రి ఉష్ణోగ్రతలు కొంత మేరకు పడిపోవడం వల్ల నల్ల తామర ఉదృతి కూడా ఎక్కువైనట్లు తెలిపారు. వీటి నివారణకు మొదటగా పూత ఒక మోస్తారులో నల్లగా మారి రాలిపోవడం, బూడిద తెగులు గమనించటం మరియు కొంత భాగం తేనె మంచు పురుగు ఉదృతి ఉండటం లేదా పూతను ఒక పేపర్ పై దులిపినప్పుడు పేను లాంటి నల్లటి తామర పురుగులను గమనించినట్లయితే వెంటనే హర్టికల్చర్ అధికారులను సంప్రదించి వారి సూచన మేరకు చర్యలు చేపడితే తెగుళ్లు నివారణ అవుతాయని కొల్లాపూర్ ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారుమొత్తంగా కొల్లాపూర్ మామిడికి మాత్రం కష్టకాలమే వచ్చింది.మరి అధికారులు ఏ విధంగా తెగుళ్ల నివారణ చర్యలు తీసుకుంటారో చూడాలి

Leave A Reply

Your email address will not be published.