అదికారుల వేదింపులే దీపిక అత్మహత్యకుకారణమా?
దీపిక అత్మహత్య చేసుకునేంత పిరికిదికాదంటున్నా తండ్రి వీరన్న

. బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని అత్మహత్య…. పరీక్ష రాసింది…ప్రాణాలు కోల్పోయింది.. . దీపిక ఉరితో ఊపిరి తీసుకోవడానికి కారణాలేంటి…పరీక్షలలో డిబార్ చేస్తామని బేదిరించిన అదికారులేవరు..ఆత్మహత్య ను దాచడానికి అదికారులు ఏందుకు ప్రయత్నించారు.. బాసర. ట్రిపుల్ ఐటిలో దీపిక విద్యార్థిని ఆత్మహత్య పై ప్రత్యేక కథనం
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నా దీపిక ఆత్మహత్య కలకలం రేపుతోంది… ఆమే ఉదయం తోమ్మిది నుండి పన్నెండు గంటల వరకు పరీక్ష రాసింది… అక్కడే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3లో ని బాత్రూమ్ లో పరీక్షలనంతరం ఉరివేసుకోని అత్మహత్యకు పాల్పపడింది… అయితే పరీక్ష రాసిన తర్వాత. దీపిక బాత్రూమ్ వెళ్లింది…ఏంతకీ రాలేదు… దీపిక బాత్రూమ్ నుండి బయటకు రాలేదని తోటి విద్యార్థులు అదికారులకు సమాచారం ఇచ్చారు… ఆ సమాచారం తో బాత్రూమ్ బద్దలు చేశారు…అందులోనే చున్నితో ఉరివేసుకోని ప్రాణాలు కోల్పోయింది…
కాని కోన ఊపిరితో ఉందని. అదికారులు డ్రామాలు అడారు… అందులో బాగంగా ఆమేను బైంసా అసుపత్రికి చికిత్స కోసం తరలించారు… అక్కడ అసుపత్రిలో వైద్యలు దీపికను పరిశీలించారు…అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్థారించారు… దీపిక శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం నిర్మల్ అసుపత్రికి తరలించారు.
అయితే దీపిక ఏలా చనిపోయిందనే దానిపై బాసర ట్రిపుల్ ఐటి అదికారులు కథలు అల్లారు. దీపిక పిట్స్ వచ్చిందని,అనారోగ్యంతో బాదపడుతుందని,.అందుకే ఆత్మహత్య చేసుకుందని అబద్దాలు చెప్పారు. దీపిక అత్మహత్యకు కారణం డిబార్ చేస్తామనే బేదిరింపులు కారణమంటున్నారు ..పరీక్షలు రాస్తున్నా సందర్భంగా ఐదుగురు విద్యార్థినిలు మాస్ కాపియింగ్ కు పాల్పడ్డారు… ఆ. పాల్పపడిన వారిలో దీపిక ఒకరు… మాస్ కాపియింగ్ పాల్పపడినందు వల్ల డిబార్ చేస్తామని అదికారులు బెదిరించారు… డిబార్ తో పరువు పోతుందని మనస్థాపంతో అత్మహత్యకు చేసుకుందని విద్యార్థులు అంటున్నారు.. డిబార్ చేస్తామని బెదరించింది ఏవరు అనేదిఉత్కంఠ రేపుతోంది. బెదిరించిన అదికారుల పై చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు
డిబార్ చేస్తామని బెదిరించి…విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన. తల్లిదండ్రులకు సరియైన సమాచారం ఇవ్వలేదు… దీపిక. చనిపొయిందనే సమాచారం కూడ ఇవ్వలేదని తండ్రి వీరన్న అవేదన వ్యక్తం చేస్తున్నారు.. సీరియస్ గా ఉందంటే నిర్మల్ వచ్చామన్నారు. తీరా చూస్తే కూతురుచనిపోయిదని విలపించారు.. ఏ. కారణంతో చనిపోయిందనే అంశాన్ని చెప్పడం కూడ లేదన్నారు.. తన కూతురు ఆత్మహత్య చేసుకోనేంత పిరికిది కాదని… ఏవరో హత్య చేశారని ఆరోపిస్తున్నారు… దీపిక చావు కు కారణాలు తెలపాలని రాత్రంతా అసుపత్రిలోని ఐసియులో తండ్రి వీరన్న. అందోళన చేపట్టారు.. కారణం చెప్పకుంటే శవాన్ని తీసుకవెళ్లనని రాత్రంతా అసుపత్రిలో ఉన్నారు.. . దీపిక ఏందుకు చనిపోయిందని ఏవరైనా అడిగితే ఏమని సమాదానం చెప్పాలని అదికారులను ప్రశ్నిస్తున్నారు వీరన్న..ఆకారణంగా తన. కూతురును పోట్టనపెట్టుకున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వీరన్నను కుటుంబ సభ్యులు ఒప్పించడంతో శవాన్ని పోస్ట్ మార్టమ్ చేయడానికి అంగీకరించారు.. పోస్ట్ మార్టమ్ అనంతరం శవాన్ని అంత్యక్రియల కోసం బారీ బందోబస్తుమద్య. ఊరికి తరలించారు
. దీపిక అత్మహత్య అదికారుల వేదింపులే కారణమని ఆరోపణలు ఉన్నాయి..పరీక్షలలో మాస్ కాపియింగ్ పాల్పపడినందుకు డిబార్ చెస్తామనిబేదిరించడం వల్ల చనిపోయిందనే ఆంశం ఇంచార్జ్ వీసి వెంకటరమణ స్పందించారు…. అత్మహత్యకు కారణాల అన్వేషణ కోసం విచారణ కమీటిని నియమించారు..కమిటి విచారణలో ఏవరి తప్పిదం ఉంటే వారి పై చర్యలు తీసుకుంటామంటున్నారు.