మరో ఇంద్రవేల్లి పోరాటానికి సిద్దమంటున్నా అదివాసీలు

అమరుల ఆశయాలు నేరవేరలేదంటున్నా అదివాసీలు

అడవి బిడ్డలు దోపిడిదార్ల పై తిరగబడ్డారు. రణం సాగించారు… రక్తం చిందించారు… భూమి కోసం… భుక్తి కోసం… విముక్తి కోసం. పోరులో అదివాసీలు అసువులు బాసారు… తిరుగుబాటు యుద్దం చేసిన తీరు మారలేదు‌.. అదివాసీల రాత మారలేదు… ఇంద్రవెల్లిలో నేత్తురు చిందించిన అదివాసీ అమరవీరుల ఆశయాలు ఏందుకు నేరువేరలేదు. అదివాసీబిడ్డల నేత్తుటి. పోరు పైప్రత్యేక కథనం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి పోరాటం ప్రపంచానికి స్పూర్తినిచ్చింది… ‌.ఆదివాసీలు భూమి కోసం , భక్తి కోసం, విముక్తి కోసం అదివాసీలు పోరాటం సాగించారు… అప్పట్లో పెత్తందార్లు, భూస్వాములు, సేట్ల దోపిడీ అంత..ఇంతకాదు.. గిరిజన బిడ్డల వేల ఎకరాల భూములను కబ్జా చేశారు..‌ ఉన్న భూములలో గిరిజన బిడ్డలు పంటలు పండిస్తే..‌ ఆ పంటలను తుట్టికి పావుసేరుకు కోనుగోలు చేసి లూటీ చేశారు దోపిడీదార్లు…

…దోపిడి ఒకవైపు ,మరోకవైపు అదిపత్యం కోసం గిరిజనులు అరాచాకాలు స్రుష్టించారు.ఆ అరాచకాలు, దోపిడిని తట్టుకోలేక. గిరిజనులు పోరాటానికి సిద్దమయ్యారు… అందులో బాగంగా 1981 ఎప్రిల్ ఇరవైన. సభను గిరిజన రైతుకూలీ సంఘం అద్వర్యంలో నిర్వహించారు..ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. దాంతో వేలాది మంది కాలినడకన. గిరిజనులు భూమికోసం, విముక్తి సభకు తరలివచ్చారు.. కాని సభలో పోలీసు అదికారి పై గిరిజన మహిళ. దాడి చేసిందని అనుమతి రద్దు చేశారు‌…. అదేవిధంగా వివాదాన్ని షాకు చూపి సభకు వచ్చిన. ప్రజల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు..‌ ఆ కాల్పుల్లో అక్కడిక్కడే పదమూడు మంది చనిపోయారు..అదివాసీలు మాత్రం వందమందికి పైగా చనిపోయారంటున్నారు. వందల మంది గాయపడ్డారు.. ఈ కాల్పులు తర్వాత. కాల్పుల్లో గాయపడి చెట్టుకోకరు అయ్యారు…ఆ చెట్లు ,పుట్టల్లో గాయపడి అనేక మంది చనిపోయారని గిరిజనులు అంటున్నారు… ‌ఇప్పటికి ఆ కాల్పుల్లో గాయపడి జీవచ్చంలా బ్రతుకుతున్నా వారు వందల. మంది ఉన్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆ
అదుకోవాలని కోరుతున్నారు.

అయితే భూకోసం, భుక్తికోసం, విముక్తి కోసం రణం సాగించిన తమ రాత మారలేదంట్నారు… ఐదవ షేడ్యూల్ ఏరియాలో భూముల పై గిరిజనులకు హక్కులుంటాయి..కాని1/70లాంటి చట్టాలను ఉల్లంఘించిన వేల ఏకరాలు పేత్తందార్లు మళ్లీ అక్రమించారని గిరిజనులు అంటున్నారు.. అదివాసీ బిడ్డల భూముల అక్రమించిన అదికారులు చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు..‌ఏకంగా ఇంద్రవేల్లి స్తూపంప్రక్కన ఉన్న స్థలంలో అక్రమంగా రేకుల. షెడ్డులు వేలిశాయంటే పరిస్థితి ఏలా ఉందో అర్థమవుతోంది… ఇంద్రవేల్లి రియల్ మాపియా యాబై వేంచర్లు వేసి దోపిడి సాగిస్తున్నారు.. ఒకవైపు సాగు భూములు మింగారు…మరోకవైపు గిరిజనులు అవాసంగా ఉండే ప్రాంతాలలో భూమల ను రియల్ ఎస్టేట్ వేంచర్లుగా మార్చుతున్నారు. ఇంద్రవేల్లి 30/40 ప్లాట్ కు ఎనబై లక్షలు పలుకుతుంది.. ఈవిదంగా రియల్ మాపియా గిరిజనులను లూటీ చేస్తున్నారని వాపోతున్నారు… భూముల పై హక్కుల లేని ప్రాంతాలలో భూస్వాములు దోపిడీ చేస్తున్నా అదికారులు పట్టించుకోవడం లేదని అదికారులు తీరుపై గిరిజన నాయకుడు భుజంగరావు మండిపడుతున్నారు..

. పోడు భూముల కోసం ప్రతిరోజు పోరాటం చేస్తున్నారు.. ‌ కాని హక్కు పత్రాలు ఇవ్వడంలేదు… వీటితో పాటు గిరిజన గూడాలకు కనీస వసతులు కరువయ్యాయి..‌త్రాగునీరు‌లేదు.. వైధ్యం అందడం లేదు. గర్బీణీ ‌మహిళలు అసుపత్రికి వెళ్లుదామంటే రోడ్లు లేవు ‌.దాంతో మహిళలు సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారు..‌తల్లులు కాకుండానే తనవులు చాలిస్తున్నా దయనీయ పరిస్థితులు ఉన్నాయని గిరిజనులు అవేదన వ్యక్తం చేస్తున్నారు

ఆకలి తీర్చే పోడు భూములకు పట్టాలులేవు.. గిరిజన గూడాలలో విధ్య లేదు..వైద్యం అందడంలేదు..కనీసం త్రాగడానికి నీళ్లు లేవు… ‌ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ‌మరోక పోరాటానికి సిద్దమంటున్నారు.. తెలంగాణ. సర్కారు అదివాసీల సమస్యలను పరిష్కరించడంలో విపలమైందని గిరిజనులు అరోపిస్తున్నారు‌‌‌… సమస్యల పరిష్కారం కోసం సర్కార్ పై పోరాటానికి సిద్దమంటున్నారు.. సర్కారు దిగీవచ్చేలా ఒక కార్యచరణ రూపోందించి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఇంద్రవేల్లి అమరవీరుల ఆశయ‌కమీటి అద్యక్షుడు పుర్కబాపురావు

Leave A Reply

Your email address will not be published.