పాయల్ శంకర్ , సుహసినిరెడ్డి మద్య ముదిరిన విబేదాలు
పాయల్ శంకర్ పరిశ్రమ పోరులో రైతులు లేరు

పరిశ్రమ పోరు పంచాయితీ పెట్టింది… కమలం పార్టీ లో చిచ్చు పెట్టింది…. ఉద్యమం క్రేడిట్ కోసం కత్తులు దూసుకుంటున్నారు బిజెపి నాయకులు…. క్రేడిట్ ఒకరికి దక్కకుండా మరోకరు ఎత్తగడలు వేస్తున్నారు…
రేణుక సిమెంట్ పరిశ్రమ నిర్వాసితుల పోరు .బిజెపి లో ఎందుకు అగ్గిరాజేస్తోంది.. పరిశ్రమ ఉద్యమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి వర్గాలుగా ఎందుకు విడిపోయారు.. కమలం పార్టీలో రేణుక సిమెంట్ పరిశ్రమ ఉద్యమ చిచ్చు పై ప్రత్యేక కథనం
. ఆదిలాబాద్ జిల్లాలో బిజెపి నాయకులు సర్కార్ వైపల్యాలపై సమరం సాగిస్తున్నారు… ఆ పోరాటంలో నాయకులమద్య కుంపట్లే పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సినా ఉద్యమం పార్టీని దిగజార్చుతోందని కార్యకర్తలు అందోళన చెందుతున్నారు
ఆదిలాబాద్ జిల్లా లో అపారమైన లైమ్ స్టొన్ నిల్వలు ఉన్నాయి.ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ, రాంపూర్, రామాయి ప్రాంతాలలోసిమెంట్ నిల్వలు ఉన్నాయి…ఈ నిల్వలు ఉపయోగించి సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.. ఈ పరిశ్రమ ను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలను ఆహ్వనించారు.. రేణుక. సిమెంట్ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.. అంతకుముందు పరిశ్రమ ఏర్పాటు చేయని వారి నుండి లైమ్ స్టోన్ నిల్వలు భూములను యాజమాన్యం లీజుకు తీసుకుంది… అదేవిధంగా కోందరు రైతుల నుండి భూములను కోనుగోలు చేశారు.. రామాయి, రాంపూర్ గ్రామాలలో నూట.ఆరు ఏకరాలభూమిని అదివాసీలు, బిసీల. నుండి భూములను కోనుగోలు చేసింది యాజమాన్యం.. ఆ భూములు కొనుగోలు చేసిన వారికి మూడు సంవత్సరాలలో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని.. అదేవిధంగా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది కంపేని
. కాని ఎళ్లు గడుస్తున్నా పరిశ్రమ నిర్మాణం చేపట్టలేదు… నిర్మాణం చేపట్టకపోవడంతో అదివాసీలు తమ భూములు తమకు ఇప్పించాలని పోరాటం చేస్తున్నారు.ఈ భూముల కోసం బిజెపి అధ్వర్యంలో పోరాటం సాగిస్తున్నారు,. బిజెపి నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ నాయకురాలు సుహసిని రెడ్డి అద్వర్యంలో కొన్ని రోజులుగా పోరాటం కోనసాగిస్తున్నారు.. గిరిజనుల భూములు గిరిజనులకు ఇప్పించడానికి సుహసినిరెడ్డి కార్యచరణ ప్రకటించారు… కార్యచరణ లో బాగంగా పరిశ్రమ ఇచ్చిన భూములు స్వాదీనం చేసుకోవడానికి సుహసిని రెడ్డి బాదిత రైతులతో ఎండ్లబండ్లతో ఆప్రాంతానికి చేరుకున్నారు.. అక్కడే భూముల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.. అయినప్పటికీ పోలీసులను ప్రతిఘటిస్తూ అందోళన నిర్వహించారు గిరిజనులు.. అందోళనలో సందర్భంగా గిరిజన మహిళలు పోలీసు వాహనం ఎక్కడంతో ఉద్రిక్రతలకు దారి తీసింది… అందోళన తీరుమారడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. అందోళన చేస్తున్నా వారందరిని అరెస్టు చేశారు.. వివిద పోలీసు స్టేషన్లకు తరలించారు.. అందోళనకు నాయకత్వం వహించిన సుహసిని రెడ్డి, పాయల్ శంకర్ కుమారుడుశరత్ ను అరెస్టు చేశారు…కోర్టులోరిమాండ్ చేశారు..ఆ తర్వాత ఇద్దరు కోర్టు నుండి బెయిల్ పోందారు ..ఈఅందోళనకు పాయల్ శంకర్ దూరంగా ఉండటం విశేషం..
.. రెండు రోజుల తర్వాత.మళ్లీ నిర్వహిసితుల. కోసం ఉద్యమానికి పిలుపునిచ్చారు పాయల్.. పిలుపులో బాగంగా భూములను ట్రాక్టర్లతో దున్నుతామని ప్రకటించారు… అదేవిధంగా భూములను అదివాసీలకు అప్పగిస్తామన్నారు…అందులో బాగంగా ట్రాక్టర్లతో బయలుదేరి దున్నడానికి వెళ్లుతున్నా పాయల్ శంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు…అదుపులోకి తీసుకొని గ్రుహ నిర్బందం చేశారు..అయితే ఈ. ఉద్యమానికి తమ మద్దతు లేదని… రైతులేవరు రావోద్దని సోషల్ మీడియాలో ప్రచారంనిర్వహించారు సుహసిని రెడ్డి వర్గీయులు
. పాయల్ నిర్వహిస్తున్నా ఉద్యమ తీరును అమె బహిరంగంగా తప్పబట్టారు…రైతులు లేకుండా ఉద్యమాన్ని ఏలా నిర్వహిస్తారని పాయల్ ప్రశ్నించారు..ట్రాక్టర్లతో ఇంటివద్ద దున్నుతారా లేదంటే సేకరించిన భూమిలో దున్నుతారా అంటూ నిలదీశారు.. క్రేడిట్ కోసం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయవద్దని కోరారు.. పార్టీలో విబేదాలకు కారణం ఏవరో మీకందరికి తెలుసన్నారు… ఇది బహిరంగ రహస్యమన్నారు., అయితే రేణుకా సిమెంట్ పరిశ్రమ ఉద్యమం క్రేడిట్ పోరు పార్టీలో పాయల్ ,సుహసిమి రెడ్డి మద్య విబేదాలు మరింత ముదిరేలా చేశాయి… ఇద్దరు తాము పోరాటం చేస్తున్నామంటే… తాము పోరాటం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.. తమకే క్రేడిట్ దక్కుతుందంటున్నారు.దీనితో ఇద్దరి మద్య విబేదాలు తారాస్థాయికి చేరాయని కార్యకర్తలు అందోళన చెందుతున్నారు… మరి పార్టీ పెద్దలు విబేదాలు పరిష్కరించడానికి ఏలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి