మళ్లీ ప్రజాప్రతినిదిగా గెలుస్తా..పోంగులేటి

రామరాజ్యం స్థాపిస్తా ... పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం జిల్లా ముదిగొండ లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
జనవరి 1 నుంచి ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతోంది అని తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారన్నారు.
పార్లమెంట్ టిక్కెట్ దగ్గర నుంచి తనకు, తన అనుచరులకు అనేక అవమానాలు జరిగాయన్నారు.

మాటలు చెప్పడం వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ పని అని
మాటలు చెపితే మూడో సారి కూడా ఓట్లేస్తారనే నమ్మకం కేసీఆర్ ఉందని పొంగులేటి విమర్శించారు.
యువత కి ఉద్యోగాలు,డబుల్ బెడ్ రూం ఇల్లు,రైతు రుణమాఫీ చేస్తానన్న మాటలు అబద్దమా అని ఆయన ప్రశ్నించారు.ఇవన్నీ అమలు చేయని కేసీఆర్ ని గద్దె దించాలన్నారు.రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల ను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన చెప్పారు.ప్రజాప్రతినిదిగా మీ మధ్య ఎలా ఉన్నానో మీ దీవెనలతో గెలిచి భవిష్యత్ లో కూడా మీ మధ్యనే ఉంటానన్నారు.ఆనాడు ప్రజాప్రతినిధులుగా కావడానికి మీ అందరికి అండగా ఉన్ననని మీరు కష్టాల్లో ఉన్నప్పుడు బిఅర్ ఎస్ పార్టీ పట్టించుకొనప్పుడు ఆదుకున్ననన్నారు.అధికార మదం తో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు విర్రవీగే టైమ్ అయిపోయిందనినాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో గుర్తు ఉంచుకోవాలన్నారు నేను మాటల మనిషిని కాదని మీరందరూ ఒకే గూటికి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నన్నారు.

Leave A Reply

Your email address will not be published.